సబ్ ఫీచర్

సిద్ధాంతాల ముసుగులో రక్తపాతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదటి పారిశ్రామిక విప్లవం నాటికి ‘్భరత ఉపఖండం చీకటి ఖండం’గా ఉందని, గతమంతా వర్గపోరాటాల చరిత్ర అని జర్మన్‌కు చెందిన కారల్ మార్క్స్ పేర్కొన్నారు. లండన్‌లో ఉంటూ మానవ చరిత్రను అధ్యయనం చేశాక ఆ యన ‘పెట్టుబడి’ గ్రంథాన్ని, కమ్యూనిస్టుపార్టీ ప్రణాళికను రచించారు. భారత్ గురించి మార్క్స్ చెప్పిన ఆ రెండు మాటలను ఆయన అనుచరులు, కమ్యూనిస్టులు శిరోధార్యంగా భావిస్తుంటారు. శతాబ్దాలపాటు భారత ఉపఖండం చీకటి ఖండంగా ఉందనే మాటను పట్టుకుని మన దేశంలోని మార్క్స్ అనుచరులు, ఆయన భావజాల ప్రేమికులు విశ్వసించి వీరంగం చేశారు. 1925లో యుపిలోని కాన్పూర్‌లో తొలిసారిగా భారత కమ్యూనిస్టుపార్టీ ఆవిర్భవించిందని చరిత్రకారులు చెబుతారు. అంతకుముందు మార్క్సిజాన్ని అధ్యయనం చేసినవారు పైన పేర్కొన్న రెండు వాక్యాలను చదివాకనే ఆ భావజాలానికి ఆకర్షితులై ఉంటారు. అలా దాదాపు వందేళ్ల నుంచి భారతదేశంలో ఈ రకమైన భావజాలంతో పనిచేసేవారు విస్తరిస్తున్నారు. ఆ తానులోనుంచి వచ్చినవారే మావోయిస్టులు. వీరు మార్క్స్‌కు, మావోకు వీరభక్తులు. విచక్షణా జ్ఞానాన్ని అప్పుడప్పుడూ గాలికొదిలేసి నమ్మిన సిద్ధాంతాల కోసం విధ్వంసం సృష్టించడానికైనా వెనుకాడరు.
మార్క్స్ చెప్పిన రెండు వాక్యాలపై పరిశీలన చేయాల్సిన అవసరం గతంలోకన్నా ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే మార్క్స్, మావో సిద్ధాంతాల పేరిట అమాయక ప్రజలను మావోయిస్టులు కాల్చి చంపుతున్నారు. ప్రజలకు చెందిన సంపదను, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ‘్భరత ఉపఖండం ఒక చీకటి ఖండం’ అన్న మార్క్స్ మహానుభావుడి మాటను పరిశీలిద్దాం. మార్క్స్ ఏ దేశానికి చెందాడో ఆ దేశానికే చెందిన మాక్స్ ముల్లర్ పండితుడు భారత్ ఔన్నత్యం, నాగరికత , శాస్తవ్రిజ్ఞానం, వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధిని గూర్చి వేనోళ్ల పొగిడారు. మొదటి పారిశ్రామిక విప్లవానికి వేల సంవత్సరాల పూర్వం భారతదేశం ఎంతో వికసిత దేశం. అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించిందని అనేకమంది రాసిన శాస్త్ర గ్రంథాలను ఉటంకిస్తూ మాక్స్ ముల్లర్ పేర్కొన్నారు. లిపిని సైతం తొలుత భారత్ రూపొందించి ప్రపంచానికి అందించిందని చెప్పారు. సంస్కృత భాష ఎన్నో రేకలుగా వికసించి మిగతా ప్రాంతాలకు ఆదర్శప్రాయమైనదన్నారు. బ్రాహ్మి, దేవనాగరి లిపిలు వేల సంవత్సరాలు భారత ప్రజల సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నాయని వివరించారు.
