సబ్ ఫీచర్

ధర్మకర్తలా? ధర్మహర్తలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైస్తవుల ప్రార్థన ప్రదేశాలు చర్చిలు కాని, ముస్లింల ప్రార్థన ప్రదేశాలు మసీదులు కాని, ప్రభుత్వం యొక్క పాలనలో, అజమాయిషీలో లేవు. కేవలం హిందువుల దేవాలయాలు మాత్రమే ప్రభుత్వపు అధీనంలో, బ్రిటీష్ పాలన కాలంనుండి ఇప్పుడు కూడా వుంటున్నాయి. అందులోనూ దేవుళ్ళకు భక్తులిచ్చే కానుకల మూల్యం ఎక్కువగా వుంటేనే ప్రభుత్వం ఆ దేవాలయాలను తన గుప్పెట్లో పెట్టుకుంటుంది. తక్కువ ఆదాయం వున్నవి ఎంత పురాతనమైనవి అయినా, శిథిలవౌతున్నా మూతపడి పోతున్నా ప్రభుత్వం పట్టించుకోదు. భక్తులిచ్చే కానుకలు దేవాదాయముగా కాక, దేవాదాయశాఖ యొక్క ప్రభుత్వం యొక్క ఆదాయంగా చూడబడుతున్నాయి. ఎక్కువ ఆదాయం, ఆస్తులు వున్న దేవాలయాలను తమ గుప్పెట్లో పెట్టుకుని, పాలక పార్టీయొక్క అధినేత తన ఇష్టం వచ్చిన వారిని ధర్మకర్తలుగా నియమిస్తున్నారు. వీరిలో అత్యధికులు పార్టీకి విరాళాలిచ్చినవారు, పార్టీ అధినేతకు దాసులైనవారు, పార్టీని బలపరచేవారు. ప్రభుత్వంలోని మరే ఉద్యోగం పొందనివారు ఉంటున్నారు. ఈ ధర్మకర్తలకు ఈ విధమైన అర్హతలు ఉండాలని, అర్జీదారులను ఎన్నుకోవడానికి ఫలానా సమితి ఉంటుందని, నియమనిబంధన ఉన్నట్లు లేదు. ఎంతోమంది అనర్హులే ఉంటున్నారు కానీ హిందూ ధర్మ హితైషులు కాని, ధర్మరక్షకులు గాని, దేవాలయ నిర్వహణ యందు శ్రద్ధచూపే వారుకాని ఉండడం లేదు. ఒక ముఖ్యమంత్రి సమయంలో ఆ పార్టీకి మద్దతునిచ్చే మరో పార్టీ నాయకుని యొక్క మద్రాసులో నివశిస్తున్న వియ్యంకుడును తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యునిగా నియమించారు. దరిమిలా ఆయన ఇంట్లో పది కోట్ల రూ.ల నల్లధనం నోట్లు దొరికాయి. ఈ నల్లధన దొర దైవసాక్షిగా ధర్మకర్తగా ప్రమాణం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రిగారిచే తి.తి.దే. పాలక మండలికి నియమింపబడిన ఒక ధర్మకర్త గృహంలో వంద కిలోల బంగారం, దాదాపు వంద కోట్ల రూ.ల కొత్త కరెన్సీ నోట్లు పట్టుబడ్డాయి. తమిళనాడు ప్రభుత్వ ముఖ్యమంత్రిగార్ల సిఫారసుతో ఆయన నియమింపబడ్డాడని ఆం.ప్ర.ప్రభుత్వం చెప్పింది. అంటే, అక్కడి ముఖ్యమంత్రులు, ఇక్కడ ముఖ్యమంత్రులు కూడా ధనహర్తలైన ధనవంతులను దేవాదాయ పాలక మండళ్లలో సభ్యులుగా నియమిస్తున్నారని విదితవౌతుంది. ఈ పద్ధతి మారాలి.
