సబ్ ఫీచర్

భయపెడుతున్న ‘అల’జడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సముద్ర మట్టం పెరగడానికి వౌలిక కారణాలు రెండు. మొదటిది- అధిక ఉష్ణోగ్రతల వల్ల ధృవాల వద్ద, ఇ తర ప్రాంతాల్లో మంచుకొండలు కరగడం, రెండవది- అధిక ఉష్ణోగ్రతల వల్ల సముద్ర జలాలు వ్యాకోచించడం. కొన్నివేల ఏళ్ల క్రితం భూగోళం నీరు ఘనీభవించిన స్థితిలో ఉండేది. ఈ కాలాన్ని ‘గ్లేసియల్ పీరియడ్’ అంటారు. ఆ దశలో భూమిపై జీవజాలం లేదు. వాతావరణంలోని మార్పులతో ఘనీభవించిన నీరు మంచుగా మారడం ప్రారంభమయ్యాక కొంతవరకు జీవజాలం పుట్టుకొచ్చింది. ఈ కాలాన్ని మంచుయుగం (ఐస్ ఏజ్) అంటారు. ఆ తర్వాత వాతావరణంలో మరిన్ని మార్పుల ఫలితంగా మంచు బాగా కరిగి సముద్రం, నదులు, భూమి ఏర్పడింది. ఈ దశలో జీవజాలం భూచరాలు, జలచరాలుగా వికాసం చెందింది. వేల సంవత్సరాల కాలంలో ఇదంతా జరిగింది. సుమారు 11 మిలియన్ సంవత్సరాల క్రితం భూగోళం ‘గ్లేసియల్ పీరియడ్’లో ఉంది. వేల సంవత్సరాలకు ఒకసారి భూగోళం నీరు ఘనీభవించిన స్థితికి చేరుకుంటుంది. ఈమధ్యకాలాన్ని అనగా రెండు గ్లేసియల్ పీరియడ్‌ల మధ్య కాలాన్ని ఇంటర్ గ్లేసియల్ పీరియడ్ (ఎ.ఐ.జి) అని వ్యవహరిస్తారు. ప్రస్తుతం నడుస్తున్న ఇంటర్ గ్లేసియల్ పీరియడ్‌ని ‘హోలోసెన్’ పేరుతో వ్యవహరిస్తున్నారు. ఇంతకుముందున్న గ్లేసియల్ పీరియడ్‌ని ‘ప్లీస్టోసెన్’ అనే పేరుతో వ్యవహరించారు.
ప్రస్తుతం సముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు సరిగ్గా ‘ప్లీస్టోసెన్’ నాటి ఉష్ణోగ్రతలతో సమానంగా ఉన్నాయి. అప్పట్లో సముద్రమట్టం సాధారణ స్థితికంటే ఆరు నుంచి తొమ్మిది మీటర్ల ఎత్తుకు పెరిగిందని పరిశోధనలో తేలింది. భూ ఉపరితల ఉష్ణోగ్రతల్లో కొద్దిపాటి పెరుగుదల ఉన్నా అది గ్రీన్‌లాండ్, అంటార్కిటికాలోని మంచుపై తీవ్ర ప్రభావం చూపుతోందని, ఇది సముద్రమట్టం పెరుగుదలకు దారితీస్తోందని అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి. సముద్రంలో, నదుల్లో అట్టడుగు భాగాన వేల ఏళ్లుగా పేరుకుపోయిన ‘మడ్డి’ని ‘సెడిమెంట్స్’ అంటారు. సముద్రగర్భంలో 83 వేర్వేరు ప్రదేశాల నుండి 1879-1889 మధ్యకాలంలో (పారిశ్రామికీకరణకు ముందు), 1995-2014 మధ్యకాలంలో సేకరించిన ‘సెడిమెంట్స్’పై జరిపిన పరిశోధనల్లో తేలిన విషయమేమంటే- ప్రస్తుత సముద్ర జలాల ఉష్ణోగ్రతలు, గత ‘ఇంటర్ గ్లేసియల్ పీరియడ్’ నాటి సముద్ర జలాల ఉష్ణోగ్రతలు ఒక్కటిగానే ఉన్నాయని.
