సబ్ ఫీచర్

ప్రాపంచిక దృక్పథం పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి పరిసరాలు లేకుండా బతకలేడు. మనిషి లేకుండా ప్రకృతి బతకలేదు. భూమండలాన్ని కాపాడటం ప్రతి మానవుని కర్తవ్యం. భూమండలం కాలుష్యానికి కూడా మనిషే కారకుడు. చివరకు మనిషి బతకలేని పరిస్థితి వస్తుందా అనే అనుమానం వస్తున్నది. ఓజోన్ పొర కరిగిపోవటం కార్బన్‌డై ఆక్సైడ్ పెరగటం, కార్తెలు మారటం ప్రమాదానికి సంకేతం. భూగోళమంటే రాజధానులు, దేశాల పేర్లు చెప్పటం కాదు. భూమిని కాపాడుకోవలసిన బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలి. భూమికున్న స్వచ్ఛతను కాపాడాలి. ఈ అవగాహనను మన విద్యార్థుల్లో కల్పించాలి. పల్లెటూర్లో ఇప్పటికీ ‘‘చెట్టు పండ్లు తిను, కానీ ఆ చెట్టును నాశనం చేయకు’’ అని పెద్దలు చెబుతారు. భూమండలం మొత్తం సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమాని కుగ్రామంగా మారింది. ఇంత జరిగినా పల్లెల్లో వున్న సంస్కృతిని మాత్రం ప్రపంచానికి ఇవ్వలేకపోయాం. సాంకేతిక విజ్ఞానం ఖండాలను దగ్గరకు చేర్చింది. కానీ మనిషి మాత్రం దగ్గరకు రాలేకపోతున్నాడు. రకరకాల ఉద్రేక పూర్వకమైన భావాలతో చర్యలతో రెచ్చగొట్టి మానవుల మధ్య అగాధాన్ని పెంచుతున్నారు.
భూగోళాన్ని పరిరక్షించాలంటే గ్రామాల్లో కనబడే సంస్కృతి ప్రపంచ వ్యాప్త సంస్కృతిగా మారాలి. దానికి ఇతర మనుషులను, ఇతర మతాలను, నాగరికతలను, ఇతరుల భావాలను వికసింపనివ్వాలి. ప్రపంచంలోని ప్రజలందరూ ఒకే రకమైన, లేదా అన్ని రకాల భావాలను కలిగి ఉండాలనుకోవటం తెలివితక్కువతనం. విభేదాలను గౌరవించాలి. విభిన్నత్వం నుంచే ఐకమత్యం రావాలి. దానికి సహనం, ఓపిక ప్రధానం. సాంకేతిక రంగం కొత్త ఆవిష్కరణలను ఇస్తూ ఉన్నది. గత తరానికి లేనటువంటి జ్ఞానం ఈ తరానికి వచ్చింది. మూత్ర పిండాల (కిడ్నీ)లను ట్రాన్స్‌ప్లాంట్ చేయటం, ఒకరికన్ను మరొకరికి అమర్చగలగడం కణ ఇంజనీరింగ్ ఫలితం కాదా? జ్ఞానం పెరిగింది కానీ దానికి తగినట్లు మనిషి విలువలు పెరగలేదు. భూమండలంలో జ్ఞానంతో సహా మానవ విలువలు పెరగాలి. గ్లోబల్ దృక్పథం ప్రతి మనిషిలో రావాలి. స్థానిక పరిసరాలనుంచి ప్రపంచం వైపునకు తీసుకుపోవటమే పిల్లలను నేటి భూగోళ శాస్త్రం.
నిజం చెప్పాలంటే నేటి భూగోళ శాస్త్ర పరిజ్ఞాన పరిధి మరింతగా విస్తరించింది. ఇందుకు ఎప్పటికప్పుడు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞా నం కారణమని వేరే చెప్పాల్సిన పనిలేదు. అయతే విద్యార్థులకు, నేడు బోధించే పాఠాలు సైన్స్, గణితాలకే అధిక ప్రాధాన్యతనిచ్చి, మిగిలిన అంశాలను నిర్లక్ష్యం చేయడం జరుగుతోంది. ఆవిధంగా నిర్లక్ష్యం చేస్తున్న అంశాల్లో భూగోళం కూడా ఉంది. అయతే ప్రతి విభాగం దేనికదే శాస్ర్తియమైనదని గుర్తించకపోవడం లేదా గుర్తించినా పట్టించుకోకపోవ డం విద్యార్థుల్లో అవగాహనా రాహిత్యానికి కారణమవుతోంది. విషయం తప్ప భాషకు ప్రాధాన్యతనివ్వకపోవడం వల్ల, విద్యార్థుల్లో భాషా పరిజ్ఞా నం పెరగడం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో పిల్లలు పోటీపడలేక పోవడానికి ఇదొక ప్రధాన కారణం. ఈ విషయ పరిజ్ఞానం కూడా, మార్కు లకు, ర్యాంకులకు పరిమితం కావడం వల్ల అసలు విద్యా లక్ష్యం మరుగున పడిపోతున్నది.
చదివే అన్ని సబ్జెక్టులు వేటికవే సమాన ప్రధాన్యత కలిగినవన్న అంశాన్ని ఉపాధ్యాయులు విద్యార్థుల్లో కలిగించాలి. అంతేకాదు మార్కులు, ర్యాంకు ల కోసం కాకుండా, విషయావగాహనపై ప్రధానంగా దృష్టిని కేంద్రీ కరిం చినట్లయతే, విద్యార్థుల్లో అన్ని అంశాలపై అవగాహన పెరిగి, తెలుసు కున్న దాన్ని తాము నేర్చుకున్న భాషలో తమదైన శైలిలో వ్యక్తం చేయగ లుగుతారు. అప్పుడు మాత్రమే వారిలో సర్వతోముఖాభివృద్ధిని చూడగలు గుతాం.

- చుక్కా రామయ్య