సబ్ ఫీచర్

అనుబంధానికి ప్రేమే ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమ.. ఇది అన్ని వయసులవారికి, అన్ని వర్గాలవారికీ అవసరం. పెళ్లివరకు ప్రేమ ఒకలా.. ఆ తర్వాత మరోలా మారకూడదు. ప్రేమించి పెళ్లిచేసుకున్నవారే కాదు.. పెద్దలు కుదిర్చిన పెళ్లిచేసుకున్నవారు కూడా అనుబంధం మరింత పటిష్టంగా ఉండాలంటే నిత్యం ప్రేమతోనే మెలుగుతుండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలో ఓసారి ప్రేమగా చదివేద్దాం మరి...
- అంతా నాకు తెలుసు అనే ధోరణి సరికాదు. ఎదుటివారు ఏదైనా లోపం గురించి చెప్పినపుడు, ఓ అంశం గురించి చర్చించినపుడు శ్రద్ధగా వినాలి. అలా కాదు.. ఇలా కాదు అంటూ మధ్యలో వాదించడం సరికాదు. మొదట వారి వాదనను వినాలి. తర్వాత అందుకు సంబంధించిన చర్చను ప్రశాంత వాతావరణంలో కొనసాగించాలి. దీనివల్ల ఇద్దరిమధ్య తలెత్తిన సంఘటన సమస్యలైనా దూరమవుతాయి.
- నచ్చని విషయాల గురించి సున్నితంగా చెప్పాలి. పూర్తిగా చెప్పకుండా ఉండడం సరికాదు. భాగస్వామిలోని బలహీనతల్ని తరచూ ప్రస్తావించడం, దెప్పిపొడవడం, చులకన చేసి మాట్లాడడం కాకుండా.. వాటినెలా అధిగమించాలో చెప్పాలి. ఆ విషయంలో తోడుగా నిలబడాలి. భాగస్వామికి అబద్ధాలు చెప్పడం సరికాదు. ఇది పలు సమస్యలకు దారితీస్తుంది. అలా కాకుండా తప్పు చేసినా దాని గురించి ధైర్యంగా భాగస్వామికి చెప్పడం, క్షమాపణలు అడగడం వంటివి ఇద్దరిమధ్యా భావ వ్యక్తీకరణను పెంచుతాయి. ఇద్దరూ సాధ్యమైనంత ఎక్కువగా మాట్లాడుకోవడం, తరచూ కలిసి బయటకు వెళ్లడం, ఒకరికొకరు వీలైనంత ఎక్కువ సమయం కేటాయించుకోవడంవల్ల అనుబంధం తాజాగా ఉంటుంది. పెళ్లయ్యాక ప్రేమికులుగా ఉండడం సాధ్యపడుతుంది.
- భాగస్వామిపై ఆధిపత్యం ప్రదర్శించడం తమ హక్కు అని చాలామంది భావిస్తారు. కానీ నలుగురిలో భాగస్వామి నుంచి అలాంటి భావన వ్యక్తమైనపుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. దీనివల్ల ఇద్దరిమధ్య కొంత దూరం పెరుగుతుంది. పరిస్థితి అక్కడిదాకా రాకుండానే చూసుకోవాలి. భాగస్వామికి గౌరవం ఇవ్వడం, అడక్కుండా సాయం అందించడం వంటివి దగ్గరితనాన్ని పెంచుతాయి.

- నీలిమ సబ్బిశెట్టి