సబ్ ఫీచర్

‘ఉపాధి హామీ’లో సవాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశం ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం, అల్ప ఉద్యోగత (తగినన్ని పనిదినాలు లేకపోవడం) అతి ముఖ్యమైనవి. శ్రామిక శక్తిలో సుమారు పది శాతం మంది ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ పనుల్లో పెరిగిన యాంత్రీకరణ ఫలితంగా ఆ రంగంలో శ్రామికుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతున్నది. కూలీలకు ఇచ్చే దినసరి వేతనాలు నానాటికీ పెరిగిపోవడంతో రైతు నష్టపోతున్నాడు. మన సువిశాల భారతదేశంలో మొత్తం కార్మికులలో వ్యవసాయ కార్మికుల సంఖ్య 56.7 శాతం నుండి 48.8 శాతానికి తగ్గింది. అత్యంత కీలకమైన వ్యవసాయ రంగం నుంచి కొందరు పేదరైతులు, కూలీలు జీవనోపాధి కోసం గత్యంతరం లేక పట్టణాలకు, ఇతర రంగాలకు తరిలిపోతున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని’ 2006 ఫిబ్రవరి 2న అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఏప్రిల్ 2008 నాటికి దేశంలోని అన్ని జిల్లాలు ఈ పథకం కిందకు వచ్చాయి. ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరంలో కనీసం వంద రోజులు పని కల్పించడం ఈ పథకం లక్ష్యం. దరఖాస్తు చేసుకున్న 15 రోజులలో శ్రామికులకు ఉపాధి కల్పించాలి. లేనిపక్షంలో వారికి నిరుద్యోగ భృతి చెల్లించాలి. స్ర్తి, పురుషులకు సమాన వేతనం ఇవ్వాలి. వేతనాలు లబ్ధిదారుల బ్యాంక్ లేదా పోస్ట్ఫాసు ఖాతాలలో జమ చేయబడతాయి. ఈ పథకం కింద కేంద్రం, రాష్ట్రం ఖర్చును 75:25 నిష్పత్తిలో భరిస్తాయి. పథకం అమలులో పంచాయతీరాజ్ సంస్థలు కీలక పాత్రను పోషిస్తాయి.
వేతన ఉపాధి కార్యక్రమాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు అమలు చేయడంలో మనదేశానికి మంచి అనుభవమే ఉంది. అయినా ఈ పథకాలను విజయవంతంగా అమలుపరచడంలో అనేక లోపాలు కనపడుతున్నాయి. ఉపాధి హామీ పథకానికి కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు మాత్రం బాగానే వస్తున్నాయి. 2016-18 బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధి నిధులలో 49 శాతం కేటాయింపులను ఈ పథకానికి కేటాయించడం జరిగింది. ఇది 2017-18 బడ్జెట్‌లో 45 శాతంగా ఉంది. 2017-18 బడ్జెట్ ఈ పథకానికి రు.48,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 2014-15లో 166 కోట్ల పనిదినాలను శ్రామికులకు కల్పించడం జరిగింది. 2015-16లో ఇది 235 కోట్లు. 2015-16లో 57 శాతం కార్మికులు మహిళలే. ఉపాధి హామీ పథకం ఇప్పటికీ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. పాలకులు ఎంతగా గొప్పలు చెబుతున్నప్పటికీ పనిదినాల కల్పన ఆశించిన స్థాయిలో లేదు. సంవత్సరంలో కనీసం 100 రోజులు పని కల్పించాలని నిర్దేశించినా అలా జరగడం లేదు. 2015-16లో సగటున ఇది 49 రోజులుగానే ఉంది. మణిపూర్‌లో ఇది కేవలం 16 దినాలే. అన్ని రాష్ట్రాల కంటే ఇది తక్కువ. వేతనాలు చెల్లించడంలో జాప్యం జరుగుతున్నదని జనవరిలో సుప్రీంకోర్టు రాష్ట్రాలకు తెలిపింది. ఒక్క పశ్చిమ బెంగాల్‌లోనే జులై 2016 నుండి 15,783.38 లక్షల రూపాయలు బకాయి ఉందని కోర్టు పేర్కొన్నది. పథకం అమలుపరచడంలో కాంట్రాక్టర్లదే పైచేయిగా ఉంది. సోషల్ ఆడిట్ పేరుకు మాత్రమే ఉంది. ఉపాధి హామీ పథకం ముఖ్య ఉద్దేశం గ్రామాలకు ఉపయోగపడే పనులను చేపట్టి, రైతుకూలీలు ఇతర శ్రామికుల వలసలను అరికట్టడం. అయితే పథకం ఈ దిశగా ఫలవంతం కావడం లేదు.
ప్రతి జిల్లాలో ఎటువంటి పనులు చేపట్టాలో ముందుగానేనే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. సంవత్సరం చివరిలో హడావుడిగా పనులు చే పట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. పనులు గుర్తించడంలోనే జాప్యం చేస్తే లక్ష్య సాధనలో పథకం వెనకబడుతుంది. తగిన సిబ్బంది లేక పర్యవేక్షణ అటకెక్కింది. ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఉపాధి హామీ పథకం కింద నీటికొరతను నివారించేలా పనులను చేపట్టే విషయమై పాలకులు, అధికారులు దృష్టి పెట్టాలి.

-ఇమ్మానేని సత్యసుందరం