‘్ధృవ ప్రాంతాల్లోని భారీ మంచు ఫలకాలు ఉష్ణోగ్రతలలోని కొద్దిపాటి మార్పులకే కరిగి విరిగి పడుతూంటాయి. పర్యావరణానికి సంబంధించి ఇది చాలా తీవ్రమైన హెచ్చరిక అని యూనివర్సిటీ ఆఫ్ మెసాచుసెట్స్‌లో వాతావరణ శాస్తవ్రేత్తగా పనిచేస్తున్న రోబ్ డికాంటో విశే్లషిస్తున్నారు. గత మూడు మిలియన్ సంవత్సరాల మానవజాతి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ధృవాల వద్ద మంచు ఫలకాలు చాలా వేగంగా కరుగుతున్నాయి. ధృవాల వద్ద మంచు కరగడంతో సముద్రమట్టం పెరగడంపై గత మూడు దశాబ్దాలుగా పర్యావరణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల భూ ఉపరితల వాతావరణం 1-2 డిగ్రీల సెల్సియస్ పెరగడమే ధృవాల వద్ద భారీగా మంచు కరగడానికి ప్రధాన కారణమని శాస్తవ్రేత్తలు అంటున్నారు.
గ్రీన్‌లాండ్, అంటార్కిటికాలో భారీగా మంచు కరగడం సముద్ర మట్టం పెరగడానికి ప్రధాన కారణవౌతోంది. మూడు మిలియన్ల ఏళ్ల క్రితం భూగోళంపై మంచు కరగడం వల్ల సముద్రమట్టం 6 మీటర్ల వరకు పెరిగింది. అపుడు గాలిలో కార్బన్ డైయాక్సైడ్ ఎంత పరిమాణంలో వుందో ఇపుడు కూడా అంతే పరిమాణంలో ఉందని ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీలో (ఓఎస్‌యూ) గ్లేసియాలజిస్టుగా, వాతావరణ శాస్తజ్ఞ్రుడిగా పనిచేస్తున్న అండర్స్ కారల్సన్ అంటున్నారు.
ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన పీటర్ క్లార్క్ ఈ పరిస్థితులను అధ్యయనం చేశాక- ‘వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ హెచ్చు స్థాయిలో ఉన్నందున ధృవాల వద్ద మంచు కరిగి సముద్రమట్టం బాగా పెరుగుతోంది.. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం భవిష్యత్‌లో ఇంకా పెరుగుతుంది. ఊహకి అందని ప్రమాదకరమైన భవిష్యత్తులోకి మనం అడుగుపెట్టబోతున్నాం.. ఎనే్నళ్లలో ఈ ప్రమాదం ముంచుకొస్తుందో కచ్చితంగా చెప్పలేం..’ అని అంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాకి చెందిన ఆండ్రియా డట్టన్ సముద్ర మట్టం పెరుగుదల విషయంపై అధ్యయనం చేస్తున్నారు. ‘్భ ఉపరితల వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులకూ, సముద్ర మట్టం పెరగడానికీ చాలా దగ్గర సంబంధం ఉంది. భూమిపై ఉష్ణోగ్రతలో కొద్దిపాటి పెరుగుదల కూడా సముద్రమట్టంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది’ అని ఆమె చెబుతున్నారు.
సముద్ర మట్టం ఆరు మీటర్ల (దాదాపు 20 అడుగులు) ఎత్తు పెరగడం పెద్దగా లెక్కలోకి రాకపోవచ్చు. కానీ, చాలా దేశాల్లో తీర ప్రాంత నగరాలు గత రెండు శతాబ్దాలలో చాలా విస్తరించాయి. ఆ నగరాల్లో జనాభా, నివాస ప్రాంతాలు, ఇతర వనరులు విశేషంగా వృద్ధి చెందాయి. భూగోళంపై సముద్రమట్టం సగటున 10-20 అడుగుల ఎత్తు పెరిగినా సరే తీరప్రాంత నగరాల్లో జన జీవనం అల్లకల్లోలం అవుతుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో చాలా భాగం సముద్రమట్టానికి 50 అడుగులు లేదా అంతకన్నా కాస్త తక్కువ ఎత్తులో ఉంది. మియామి నగరం ఆరు అడుగుల ఎత్తులో ఉంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 14.4 మిలియన్ ప్రజలు లోతట్టు ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. సముద్రమట్టం పెరిగితే ముంపుప్రమాదం ఉన్న నగరాల జాబితాలో సింగపూర్, టోక్యో ఉన్నాయి. తుపానులు, సునామీల వల్ల సంభవించే జలప్రళయం కన్నా సముద్రమట్టం పెరగడం వల్ల కలిగే విధ్వంసం చాలా భయంకరమైనదని శాస్తవ్రేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

-దుగ్గిరాల రాజకిశోర్