సబ్ ఫీచర్

మంచిపనికి జనం మద్దతు కొంచెమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘స్వచ్ఛ భారత్’ అంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో ఆమధ్య అందరూ చీపుర్లు పట్టి కొన్నాళ్లు పరిసరాల శుభ్రత కోసం కొంతమేరకు పనిచేశారు. సంపన్ను లు, సమాజంలో పేరున్నవారు సైతం వీధుల్లోకి వచ్చి తలపాగాలు చుట్టి చీపురుకట్టలు పట్టి శ్రమదానం చేశారు. మీడియా వారికి చేతినిండా పని కల్పించారు. కొన్నాళ్ళు గడిచాక ఆ వేడి తగ్గి ఎక్కడి వాళ్ళక్కడికి జారుకున్నారు. గ్రామాలు, నగరాలనే తేడా లేకుండా ఎక్కడ చూసినా చెత్త యథాతథంగా కనిపిస్తూనే ఉంది. ప్రజల్లో, పాలకుల్లో, అధికారుల్లో చిత్తశుద్ధి లోపించినందున చెత్తకుప్పలు ఏ వీధిలో చూసినా దర్శనమిస్తూనే ఉన్నాయి.
భారతీయ సమాజంలో- ‘మన ఇల్లు బాగుంటే చాలు.. పక్కింటి వాడి సంగతి మనకెందుకు?’ అనుకునే వాళ్ళే ఎక్కువ. అందుకే తమ ఇంట్లోని చెత్తను పక్కింటి జాగాలోకి ఊడ్చేసే వాళ్ళు, మేడలపై నుండి చెత్త కవర్లు రోడ్డుపైకి విసిరేసే వాళ్ళు మనకు కనిపిస్తూనే ఉంటారు. పొడి చెత్త, తడి చెత్త వేర్వేరుగా వేయాలని చాలా మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికీ రెండేసి చెత్తబుట్టలను అందజేశారు. అయినప్పటికీ ఈ సూచనలను కచ్చితంగా పాటించే వాళ్ళుగాని, పాటిస్తున్నారా? లేదా? అని ఆరా తీసే అధికారులు గాని లేరు. కర్నాటకలోని చాలా ప్రాంతాల్లో తడి, పొడి చెత్తలను వేసే విషయంలో నిబద్ధతతో ప్రతి ఒక్కరూ వ్యవహరించటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించడాన్ని నిషేధించారు. అయినా ఈ విషయంలో ఎలాంటి ప ర్యవేక్షణ లేదు. కర్నాటకలో ప్లాస్టిక్ కవర్లకు బదులు గోనె సంచులు, పేపర్ బ్యాగులు ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా ఒక సూచన చేసినపుడు ‘మన మంచికోసమే కదా’ అని భావించి ప్రతి ఒక్కరూ ఆచరించటానికి అడుగుముందుకు వేయాలి. అంతేతప్ప ఎప్పుడూ ఎవరో ఒకరు బెత్తం పట్టుకుని నిలబడి ‘తప్పు చేస్తే దండిస్తామం’టూ హెచ్చరిస్తేనే మేం వింటామంటూ ఎప్పటికీ ఈ సమాజం, దేశం ఇలాగే ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని కాలనీ సంఘాలు, గ్రామాల వారు స్వచ్ఛందంగా కలసికట్టుగా ఉద్యమించి చెత్తకుప్పలను తొలగించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణంలో జీవిస్తున్నారు. ఇటువంటి వారిని చూసిన తరువాతైనా ఇతరులు కూడా నిబద్ధతతో నిజాయితీగా వ్యవహరిస్తే ఆహ్లాదకరమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి అందరికీ లభిస్తాయి.
చెత్త విషయంలోనే కాదు, ఎన్నో రకాలుగా మన చుట్టూ కలుషిత వాతావరణాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. చిన్న, పెద్ద అన్ని కార్యక్రమాలకీ మై కులు పెట్టి పాటలతో హోరెత్తించేవాళ్ళు, అనవసరంగా హారన్లు మోగిస్తూ రొద పెట్టేవాళ్ళు, చిన్నపాటి ఫంక్షన్లకు కూడా భారీ శబ్దాలతో టపాకాయలు కాల్చి హడావుడి చేసేవాళ్లు శబ్దకాలుష్యంతో వాతావరణానికి చేటు కలిగిస్తున్నారు. మనం తీసుకునే ఆహారంలో, పీల్చే గాలిలో అన్నింటా కాలుష్యమే. పాలు, నీరు, ఉప్పు, పప్పు, కారం, మిరియాలు, ధనియాలు ఇలా అన్నింటిలో కల్తీనే. రసాయనాలు వేసి కృత్రిమంగా పండించిన పండ్లు, మురుగునీటిలో పెంచే ఆకు కూరలు, కూరగాయలు, జంతు కళేబరాల నుండి తీసిన నూనెలు ఇలా అన్ని విషయాల్లో కల్తీలను భరిస్తూ అసలు ‘స్వచ్ఛత’ అంటే ఏమిటో తెలియని విధంగా మనం బతుకుతున్నాము. వాతావరణ కాలుష్యాన్ని భరించలేక ముక్కుకు, మూతికి గుడ్డలు కట్టుకుని స్కూలుకు వెళుతున్న చిన్నారులను చూస్తుంటే భావితరాల వారికి మనమందరం కలసి ఎంతటి విష పూరితమైన వాతావరణాన్ని ఇస్తున్నామో అర్థమవుతుంది. ఈ పరిస్థితులన్నింటికీ కారణం- చట్టాల పట్ల భయం లేకపోవడం, విలువల పట్ల గౌరవం లేకపోవడం. చట్టాలను ఉల్లంఘించేవారు, వాటిని అమలు చేయాల్సిన వారు కల్తీకి, వాతావరణ కాలుష్యానికి కారకులవుతున్నారు. కల్తీ సిమెంటు వాడి కట్టడాలు కూల్చి అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోవటానికి కారకులైన అధికారులు, మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమయ్యేవారు, చాటుమాటుగా అక్రమాలెన్నో చేస్తూ దొరికేవరకూ దొరల్లాగా చెలామణి అయ్యేవాళ్ళు... ఇలా ఎందరో సమాజానికి పట్టిన చీడ పురుగుల్లాగా ఉంటే- వీళ్ళని ఏరిపారేయటానికి ఏ చీపురును ఉపయోగించాలి? సమాజంలో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో, నిజాయితీతో ప్రవర్తిస్తే తప్ప ఈ పరిస్థితులు అదుపులోకి రావు. అందుకే ముందు మన మనసులోని కల్మషాన్ని కడిగివేసి శుద్ధిచేసుకుందాం. పదుగురికీ ప్రయోజనకరమైన పనులనే చేద్దాం. అప్పుడే అందరూ ఆశిస్తున్న ‘స్వచ్ఛ భారత్’ తప్పక ఆవిష్కృతమవుతుంది.

- అబ్బరాజు జయలక్ష్మి