సబ్ ఫీచర్

ట్రంప్ గెలుపు ఏం చెబుతోంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను అధికంగా ప్రభావితం చేసే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు అనేక కఠోర వాస్తవాల్ని కళ్లకు కట్టిస్తున్నాయి. అగ్రరాజ్యం అధ్యక్ష పదవికి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనందున ఆ ప్రభావం మిగతా దేశాలపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎంతోకొంత ఉంటుందన్నది కాదనలేని నిజం. ట్రంప్ ఎన్నిక నేపథ్యం, ఆ తర్వాతి పరిణామాలను విశే్లషిస్తే అనేక విషయాలు అవగతమవుతాయి. వాటిలో కొన్ని...
* విశ్వవ్యాపిత నాయకత్వ లేమికి ట్రంప్ ఎన్నిక ఓ నిదర్శనం. దీని పర్యవసానాలు అనూహ్యం. నాయకత్వ లక్షణాలకు, వ్యక్తిత్వ ఔన్నత్యాలకు- విజయాలకూ సంబంధం లేదని తేలింది.
* మీడియా మొత్తం ఎంత వత్తాసు పలికినా, నెత్తినపెట్టుకుని భజన చేసినా నిరుపయోగమని హిల్లరీ ఓటమితో రుజువైంది.
* వ్యక్తిస్థాయి విలువలు, ప్రమాణాలు, ప్రవర్తన, నైతికతలు లాంటి వాటికి ఎన్నికల్లో గెలుపునకు- కపట రాజకీయాల్లో ఎలాంటి సంబంధం లేదు.
* ఎవరూ ఎల్లకాలం అందరినీ వంచింపలేరనీ, ప్రచార పటాటోపాలకన్నా చేతలు ముఖ్యమనీ, తమ అరికాలి కింద మంటల సెగ గురించి మరొకరు చెప్పనవసరం లేదు.
* ఎంతగా ఆశలు కల్పిస్తే అంతగా ఆశాభంగం పొంది ఓటర్లు కసి తీర్చుకుంటారని తేలింది.
* యుద్ధోన్మాద, హింసాయుత ప్రపంచాన్ని ప్రజలు ఎన్నడూ కోరరనీ, ప్రపంచ శాంతినే అభిలషిస్తారనీ, స్నేహహస్తానే్న విశ్వవ్యాపితంగా విశ్వసిస్తారని రుజువైంది.
* ఎన్ని ఎద్దేవాలు, ఎకసెక్కాలు, హాస్యోక్తులు వెదజల్లినా అవన్నీ అసహన ఉగ్రప్రవాహంలో కొట్టుకుపోతాయనీ, ప్రజాభిప్రాయం మలచడం సులువుకాదని తేలింది.
* అధికారాన్ని అడ్డంపెట్టుకుని చేసే అడ్డమైన రహస్య పనులు ఏదో రోజు ఎదురొచ్చి ఎదుగుదలని ఎదురొడ్డి నిలుపుతాయనీ, ఎంపిక అనుభవ రాహిత్యం అడ్డుకాదనీ అర్థమైంది.
* ప్రజలకు మరో మంచి ప్రత్యామ్నాయం లేకుండా చూడడం, చేయడం, అంతా ఒకే తానులో ముక్కలుగా పరిణమించి పరిగణించబడుతుంది.
* ప్రజల ఆశలు, ఆకాంక్షలు, భ్రమలు పటాపంచలు చేయడంలో ఎన్నికైన ఏలికలు ఎప్పటికప్పుడు కొత్త ప్రమాణాలు నెలకొల్పడంలో పోటీ పడతారు.
* ద్వంద్వ ప్రమాణాలు పాటించడంలో నేతల బండారం బయటపడి వారి నిజరూపం బట్టబయలైంది.
* మెరిసేదంతా బంగారం కాదనీ, ప్రజాస్వామ్యంలో విజ్ఞులు ప్రజలేననీ, అపహాస్య కారకులు నాయకులేనని తేలింది.
* గిట్టనివారి పొడ సహించక పొగపెట్టే ప్రయత్నాలకు ఆరంభం మొదలైంది.
* తెల్సుకోగలిగితే, నేర్చుకోగలిగితే అన్నిస్థాయిల్లో రాజకీయ నేతలకూ గుణపాఠాలు ఈ ఫలితాలు.
* నూతన అధ్యక్షుడి మాటలు ఎంతవరకూ చేతల్లోకి వస్తాయో విధానాలుగా రూపాంతరం చెంది ప్రపంచాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తాయోనని అంతా ఎదురుచూస్తున్నారు. అవి తప్పక మంచిగా ఉంటాయని, ఉండాలని భావించడం ఇప్పటి అవసరం.

-బి.లలితానందప్రసాద్