సంస్కృత భాష నుంచి వికసించిన భాషనే జర్మన్ భాష అని అనేక ఆధారాలతో ముల్లర్ నిరూపించారు. జర్మన్ భాష నుంచే యూరప్‌లోని, ఇతర ప్రాంతాల్లోని డచ్, పోర్చ్‌గీసు, ఫ్రెంచి, ఇటాలియన్ లాంటి భాషలు అభివృద్ధి చెందాయని అనేకమంది భాషా శాస్తవ్రేత్తలు అంగీకరిస్తున్నారు. భారత్‌లో వేలాది సంవత్సరాలుగా వికసించిన సంస్కృత భాష ప్రపంచవ్యాప్తమైందని జర్మన్‌కు చెందినవారే నిర్ద్వంద్వంగా అంగీకరిస్తున్నారు. జర్మనీ ఎయిర్‌లైన్స్ సంస్థకు ‘లుఫ్తాన్సా’ అని నామకరణం చేసుకున్నారు. లుప్తమైన రాజహంసనే ‘లుఫ్తాన్సా’గా రూపాంతరం చెందిందని ఆ దేశ విజ్ఞులే సెలవిస్తున్నారు. సంస్కృత భాషలో ఉన్నన్ని శాస్త్రగ్రంథాలు ఏ ఇతర భాషలో లేవన్నది కూడా తూర్పు, పశ్చిమ దేశాల పండితుల నిశ్చితాభిప్రాయం.
‘చరక సంహిత’ మొదలు ఖగోళశాస్త్రానికి చెందిన ఆర్యభట్ట అద్భుత రచనలు ఒకటా? రెండా? వేలకువేలున్నాయి. ఆఖరికి భరద్వాజుడి విమానశాస్త్రం చదివి బొంబాయిలో సంస్కృత పండితుడు శివ్‌కర్ బాపుజీ తల్‌పతే విమానాన్ని 19వ శతాబ్దం చివరిలో తయారుచేసి పైలెట్ లేకుండానే విజయవంతంగా ఎగురవేశాడు. ఇది అమెరికాలోని రైట్ బ్రదర్స్ విమానం తయారీ కన్నా చాలాముందే అన్న విషయం గమనార్హం. దీనికి అన్ని ఆధారాలు, సాక్ష్యాలు ఇప్పటికీ ఉన్నాయి. 21వ శతాబ్దంలో అప్ఘనిస్తాన్ గుహల్లో భారతీయులు 5వేల సంవత్సరాల క్రితం నిర్మించిన విమానాన్ని కనుగొన్నామని అమెరికా సైనికులు గతంలో ప్రకటించారు. అప్పట్లో ఆ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది.
ఐదువేల సంవత్సరాల క్రితపు భరద్వాజుడి విమానం నిన్నమొన్నటి వరకు గుహలో ఉన్నదని భౌతికవాదులైన అమెరికన్లు ప్రకటించిన దానికి జర్మన్‌కు చెందిన కారల్ మార్క్స్ రాసిన ‘చీకటి ఖండం’ అంశానికి ఏమైనా పొంతన, సామీప్యత, వాస్తవికత ఉందా? మార్క్స్ మాతృభాష జర్మన్ సంస్కృత భాషతో వికసితమైనదని నిర్ధారణ అయితే, ఆ భాషలో అద్భుతమైన శాస్త్ర విజ్ఞానం పరిఢవిల్లిందని వివరిస్తే, తక్షశిల, నలందా లాంటి విశ్వవిద్యాలయాల్లో అధ్యయనం కోసం విదేశీయులు వచ్చి తమ జ్ఞానదాహం తీర్చుకుని తమతమ దేశాల్లో ‘వికసన’ కోసం అహరహం శ్రమిస్తే- 19 శతాబ్దపు కారల్ మార్క్స్ మాత్రం ‘్భరత్ ఉపఖండం ఒక చీకటి ఖండం’ అని సూత్రీకరిస్తే- అది అత్యంత గొప్ప వ్యాఖ్యానంగా భావించినవారు ఎంతటి ‘విజ్ఞు’లో ఎవరికివారే అంచనా వేసుకోవాలి. ఏ ప్రాంతంలో శాస్త్రగ్రంథాలు వికసించాయో, ఏ ప్రదేశంలో సంస్కృత భాష శోభిల్లిందో, ఏచోట రుషిప్రోక్తంగా వెలువడిన అంశాలకు అధిక ప్రాధాన్యతనిచ్చారో ఆ ఉత్తరప్రదేశ్‌లోనే కారల్ మార్క్స్ భావజాలానికి స్వాగతం పలకడం వింతగా అనిపిస్తుంది.
