సబ్ ఫీచర్

కానె్వంట్లపై వ్యామోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశాన్ని బ్రిటిష్ వారు పాలించే సమయంలో ఆంగ్లభాషకు పట్టం కట్టి, ప్రారంభంలో అన్ని బడుల్లోనూ ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. క్రమంగా ఆంగ్ల మాధ్యమం అవసరం లేదని, విద్యను సంబంధిత రాష్ట్రాల భాషలోనే బోధించాలనిౄ ఇంగ్లీష్‌ను ఒక భాషగా నేర్పితే చాలని భావించారు. ఆనాడు నాల్గవ తరగతి నుండి ఇంగ్లీషు ఒక సబ్జెక్టుగానే బోధింపబడేది. ఇంటర్మీడియట్ నుండి ఆంగ్ల మాధ్యమం ప్రారంభమయ్యేది. ఇందువల్ల పిల్లలకు మాతృభాషలోను, ఆంగ్లంలోను ప్రావీణ్యం ఉండేది. మాతృభాషలో బోధన వల్ల విద్యార్థులకు విషయ పరిజ్ఞానం సులభతరమవుతుందన్న విద్యావేత్తల సూచనలను ఆనాడు బ్రిటిష్‌వారు అనుసరించారు.
సుమారు గత 30 ఏళ్ల నుంచి చదువంటే ఇంగ్లీషు మీడియం చదువే అనే అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది. ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు శరవేగంగా పెరగడంతో తల్లిదండ్రులు సైతం వాటివైపు మొగ్గుచూపారు. మారుమూల పల్లెల నుంచి పిల్లలను కానె్వంట్లకు పంపడం ఇపుడు పరిపాటిగా మారింది. దీంతో ప్రభుత్వ పాఠశాలలు వెలవెల పోతున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థలను అరికట్టలేక వారి పద్ధతులను ప్రభుత్వం అనుకరిస్తూ ఇంగ్లీషు మీడియం స్కూళ్లను ప్రారంభించింది. కానె్వంట్లు, కార్పొరేట్ బడుల్లో ఆర్భాటాలు ఎక్కువై, చదువు తగ్గింది. ఒకప్పుడు విద్యార్థులు పుస్తకాలను భారీ సంచులలో మోసుకుపోవడం ఎరుగరు. ఆనాడు టెక్స్ట్‌బుక్స్ ఉపయోగిస్తూ పాఠ్యాంశాలను ఉపాధ్యాయులు బోధించేవారు. బోధన సమయంలో పిల్లలు వాటిని దగ్గర ఉంచుకుని పాఠం శ్రద్ధగా వినేవారు. పాఠ్యపుస్తకంలోని ప్రతి అంశం వారికి అవగాహన అయ్యేది. గణితం, చరిత్ర, భూగోళ శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం మొదలైనవి బోధనోపకరణాల ద్వారా బోధించేవారు. హోమ్‌వర్కు అనేది ఆనాడు లెక్కలకే పరిమితం. ఇప్పుడు ప్రతిదానికీ హోమ్‌వర్క్ ఎక్కువైపోయింది. పదవ తరగతి పిల్లలు మాతృభాషలో నాలుగు వాక్యాలు తప్పులు లేకుండా వ్రాయలేరు. ఇటీవలి కాలంలో విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయినట్లు అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందుకు బాధ్యులు ఎవరు? దీనికి పరస్పరం ఆరోపణలు చేసుకోవడం తప్ప అసలు కారణాలను ఎవరూ పట్టించుకోవడం లేదు.
భవిష్యత్‌లో ప్రభుత్వ పాఠశాలలన్నీ ఇంగ్లీషు మీడియంలో కొనసాగుతాయా? ఇప్పటికే కొన్ని హైసూళ్లలో తెలుగు, ఇంగ్లీషు మీడియంలు ఉన్నాయి. ఇంగ్లీషు మీడియం అర్థం కాని పిల్లలు తెలుగు మీడియంలోకి మారుతున్నారుట! బోధనా భాష విషయంలో ప్రభుత్వానికి ఒక స్థిరమైన అభిప్రాయం కనిపించదు. ప్రైవేటు పాఠశాలల్లో ఫలితాలు బాగా వస్తున్నాయట. వాటిలో పనిచేసే టీచర్లందరూ సమర్ధులేనా? వీరి సామర్ధ్యాన్ని పరీక్షించేది, ఎంపిక చేసేది ఎవరు? ప్రభుత్వ బడుల్లో ఆంగ్లమాధ్యమంలో బోధించగలవారు ఎంతమంది ఉన్నారు? తెలుగు మీడియంలో బిఇడి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఇంగ్లీషును ఎలా బోధిస్తారు? ఇంగ్లీషు బోధనా పద్ధతులను ప్రత్యేకంగా చదవాలి. కానె్వంట్లపై మోజు పెరిగిపోతున్న సమయంలో తెలుగు భాషను పట్టించుకునేవారు ఎవరు? మరోవైపు తెలుగు వాచక పుస్తకాలలో వ్యావహారిక భాషకు ప్రాధాన్యత ఇస్తున్నందున పిల్లలకు తెలుగు భాషలోని సౌందర్యం తెలియడం లేదు. మాతృభాష అనేది ఇప్పుడు ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న దీపంలా ఉంది. ప్రభుత్వానికి తెలుగు భాషాభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే- ఆంగ్ల మాధ్యమానికి బదులు ఇంగ్లీష్‌ను ఒక భాషగానే నేర్పాలి. ఆంగ్లంలో బాగా మాట్లాడాలంటే- గణితం, సోషల్ స్టడీస్, సైన్స్ వంటివి ఇంగ్లీష్ మీడియంలోనే చదవనవసరం లేదు. దేశానికి జాతీయ భాష అవసరం. అది హిందీ కావాలని మన నాయకులు నొక్కివక్కాణించారు. త్రిభాషాసూత్రం అమలుచేసి హిందీ భాషాభివృద్ధికి సైతం చర్యలు తీసుకోవాలి.

- వేదుల సత్యనారాయణ