సబ్ ఫీచర్

సాగులో యాంత్రీకరణ అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంకేతికంగా మనం ఎంతటి ప్రగతిని సాధించినా వ్యవసా య రంగం ఇంకా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. పంటల దిగుబడి ఆశించిన స్థాయిలో లేదు. దీనికి ముఖ్య కారణం 40 శాతం సాగుభూమికి మాత్రమే నీటిపారుదల సౌకర్యం వుంది. నీటి యాజమాన్యం, ఎరువుల వాడకంలో శాస్ర్తియత లోపించింది. ప్రకృతి వ్యవసాయానికి తగు ప్రాధాన్యత లేదు. శ్రామికుల వేతనాలు పెరగడంతో ఉత్పత్తి వ్యయాలు బాగా పెరిగి చిన్న, సన్నకారు రైతులు బాగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితులలో మన రైతులు యాంత్రీకరణపై మొగ్గుచూపాల్సి వుంది. చిన్న కమతాల్లో సైతం ఆధునిక వ్యవసాయ పనిముట్లు వాడి ప్రయోజనం పొందవచ్చు. అవసరానికి తగినట్లు నేలను దున్నుకోడానికి, తగిన లోతులో విత్తనాలు నాటుకోవడానికి, భూమి చదును చేసుకోడానికి అవసరమైన సామగ్రి ప్రస్తుతం చౌకగానే లభిస్తోంది. వ్యవసాయ రంగంలో నీటిని ఆదా చేయడం ముఖ్యం. రెయిన్ గన్‌లు, బిందు, తుంపర సేద్యం ద్వారా నీటిని ఆదా చేయవచ్చు. రైతు పొలాన్ని దున్నిన వెంటనే నీరు పెట్టి నాలుగు, ఐదుసార్లు నాగలితో దమ్ముచేస్తాడు. ఈ ప్రక్రియకు పడ్లరు, రోటోవేటరు, పళ్లెపు దంతి లాంటి యంత్రాలు ఉపయోగపడతాయి. ఈ ప్రక్రియకు ట్రాక్టర్లనూ వాడతారు.
యాంత్రీకరణతో అనేక ప్రయోజనాలు వున్నాయి. విత్తనాలు, ఎరువులు, నీటిని ఆదా చేయవచ్చు. ఏటా రెండు,మూడు పంటలు పండించవచ్చు. ప్ర తి సీజన్‌లో 20 నుండి 30 శాతం ఆదా వుంటుంది. ఉ పాధి హామీ పథకంతో వ్యవసాయ కూలీల కొరత ఏర్పడింది. వేతనాలు బాగా పెరిగాయి. ఈ కారణంగా యాంత్రీకరణ అవసరమైంది. యాంత్రీకరణ వల్ల గ్రామీణ మహిళలకు వెసులుబాటు కలిగింది. వారు మార్కెట్‌కు వెళుతున్నారు. విద్యపై శ్రద్ధ చూపుతున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ విషయంలో మన దేశం తక్కువ ప్రగతి సాధించింది. మన వ్యవసాయ పనిముట్ల పరిశ్రమ వాటా ప్రపంచ మార్కెట్‌లో 10 శాతంగా వుంది. ఇది ఏటా 5 శాతం చొప్పున పెరుగుతున్నది. వ్యవసాయ యాంత్రీకరణ వల్ల పొందే ప్రయోజనాల విలువ రూ.100,000 కోట్లుగా అంచనా. అనేక వ్యవసాయ పరికరాలను మనమే తయారుచేసుకుంటున్నాం. ముఖ్యంగా పవర్ టెల్లర్ల వినియోగం బాగా పెరిగింది. వీటి డిజైన్లలో అనేక మార్పులు వచ్చాయి. వ్యవసాయ యాంత్రీకరణలో కొన్ని సమస్యలు కూడా వున్నాయి. యాంత్రీకరణ వల్ల శ్రామికులకు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. చెరకు పొలాల్లో పనిచేసే వారికి కంటిజబ్బులు వస్తున్నాయి. వ్యవసాయ యంత్రాల వినియోగం క్రమపద్ధతిలో లేనందువలన కొంత నష్టం జరుగుతున్నది. యాంత్రీకరణ మన వనరులను సంరక్షించుకుని, వివిధ ప్రక్రియలను సకాలంలో పూర్తిచేయడానికి సహాయపడాలి. యంత్రాలను అద్దెకు తెచ్చుకునే సౌకర్యం వుండాలి. వ్యవసాయ పనిముట్లు కొనడానికి ప్రభుత్వం అనేక రాయితీలు ఇస్తోంది. పరికరాలను వాడడంలో రైతులకు, శ్రామికులకు తగు శిక్షణ ఇవ్వాలి.

- ఇమ్మానేని సత్యసుందరం