ధర్మకర్తలకు కావలసిన అర్హతలు నిర్దేశింపబడాలి. వారి విధులను పేర్కొనాలి. నియామకంకోసం విన్నపాలు పెట్టుకోమని ప్రజలలో ఎక్కువ ప్రాచుర్యం ఉన్న మాధ్యమాలలో ప్రకటించాలి. దరఖాస్తులు స్వీకరించడానికి గడువు కనీసం 15 రోజులైనా ఉండాలి. ఎవరికి ఏ విధంగా ఈ విన్నపాలు పంపబడాలో స్పష్టంగా తెలియజేయబడాలి. టెలిఫోన్ నెంబర్లు, ఇ-మెయిల్, అధికారి పేరు, హోదా, చిరునామా స్పష్టంగా తెలియజేయబడాలి. ఎంపిక ఏ ఒక్క మంత్రిగాని, ముఖ్యమంత్రి ద్వారా గాని జరగరాదు. ఎంపిక సమితిలో ముగ్గురు సభ్యులు ఉండాలి. వీరు ఏ రాజకీయ పార్టీలో క్రియాశీలక పాత్రధారులుగా వుండరాదు. విశ్రాంత న్యాయమూర్తులు, ప్రజాసేవ, ధర్మనిరతి, పాలనానుభవం ఉన్న వ్యక్తులో ఈ ఎంపిక సమితిలో వుండాలి. ఈ సమితి ముందు అభ్యర్థుల విన్నపాలన్నీ పెట్టబడాలి. ఎవరికి, ఎందుకు ఎంపిక చేశారో లిఖిత పూర్వకంగా తెలపాలి. వారి నివేదిక దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శిగారికి సమర్పించబడాలి. ఆయన మంత్రిగారియొక్క అనుమతిని పొందిన తర్వాత, ధర్మకర్తృత్వంకోసం ఎంపిక చేయబడ్డ పేర్లు ప్రకటించబడాలి. 15రోజుల లోపల ఎంపిక చేయబడ్డ ఏ వ్యక్తులపైనా ప్రాథమిక సాక్ష్యాధారాలతో అభ్యంతరాలు చేయబడినచో, ఆ వ్యక్తులను గురించి పునరాలోచించిన తర్వాతనే వారి నియామకం జరగాలి. నేను సూచించిన ఈ ఎంపిక పద్ధతి కనీసంగానైనా పాటింపబడాలి.
కనకదుర్గ దేవాలయం యొక్క 20కోట్ల రూ. దసరా పండుగ వేడుకలకై ప్రభుత్వం ఖర్చుపెట్టిందట. ఇదివరకు ఎన్నడూ లేని పద్ధతిలో దేవాలయ నిధులు ఏలినవారి ప్రయోజనాలకు, పర్వదిన వేడుకలుగా ఉపయోగింపబడడం ధర్మరక్షణకు గాని, ధర్మప్రచారానికి గాని, ఉపయోగపడినది కాదు. ఇలా వేడుకలు జరపాలనే నిర్ణయం ఎవరు ఏ ప్రయోజనంకోసం తీసుకున్నారు. పండుగలు ప్రభుత్వం చేయాలా? ప్రభుత్వం దేవుని యందు అట్టహాసంగా భక్తిని ప్రకటించాలా? లంచగొండితనంతో మునిగిపోయిన ప్రభుత్వాలు, దేవుడి సొమ్ముని పీక్కుని పండుగ వేడుకలను, సంబరాలను నిర్వహిస్తాయా? ఎంతోమంది పూజలు నిర్వహించే అర్చకులు చాలీచాలని జీతాలతో, గౌరవ రాహిత్యంతో, కేవలం దేవునియందు భక్తితో లేమిని సహించి, నిత్యం పూజలు చేస్తుంటే, భక్తులకు సేవలందిస్తుంటే, వారిని ఉద్ధరించకుండా, శిథిలవౌతున్న, మూతపడుతున్న దేవాలయాలను పునరుద్ధరించకుండా దేవాదాయ సొమ్మును వేడుకలకు దుర్వినియోగం చేయడం అహంకార పూరితమైన, స్వోత్కర్షకోసం చేయుచున్న పనే. ఈ విధంగా భక్తులిచ్చిన దేవుని సొమ్మును అపహరించినా, దుర్వినియోగం చేసినా, ఈ దుశ్చర్యలకు పాల్పడిన వారు భగవంతునిచే శిక్షింపబడతారని తిరుపతి వేంకటేశ్వరుడి దేవాలయ పాలనను అధ్యయనం చేసిన ఆ ప్రాంతపు బ్రిటిష్ దొరగారు ఇలా వ్రాశారు.
