సబ్ ఫీచర్

మహిళలదే పైచేయ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ర్తిలు శారీరకంగా దుర్భలులు అయితే కావచ్చు కానీ, వారు మానసికంగా, మేధస్సు పరంగా పురుషులకన్నా ఎన్నో రెట్లు బలవంతులు. ఈ విషయం అనేకసార్లు రుజువయింది కూడా. ఇప్పటి వరకు పరిశోధించి నిపుణులు వెలిబుచ్చిన పలు అంశాలు మహిళలు ఎంత దృఢతరమైన మానసికశక్తి గలవారో, వారెంతటి కష్టనష్టాలకు ఓర్చుకుంటారో అర్ధమవుతుంది.
* మహిళలు ఒకరోజు మొత్తంలో దాదాపు 20 వేల పదాలను తమ మాటల ద్వారా వ్యక్తం చేస్తారు. అదే పురుషులైతే ఒకరోజులో కేవలం 7 నుండి 13 వేల పదాలు మాత్రమే ఉపయోగిస్తారు.
సృష్టి ఆగిపోకుండా ముందుకు సాగాలంటే అది స్ర్తిలు మాతృమూర్తులు కావడం ద్వారానే సాధ్యపడుతుంది. బిడ్డకు జన్మనివ్వడమంటే అది స్ర్తిలు మరో జన్మ ఎత్తడంతో సమానం. అయినప్పటికీ స్ర్తిలు అంతటి బాధను కూడా దిగమింగి మరో జీవిని ఈ భూమీదకు ఆహ్వానిస్తారు. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి 90 సెకండ్లలో ఒక మహిళ మృత్యువాత పడుతుందన్న భయంకర నిజం ఇటీవల పరిశోధనల్లో వెలుగు చూసి ఆడవాళ్లపై జాలి కలిగేటట్లు చేస్తుంది.
రష్యాలో అక్కడి పురుష జనాభా కంటే మహిళల జనసంఖ్య 9 మిలియన్లు ఎక్కువ. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతులైన 20 మంది మహిళల్లో 17 మంది మహిళలు వారసత్వంగా గానీ, తండ్రి వల్ల గానీ, సోదరుల వల్ల గానీ సంక్రమించిన ఆస్తులు కాకుండా తమ కాళ్లపై తాము సంపాదించి కోట్లాదిపతులుగా ఘనత సాధించారు.
పురుషుల కన్నా మహిళల గుండె ఎక్కువసార్లు కొట్టుకుంటుంది. పురుషుల కన్నా మహిళలు అధికంగా నాలుకపై రుచిబొడిపలు కలిగి ఉంటారు.
ప్రపంచవ్యాప్తంగా కొంత మంది స్ర్తిలు జెనెటిక్ మ్యూటేషన్ కారణంగా పురుషులకన్నా అధికమైన రంగులను ప్రకృతిలో వీక్షించగలుగుతున్నారు.
ఆడవాళ్లు కనురెప్పలను నిమిషానికి 19 సార్లు ఆర్పితే మగవాళ్లు నిమిషానికి 11 సార్లు ఆర్పుతారు. ఆడవాళ్లు తమ జీవితకాలంలో దాదాపు ఒక సంవత్సర కాలం పాటు అంటే 365 రోజులు తాము ధరించే దుస్తులను ఎంపిక చేసుకునే పనికి ఖర్చు చేస్తారు.
బాగా పొడవుగా ఉన్న మహిళలు క్యాన్సర్ బారిన పడుతున్నట్లు ఒక సర్వేలో వెల్లడయింది.
ఖగోళ శాస్త్రానికి సంబంధించి చాలా దేశాలు తారలకు ఆడవాళ్ల పేర్లనే పెట్టాయి.
ప్రపంచవ్యాప్తంగా మగవాళ్ల కంటే ఆడవాళ్ల జీవన ప్రమాణం అధికమని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి.
ఒక సర్వే ప్రకారం ప్రపంచంలో మొట్టమొదటి నవలను రాసినది మహిళే. 1000 (ఎడి)లో జపాన్‌కు చెందిన మురాసాకీ షికీబూ రాసిన ‘ద టేల్ ఆఫ్ జెంజీ’ నవలే మొదటి నవల అని కొన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
మొట్టమొదటి కంప్టూర్ ప్రోగ్రామర్ మహిళే. ఆమె పేరు లవ్‌లాస్. మహిళలు ఒకరోజులో పురుషులకన్నా అధికంగా పని చేస్తారు. అయితే అంతే పని చేసిన మగవాడు ఎక్కువ అలసిపోతే మహిళల్లో ఆ అలసట తక్కువగా ఉంటుంది.
మహిళలు తక్కువ నిద్రపోయినా చురుగ్గా ఉండగలరు, సులువుగా పనులు చేసుకోగలుగుతారు. మహిళలు ఒక వస్తువు కొనాలన్నా, ఒక పని చేయాలన్నా మగవారి కంటే ఎక్కువగా నాణ్యతా ప్రమాణాలు చూస్తుంది. చేయబోయే పనిలో మగవారి కంటే ఎక్కువ మంచి చెడ్డలను బేరీజు వేస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఒక సర్వే ప్రకారం మగవారి ఆయుప్రమాణం 68.5 కాగా ఆడవారి ఆయు ప్రమాణం 73.5. అలాగే నేడు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వాడుతున్న కారు హీటర్లు, ఫైర్ ఎస్కేప్స్, డిష్‌వాషర్లు, చాకొలెట్ చిప్ కుకీస్, రెక్టాంగ్యులర్ బోటమ్ పేపర్ల వంటి వస్తువులను కనుగొన్నది మహిళలే.

- లావణ్య