సబ్ ఫీచర్

సామాన్యుడికి భారం.. జిఎస్‌టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రవేశపెట్టబోయే ‘వస్తుసేవల పన్ను’ (జిఎస్‌టి) విధానం సామాన్యుడికి గుదిబండగా మారే అవకాశాలున్నాయి. నాలుగంచెల ఈ కొత్త పన్నుల పద్ధతి వల్ల సాధారణ జనం అనునిత్యం వాడే వంటనూనెలు, మసాలా దినుసులు, మాంసం వంటివి మరింత ‘ప్రియం’ కానున్నాయి. నిత్యావసర సరకుల ధరలు పెరిగితే సగటుజీవి ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారే ప్రమాదం ఉంది. జిఎస్‌టి వల్ల టీవీలు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయి. వీటి ధరలు తగ్గినంత మాత్రాన పేద, మధ్యతరగతి ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. నిత్యావసర సరకులు కొనుక్కోలేక పేదవాడు మరింత పేదవాడిగా మారే ప్రమాదం ఉంది. ఉన్నత వర్గాలవారు వినియోగించే వస్తువుల ధరలు తగ్గడం వల్ల వారు ఇంకా సంపన్నులవుతారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జిఎస్‌టి విధానానికి ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. దీంతో ఈ విధానం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలుకావడం తథ్యమని తేలింది. నా లుగు రకాల పన్నుల వ్యవస్థలో అతి తక్కువ పన్ను ఆరు శాతం కాగా, రెండు స్టాండర్డ్ రేట్లు 12 శాతం, 16 శాతంగా ఉంటాయి. ఇక, దాదాపు అన్ని రకాల ఎఫ్‌ఎంసిజి, వినియోగ వస్తువులకు వర్తించే గరిష్ట పన్నురేటు ఇరవై ఆరు శాతంగా ఉంటుంది. ఆరోగ్యానికి హాని చేసే సిగరెట్లు, మద్యం, ఇతర పొగాకు ఉత్పత్తులపై, కాలుష్య కారక వస్తువులపై అదనపు సుంకం విధించే అవకాశం ఉంది. నాలుగంచెల పన్ను విధానం కారణంగా చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణంపై పడనున్న ప్రభావానికి సంబంధించి కేంద్రం అంచనాల ప్రకారం- ప్రస్తుతం నాలుగు శాతం పన్ను పడుతున్న మాంసం, కొబ్బరి నూనెలాంటి సరకులపై ఇక ఆరుశాతం పన్ను విధించాల్సి ఉంటుంది. రిఫైన్డ్ ఆయిల్, ఆవనూనె, వేరుశెనగ నూనె లాంటి తైలాలపై పన్ను అయిదు శాతం నుంచి ఆరు శాతానికి పెరిగే అవకాశం ఉంది. పసుపు, జీలకర్ర వంటివాటిపై పన్ను మూడు శాతం నుంచి ఆరు శాతానికి పెరగనుంది. ధనియాలు, మిరియాలు, నూనెగింజలపై పన్ను అయిదు నుంచి ఆరుశాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. జిఎస్‌టి విధానం ఫలితంగా టీవీలు, కుక్కర్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లు, ఫ్రిజ్‌ల వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు ఇరవై తొమ్మిది శాతం నుంచి ఇరవై ఆరు శాతానికి తగ్గుతుంది. సౌందర్య సాధనాలైన పెర్‌ఫ్యూమ్‌లు, పౌడర్లు, హెయిర్ ఆయిల్స్, క్రీమ్‌లు, సబ్బులు, క్లీనింగ్ పౌడర్లపై పన్ను తగ్గే అవకాశం ఉన్నందున వాటి ధరలు కాస్త తగ్గుముఖం పడతాయి. అయితే, గ్యాస్ స్టౌలు, ఇళ్లలో దోమలు, బొద్దింకల నివారణకు వాడే రెపెల్లెంట్ల ధరలపై ఇరవై అయిదుశాతం పన్ను విధించనున్నందున వాటి ధరలు పెరుగుతాయ.
ప్రస్తుతం మూడు నుంచి తొమ్మిది శాతం పన్ను విధిస్తున్న వస్తువులన్నీ ‘ఆరు శాతం పన్ను’ పరిధిలోకి వస్తాయి. తొమ్మిది నుంచి పదిహేను శాతం పన్ను విధిస్తున్న వస్తువులు పనె్నండు శాతం పరిధిలోకి, 15 నుంచి 21 శాతం పన్ను విధించే వస్తువులన్నీ పద్దెనిమిది శాతం పన్ను పరిధిలోకి వస్తాయి. 21 శాతానికి పైన పన్ను విధిస్తున్న వస్తువులు 26 శాతం గరిష్ట పన్ను పరిధిలోకి రానున్నాయి. ఈ పన్నుల పరిధిని పూర్తి స్థాయిలో ఖరారు చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన జిఎస్‌టి కౌన్సిల్ త్వరలోనే భేటీ అవుతుంది. వినియోగదారులపై పెనుభారం మోపకుండా జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయాలు తీసుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ చెబుతున్నా, సామాన్యులకు సంబంధించి మాత్రం జిఎస్‌టి విధానం భారంగా ఉండే అవకాశం ఉంది.

-గుండు రమణయ్య