‘‘వాళ్లు బాగుపడ్డారా? దేశద్రోహం చేసి దేవుడు సొమ్ము కాజేసిన వాళ్లు, దేవుడు పేరుమీద దోచుకున్న వాళ్లు, ఎంత బాగుపడ్డారంటే- అలాంటి వాళ్ల కుటుంబాలు నిర్వంశం (వారసులు పుట్టకుండా) అయిపోయాయి. అలా దోచుకున్నవాళ్లు ఆ దోచుకున్న దాన్ని అనుభవించే అవకాశం లేకుండా మానసిక అశాంతికి గురిఅయి, అకాల మరణం చెందారు. ఇలాంటి అకాల మరణాలు ఏటా రెండో, మూడో జరుగుతునే వున్నాయి’. ఈ అభిప్రాయం విశ్రాంత ప్రసిద్ధ ఐఎఎస్ ఆఫీసర్ శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్‌గారు తమ తిరుమల చరితామృతం అనే పుస్తకంలో 452వ పేజీలో పేర్కొన్నారు.
పాలక రాజకీయ పక్షాలు, ప్రజలనుండి పన్నుల ద్వారా సేకరించిన ధనాన్ని తమ ఘనతకై తమ పార్టీ ప్రతిష్టకై, సిగ్గువిడిచి, మైనారిటీలను వారి ఓట్లకై సంతృప్తిపరచే కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రభుత్వపు సొమ్ముతో ముస్లింలకు రంజాను సమయంలో ప్రీతి భోజనాలు ఇఫ్తార్ పేరుతో కోట్లు ఖర్చుపెట్టి లక్షల మందిని మేపుతున్నారు. అదే విధంగా క్రైస్తవుల క్రిస్‌మస్ పండుగ సందర్భంగా దుస్తులు పంచిపెట్టడం, విందులివ్వడం ప్రారంభించారు. తెలంగాణాలో డిసెంబర్ 2016 క్రిస్‌మస్ పండుగకై ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు కేటాయించింది. రెండు శాతం వున్న క్రైస్తవుల పండుగకు 15 కోట్లు రూపాయలు దానంచేస్తే, వారికన్నా 40రెట్లుగా వున్న హిందువులకై 600 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాలి కదా? లేదు. హిందువులు గొఱ్ఱెలుగా చూడబడుతున్నారు. ప్రభుత్వపు సొమ్ములు ఉర్దూఘర్‌లు, షాదిఖానాలు, హజ్ గృహాలు, క్రైస్తవుల చర్చిలు, ఈ రెండు వర్గాలు మక్కా, జెరూసలెం తీర్థయాత్రలకు ఖర్చుపెట్టబడుతున్నాయి. ఉదా: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వపు సొమ్ముతో 800కి పైగా చర్చిలు కట్టబడ్డాయి. వేల మంది ముస్లింలు, క్రైస్తవులు ప్రభుత్వపు సొమ్ముతో మక్కాకు, జెరూసలెంకు పంపబడ్డారు. తిరుమలలో వేంకటేశ్వరుడిని చూడగోరే భక్తులు ప్రయాణపు ఖర్చులు భరించడమేకాక, దర్శనంకోసం కూడ టిక్కెట్టు కొనుక్కోవలసి వస్తోంది. ఇదేమి సెక్యులరిజం? హిందువులు వారి హిందూ ధర్మాన్ని మట్టుపెట్టించి, మత మార్పిడి చేసిన, చేస్తున్న మూకలకు ఇంకా తమ సొమ్ముని ధారపోయవలసిందేనా? హిందువులను కులాలనుబట్టి చీల్చడం, సంక్షేమ పథకాలకు కులం, మతం ఆధారంగా చేయడం, అధికారంకోసం, ధన సంచయంకోసం, పేదరికం నిర్మూలన అనే నినాదంతో మైనారిటీల ఓట్ల వేటలో హిందువులు సమిధలైపోతున్నారు.
స్వాతంత్య్ర పోరాట సమయంలో, ‘మాకొద్దీ తెల్లదొరతనం’ అనే నినాదంతో మనం ఉద్యమించాం. దేవాలయాల సొమ్మును, వనరులను, ఏలదలచిన, ఏలుతున్న వర్గాలచే దుర్వినియోగింప బడకుండా వుండాలంటే, హిందూ దేవాలయాల నిర్వహణను, పాలనను భక్తసమాజాలకు, ధర్మాచార్య మండలికి తగు చట్టంద్వారా అప్పగించాలి. సిఖ్ఖు, పంథీయుల గురుద్వారాలు ఈ విధంగా ఒక చట్టం ద్వారా 1935 సం.నుంచీ, ఆ ధర్మ అనుయాయుల సమితుల ద్వారానే (గురుద్వారా ప్రబంధక్ కమిటీలు) నిర్వహింపబడుతున్నాయి.

- త్రిపురనేని హనుమాన్‌చౌదరి