సబ్ ఫీచర్

పగటినిద్ర మంచిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిద్ర అనేది అందరికీ తప్పనిసరైన జీవన క్రియ. అది ఎక్కువైనా, తక్కువైనా మానసిక, శారీరక మార్పులు అనివార్యం. జీవనోపాధికి పగలంతా పనిచేయాల్సి రావడంతో రాత్రివేళ నిద్ర పోవడం అన్నది అనాదిగా అలవాటై పోయింది. కాలక్రమంలో చాలా ఉద్యోగాలు రాత్రిళ్ళే చే యాల్సి వస్తున్నాయి. పరిశ్రమలు, కమ్యూనికేషన్ సెంటర్స్, ఆస్పత్రులు, కాల్ సెంటర్స్, రవాణా, సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఎంతోమంది రాత్రివేళ పనిచేయక తప్పడం లేదు. అలాంటపుడు వారు పగటి పూట నిద్ర తీయాల్సి ఉంటుంది. ఇది అందరి విషయంలో కాకపోవచ్చు. కానీ, మధ్యాహ్నపు నిద్ర కొద్దిసేపే అయినా మంచిదే అంటున్నారు వైద్య నిపుణులు. మధ్యాహ్నం భోజనం ముగించాక చిన్నపాటి కునుకు తీస్తే చాలు. ఆ తర్వాత చలాకీతనం, చురుకుదనం ఇట్టే వచ్చేస్తాయి. సెల్‌ఫోన్‌కు చార్జింగ్ ఎంత అవసరమో, మనిషికి నిద్ర కూడా అంతే అవసరం. అయితే, పగటి నిద్ర మన పనులకు ఆటంకాన్ని కలిగించకూడదు. పని పూర్తిచేశాకే చిన్నపాటి కునుకు తీయాలి. అలా కుదరని పక్షంలో వేళకు రాత్రి నిద్రను అలవాటు చేసుకోవాలి. మనకు ఆహారం ఎంత ముఖ్యమో, నిద్ర కూడా అంతే అవసరం. కానీ, నేటి ఉరుకులు, పరుగుల యుగంలో నిద్రలేమి ఒక జబ్బుగా కొందరిలో కనిపిస్తున్నది. సుదీర్ఘ పని గంటలు, కెరీర్ లక్ష్యాలు, ఆర్థిక ఇబ్బందులు, దాంపత్య సమస్యలు ఇవన్నీ మానసిక ఒత్తిడులను పెంచే అంశాలే. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, పోషకాహార లోపం, అనారోగ్యాలు, మానసిక సమస్యలు ఇవన్నీ నిద్రలేమికి దారితీస్తున్న అంశాలే! ఎంతసేపు నిద్ర పోవాలి? ఎన్ని గంటలు సరిపోతుంది? అనే విషయాలపై చాలామందిలో గందరగోళం కనిపిస్తుంది. వాస్తవానికి అందరి నిద్రా ఒకలా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా నిద్రపోవడం అలవాటు. తగిన సమయం ఉంటే పగటిపూట ఒకింత నిద్ర పోవడం మంచిదే. మధ్యాహ్నపు నిద్ర వల్ల ఆందోళన, అలసట దూరం అవుతాయి. ఆరోగ్యరీత్యా ఎంతో మెరుగ్గా ఉంటారు. రాత్రివేళ ఎనిమిది గంటల సేపు నిద్రపోవడం సరిపోతుందని భావించకూడదు. రాత్రి ఎంతగా నిద్రించినా, మధ్యాహ్నం వేళ చిన్నపాటి కునుకు చాలా ఉపయోగంగా వుంటుంది. పగటినిద్ర మనలో చలాకీతనం, జ్ఞాపకశక్తి స్థాయిలను మెరుగుపరచుతుంది. అయితే, పగటి నిద్రకు చాలా తక్కువ సమయాన్ని మాత్రమే కేటాయించాలి. గంటల తరబడి కునుకు తీయడం సరికాదు. ఇది క్రమం తప్పని అలవాటుగా మారినపుడే ప్రయోజనం దక్కుతుంది. పగటి నిద్ర తప్పకుండా ఒత్తిడులను తగ్గించి, ఉత్సాహాన్ని పెంచుతుంది. నిద్ర లేచాక ముఖంలో అందం, ఆకర్షణ, ఫ్రెష్‌నెస్ పెరుగుతాయి. లంచ్ తర్వాత మ ధ్యాహ్నం రెండు నుండి నాలుగు గంటల మధ్య ఓ మోస్తరు నిద్ర తీయడం అన్ని విధాలా ఉత్తమం. పావుగంట నుంచి అరగంట వరకూ మించి అవసరం లేదు. తక్కువ సమయమైనప్పటికీ గాఢంగా నిద్ర పడుతుంది. గనుక మనసుకు, శరీరానికి చాలా రిలాక్సేషన్‌ని ఇస్తుంది.

-హిమజారమణ