సబ్ ఫీచర్

రోజూ ఒక జామపండు చాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జామకాయంటే అందరికీ చాలా ఇష్టం. తీపి, వగరు, పులుపు మూడు రుచుల మేలైన కలయిక జామకాయ. చిన్నారులనుండి పెద్దలవరకూ జామకాయంటే ఇష్టపడి తింటారు.
జామకాయలోనూ, జామపండులోనూ పోషక విలువలు మెండుగా వున్నాయి. జామకాయ పచ్చిదే తింటారు చాలామంది. మిగతా పండ్లకంటే విటమిన్ సి,ఇనుము అధికంగా వున్నాయి.
ఈ కాయ తినడంవలన దగ్గు, జలుబు, ఇన్‌ఫెక్షన్లు రావు. విటమిన్ సి వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పచ్చికాయలో విటమిన్ల శాతం అధికంగా వున్నాయి. పచ్చి జామ జ్యూస్ త్రాగడం చాలా మంచిది.
సాధారణంగా మనిషి రోజుకు ఒక జామకాయ తింటే ఆరోగ్యం, ఆయుష్షు మెరుగుపడుతుందంటారు. ఆయుర్వేదంలో ఈ పండు విశిష్టత గురించి చక్కగా వివరించడం జరిగింది. జామకాయ తిన్నవారికి అధిక బరువు సమస్య ఉండదు. జామపండు జీర్ణశక్తిగలది, పోషక విలువలు అధికంగావున్నాయి. చిన్నపిల్లలకు గర్భిణీ స్ర్తిలకు మేలైనవి.
కండరాలకు,నరాలకు ఉపశమనం కలిగించే గుణాలు అధికంగా వున్నాయి. కంటిచూపునకు దోహదపడే విటమిన్ ఏ జామలో వుండడం విశేషం. పంటినొప్పికి జామ ఆకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. జామ ఆకుల్ని మెత్తగా నూరి చిగుళ్ళకు పట్టించుకుంటే నోటిలోని చెడు బాక్టీరియా పోతుంది. పంటినొప్పి వుండదు. గుండె ఆరోగ్యానికి సోడియం, పొటాషియం ముఖ్యమైనవి. రక్తప్రసరణ సవ్యంగా జరిగటానికి దోహదపడే పొటాషియం జామలో వున్నాయి. పీచు పదార్థములు 12 శాతం లభిస్తాయి. ప్రతి మనిషీ రోజుకొక జామపండు తింటే ఆరోగ్యకరం, ఆనందదాయకమంటారు. మధుమేహం దరిజేరనీయదు.

- ఎల్.ప్రపుల్లచంద్ర