మార్క్స్ భావాలకు ఆకర్షితులు కావడం తప్పుకాదు. కానీ, ఆయన చెప్పిన మాటలపై, బోధనలపై మనసుపెట్టి ఆలోచించాలి కదా? గుడ్డిగా అనుకరిస్తే ఎలా? వేల సంవత్సరాల సభ్యత, సంస్కారం, నాగరికత, విజ్ఞానానికి వారసులుగా ఉన్నవారు ‘్భరత్ చీకటి ఖండమ’ని చేసిన మార్క్స్ వ్యాఖ్యలను తప్పుపట్టాలి కదా? ఆనాటి ఉద్రేకం, ఉత్సాహం, ఆవేశంలో ఆ విషయంపై దృష్టిపెట్టకపోయినా, గత 90 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా ఆ విషయాన్ని ఖండించాలి కదా? అలా జరగలేదు. వౌనంగా మార్క్స్ మాటలను, వ్యాఖ్యలను, సూత్రీకరణలను ఇప్పటికీ వల్లెవేయడం ఎంత విచిత్రం? ఎంతటి అజ్ఞానం?
తాజాగా మావోయిస్టులైతే మార్క్స్ ప్రతిపాదిత ‘మార్కెట్ రహిత సమాజం ఏర్పాటు’కు మధ్యభారతంలో నెత్తుటి ఏరులు పారిస్తున్నారు. సమాజాన్ని ‘చీకటి ఖండం’వైపు తీసుకెళ్ళేందుకు మందుపాతరలు పేలుస్తున్నారు. ఇది ఏరకమైన ప్రస్థానం? ప్రతి ఒక్కరు నిశితంగా ఆలోచించాలి. మార్క్స్ అనంతరం లెనిన్, ఆ తరువాత మావో ప్రవచించిన సూత్రాలు ప్రామాణికం కావు. తమ కాలాలకు అనుగుణమైన వ్యాఖ్యానాలు వారు చేశారు. అవి ప్రపంచమంతటికీ అనుసరణీయం, అనువర్తితం అని దబాయిస్తే ఎలా? ‘మొదటి పారిశ్రామిక విప్లవం’ నాటికి ముందున్న ఆలోచనలను ప్రభావితం చేసేందుకు వెలువడిన మార్క్స్ అభిప్రాయాలు ఇపుడు 21వ శతాబ్దంలోనూ అంతే ప్రాసంగికమని మావోయిస్టులు తుపాకులను గురిపెట్టి గద్దిస్తే ఎలా?
ఇక, ‘గతమంతా వర్గపోరాటాల చరిత్ర’ అన్న మార్క్సిజం ఉత్ప్రేరక పదం శుద్ధతప్పు. వేల సంవత్సరాల భారతదేశ చరిత్రను అధ్యయనం చేస్తే వర్గ పోరాటం ఎక్కడా కనిపించదు. సహజీవనం మాత్రమే కనిపిస్తుంది. కానీ, మార్క్సిస్టులు, మావోయిస్టులు మాత్రం తాము చెప్పిన మాటలనే నమ్మితీరాలని గుడ్డిగా వాదిస్తారు. వారి అనేక అంధ వాదనల్లో ఇది ఒకటి. ఇలా అనేక అవాస్తవాలను, అసత్యాలను, అసంబద్ధ సూత్రీకరణలను, ఊహాజనిత విషయాలను ప్రోదిచేసి తమది ‘శాస్ర్తియ దృక్పథం’ అని ప్రకటిస్తూ నేడు ఆదివాసీల నెత్తురును మావోయిస్టులు కళ్ల జూస్తున్నారు. ఇది భారతీయ సంస్కృతి కాదు. హింస ఏనాడూ మానవుని మూల అంశాలైన ప్రేమ, దయ, కరుణ, పరోపకారం లాంటి గుణాలను అంతం చేయదు. అ లాంటప్పుడు ఆ మావోయిజాన్ని, మార్క్సిజాన్ని ఎందుకు ఆలింగనం చేసుకోవాలి? ఎందుకు ప్రోత్సహించాలి?

-వుప్పల నరసింహం