సబ్ ఫీచర్

నగరాలకు సరికొత్త ఆకర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోని ప్రధాన నగరాలతో పాటు ద్వితీయశ్రేణి నగరాలను మేటి నగరాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆకర్షణీయ నగరాల (స్మార్ట్ సిటీస్) పథకం ఇపుడిపుడే ఊపందుకుంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ తీరు చూసి ఈ పథకం ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోవచ్చని, ఇదో సుదూర స్వప్నంగా మిగిలిపోతుందా? అంటూ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. అంతా నగరాల్లో జీవించాలని సహజంగానే కోరుకుంటారు. దానికి కారణం ఉపాధి, వైద్య సౌకర్యాలు, పిల్లలకు చదువులు, ఉద్యోగాలు వంటి అనేక కారణాలున్నాయి. దాంతో నగరాలపై ఒత్తిడి పెరిగిపోతోంది. ఎంత సౌకర్యాలు కల్పించినా, నగరవాసులకు సంతృప్తి కలిగించడం కత్తిమీద సామే అవుతోంది.
స్మార్ట్ సిటీస్ పథకంతో నగరాల దశ-దిశ మారుతుందని, అవి కొత్త రూపం సంతరించుకుంటాయని అంతా భావిస్తున్నారు. ఈ నగరాల్లో వ్యర్ధ నీటి పునర్ వినియోగం, నీటి వృథాను అరికట్టే సెన్సార్లు, నీటి యాజమాన్యం, హరిత ప్రాంతాల ఏర్పాటు, భౌతిక, సాంఘిక అవస్థాపనా సౌకర్యాలు కల్పించడం, ప్రత్యేక ఆర్ధిక మండళ్ల ఏర్పాటుతో ఉపాధి, వస్తుసేవల లభ్యత, ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదల, సహజ వనరుల సమర్ధ వినియోగం, పాలనలో పౌరుల భాగస్వామ్యం పెంచడం, పర్యావరణ పరిరక్షణ- యాజమాన్యం, స్మార్ట్ పట్టణాభివృద్ధి సాధన కార్యాచరణ, సుస్థిర వృద్ధి, విశ్వవ్యాప్త అనుసంథానం, సృజనాత్మక పరిశ్రమల ఏర్పాటు, ఆధునిక సమాచార వ్యవస్థ అందుబాటులోకి తీసుకురావడం, ఇ- సుపరిపాలన, పారిశ్రామికీకరణ, భద్రతా వ్యవస్థ ఆధునికీకరణ వంటి చర్యలతో నగరాల్లో సౌకర్యాల స్థాయిని పెంచడంతో పాటు ప్రజలకు జీవనానుభూతిని పెంచగలుగుతారు.
ఇప్పటికే మూడు దశల్లో ఆకర్షణీయమైన నగరాల జాబితాను కేంద్రం ప్రకటించింది. ఆయా నగరాల ప్రతిపాదనలకు అనుగుణంగా నిధుల మంజూరు కూడా మొదలైంది. దేశవ్యాప్తంగా 109 స్మార్ట్ సిటీలతో పాటు ‘అమృత’ నగరాల ఎంపిక తుది దశకు చేరుకుంది. 48 వేల కోట్ల మేర వెచ్చించి ఆకర్షణీయ నగరాలను అభివృద్ధి చేస్తుండగా, మరో 50వేల కోట్ల రూపాయిలతో ‘అమృత’ నగరాలను అభివృద్ధి చేస్తారు. ఆంధ్రాలో విశాఖ, తిరుపతి, కాకినాడ, తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ నగరాలతో పాటు వీలైతే కరీంనగర్ కూడా ఈ జాబితాలో త్వరలో చేరనుంది.
స్మార్ట్ సిటీ హోదాలో నగరాల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై ‘ది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్’ పరిశీలనాత్మక సూచికల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం స్మార్ట్ సిటీల అంచనా, సామర్ధ్యాలను విశే్లషిస్తుంది. నవంబర్ 29 వరకూ ఈ సూచికలపై ప్రజాభిప్రాయాన్ని కూడా స్వీకరిస్తోంది. అనంతరం ఈ నగరాలకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చే దిశగా ప్రయత్నాలు చేయబోతున్నారు. ప్రధానంగా సుఖవంతమైన రవాణా సౌకర్యాలు, సమాచార సాంకేతిక రంగం, సామాజిక ఆరోగ్య అంశాలు, సుపరిపాలన, పారిశుద్ధ్యం , రక్షిత తాగునీటి వినియోగం వంటి వాటిపై కూడా బ్యూరో దృష్టిపెట్టింది.