సబ్ ఫీచర్

ట్రావెల్ టాటూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాటూ కల్చర్ ఇప్పుడు అన్ని దేశాలనూ చుట్టివేసింది. యూత్‌లో క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. సమ్‌ధింగ్ డిఫరెంట్‌గానే ఉంటారు. నా రూటే సపరేట్ అనే కుర్రాళ్లు మాత్రం మనసుకు బాగా నచ్చిన లొకేషన్‌ను ఒంటిపై టాటూగా పొడిపించుకునేంతవరకూ నిద్రపోరు. ఈ ట్రెండే ట్రావెల్ టాటూస్! కొంతమంది అయితే విమానాన్ని బాడీమీద టాటూగా వేసుకుంటారు. ఇంకొందరైతే ఎవరికీ అర్థంకాని నెంబర్లను బొమ్మలాగా వేయించుకుంటారు. ఇష్టమైన పేర్లు.. ప్రదేశాలు.. వేటినైనా సరే శరీరమనే కాన్వాస్‌పై పొడిపించుకోవచ్చు.
బేసికల్‌గా టాటూ ఒక అద్భుతమైన బాడీ ఆర్ట్. ఇష్టమైన పేర్లు.. ప్రదేశాలు.. వేటినైనా సరే.. శరీరమనే కాన్వాస్‌పై పొడిపించుకోవచ్చు. వాస్తవానికి... భారతదేశానికి టాటూ కొత్తకాదు.ఏదైనా కొత్త ప్రాంతానికి టూర్‌కెళ్ళే వాళ్లు తమ చేతులమీద, పాదాలమీద, వీపు భాగంలో, వేళ్ళమీద, మోచేతుల మీద, రిస్టుమీద ట్రావెల్ టాటూస్‌ను సరదాగా వేయించుకోవడం చూడొచ్చు. కొన్ని టాటూలు వారు వెళ్ళే ప్రాంతాలను తెలిపేవిగా వుంటాయి.
అడ్వెంచర్ టూర్లు చేసేవాళ్లు కూడా ప్రత్యేకించి ట్రవెల్ టాటూలను వేయించుకుంటుంటారు. ఈ ట్రావెల్ టాటూస్‌లో చాలా రకాలున్నాయి. నాటికల్ టాటూస్ ఉంటాయి. ఎక్కువగా ఓడలు, యాంకర్స్ వేయించుకుంటుంటారు. అలాగే ఎక్కడికైనా స్పెషల్ ప్రదేశాలకు వెడుతుంటే వాటిని తెలిపే బొమ్మలను కూడా టాటూలుగా వేయించుకుంటారు. అవి ట్రావెల్ కానె్సప్టుని ప్రతిఫలించాలనేం లేదు. టాటూ వారు వెళ్లిన ప్రాంతంలోని ఒక ఇల్లు కావచ్చు, లేదా ప్రముఖ ప్రదేశం కూడా కావచ్చు. కొంతమంది ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని తెలిపేలా మ్యాప్‌ను టాటూగా వేయించుకుంటారు. తాము ఏ ఏ దేశాలు తిరగాలనుకున్నారో ఆ మ్యాపులన్నీ తమ శరీరంపై టాటూగా వేయించుకునే పర్యాటక ప్రియులు ఉన్నారు.
ఇంకొందరు గ్లోబు బొమ్మను టాటూగా వేయించుకుంటారు. గ్లోబునే సూట్‌కేసు ఆకారంలో టాటూగా వేయించుకోవడమూ మనం చూడొచ్చు. ట్రావెల్ టాటూస్‌లో కంపాస్ కామన్ థీమ్. దీన్ని చాలామంది రిస్టుపై వేయించుకుంటారు. కొందరు చిన్న చిన్న టాటూలు వేయించుకుంటారు. ముఖ్యంగా విమానం టాటూను వేయించుకుంటారు. ప్రపంచపటం మొత్తాన్ని టాటూగా వేయించుకునే ట్రావెల్ ప్రియులున్నారు.పోస్టేజ్ స్టాంప్, పోస్ట్‌మార్క్ ట్రావెల్ టాటూస్ కూడా టూరిస్టులు వేయించుకుంటారు. ఇవి టూర్టిల హోమ్‌టౌన్‌ని తెలుపుతాయి. కొందరు తమకిష్టమైన ప్రదేశాలను టాటూస్‌గా వేయించుకుంటారు. ట్రావెల్ అనుభవాలను తెలిపే ట్రావెల్ టాటూలు కూడా ఉన్నాయి. సముద్ర ప్రయాణాలను సూచించే టాటూలు కూడా వేయించుకుంటారు. అలాగే పాస్‌పోర్టు థీమ్‌తో ఉంటే ట్రావెల్ టాటూస్ కూడా ఉన్నాయి. ఇలా రకరకాల థీమ్‌లతో ట్రావెల్ టాటూస్ వేయించుకుని తమ పర్యటనను కొనసాగించే టూరిస్టులెందరినో చూడొచ్చు. ట్రావెల్ టాటూలకు డిమాండ్ కూడా బాగా ఉంది.

-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి