సబ్ ఫీచర్

మద్యంపై మహోద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపూర్ణ మద్యపాన నిషేధం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విఫలమైనప్పటికీ, తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకంజ వేసే ప్రసక్తి లేదని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దృఢచిత్తంతో ముందుకు దూసుకుపోతున్నారు. మద్యపాన నిషేధం ఫలితంగా వేల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతామని తెలిసి కూడా ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా ‘లిక్కర్ మాఫియా’కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి బిహార్‌లోకి మద్యం దిగుమతి కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మద్యం బాటిళ్ల స్మగ్లింగ్‌ను అడ్డుకోవాలంటూ ఎక్సయిజ్ శాఖ అధికారులను ఆయన పరుగులు తీయిస్తున్నారు. ఎక్సయిజ్ అధికారుల దాడులు, అరెస్టులు, కేసుల కంటే- సంపూర్ణ మద్యపాన నిషేధంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు.
మద్య నిషేధంపై ప్రచార కార్యక్రమాల్లో భాగంగా వచ్చే ఏడాది జనవరి 21న ప్రపంచంలోనే అతిపెద్ద ‘మానవహారం’ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించారు. బిహార్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడువేల కిలోమీటర్ల పొడవున ఏర్పాటయ్యే మానవహారంలో రెండు కోట్ల మంది ప్రజలు భాగస్వామ్యం కావాలని, ఇందుకు వివిధ స్థాయిల్లో విస్తృత సన్నాహాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బిహార్ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ ‘సంపూర్ణ మద్యపాన నిషేధం’ విధించింది. ఇందుకు మద్దతుగా తొలి విడత ప్రచార కార్యక్రమాలను ఇదివరకే పూర్తి చేశారు. రెండో విడత ప్రచారం సందర్భంగా ప్రపంచంలోనే అతి పెద్ద మానవహారం ఏర్పాటు చేసి బిహార్ ఘనతను చాటిచెప్పాలని అధికారులకు, ప్రజలకు నితీష్ కుమార్ విజ్ఞప్తిచేశారు. ఈ మానవహారంలో ప్రతి కిలోమీటర్‌కు రెండువేల మంది ప్రజలు హాజరుకావాలని, ఇందుకు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న ఏడు ప్రధాన నిర్ణయాలలో మద్యపాన నిషేధం ఒకటని, దీన్ని ఆచరణలో నిజం చేసేందుకు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టినట్టు ముఖ్యమంత్రి గుర్తు చేస్తున్నారు.
వచ్చే ఏడాది జనవరి 21న ఏర్పాటుచేసే అతిపెద్ద మానవహారంలో ప్రధాన మార్గం వెంబడి దాదాపు 60 లక్షల మంది ప్రజలు పరస్పరం చేతులు పట్టుకుని నిలబడతారు. జిల్లాల్లోని మిగతా మార్గాల్లో కోటిన్నర మంది పాల్గొంటారు. ప్రధాన మార్గంతో మిగతా మార్గాలన్నీ అనుసంధానం అవుతాయి. ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే మానవహారం అరగంటకు పైగా చూపరులకు కనువిందు చేస్తుంది. రోడ్డుపక్కన వరుసలో నిలబడి ఎలాంటి అంతరాయాలు లేకుండా క్రమశిక్షణతో మానవహారం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రజలకు సూచించారు.
మద్యపాన నిషేధంపై ప్రభుత్వం ప్రారంభించే రెండో విడత ప్రచార కార్యక్రమాలు వచ్చే ఏడాది మార్చి 22 వరకూ కొనసాగుతాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మానవహారంగా ప్రచారం చేసేందుకు ఫొటోలు తీసేలా డ్రోన్లు, హెలికాప్టర్లను వినియోగిస్తారు. శాటిలైట్ ఫొటోలను కూడా తీసి ప్రచారం చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి కోరారు. *