సబ్ ఫీచర్

మోదీ ‘మెరుపుదాడి’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరప్రదేశ్‌లో బిజెపి అఖండ విజయానికి కారకుడైన ప్ర ధాని మోదీ దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డును సృష్టించారు. ‘పొలిటికల్ క్రికెట్’లో నియమాలు మారలేదు, కేవలం ఫార్మాట్ మారిందంతే. అవే ఫోర్లు.. అవే సిక్సర్లు.. టెస్టు క్రికెట్ నుండి టి- 20కి మార్చినట్టు. ఆ ఫార్మాట్‌లోని మార్పులు ఇతర పక్షాలు పసిగట్టేలోగా ఆట పూర్తయింది. అత్యంత లాఘవంగా ఆడిన మోదీ, అమిత్ షాల జోడీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది తనకున్న సహజ అనుకూలాంశాలతో.
అత్యంత వెనుకబడి ఉన్న ‘అతిపెద్ద’ పేద రాష్ట్రం ఒక్క అభివృద్ధి మంత్రంతో చేజిక్కడం కష్టం. ఎన్లికల్లో ధనం, కులం, మతం, ప్రభావాల్ని ఒక్క ఉదుటున మాయం చెయ్యలేం. వాటిని సమర్థవంతంగా వాడుకోవడం తప్పుకాదన్న కోణంలో ఆలోచించారనుకొందాం కాసేపు. అలా చూస్తే మొదటిది ధనం. ఎన్నికలకు మూడు నెలల ముందు సరైన సమయం చూసి మోదీ పెద్దనోట్లను రద్దుచేశారు. ఇతర పక్షాలకు నిధుల కొరత తప్పనిసరిగా ఉండే ఉంటుంది. పైకి మింగలేని కక్కలేని బాధ కాబట్టి తేలుకుట్టిన దొంగల వ్యవహారంలా విపక్షం నిస్సహాయంగా ఉండిపోయి ఉంటుంది. ఏ సర్వే సంస్థలైనా ఈ ఎన్నికల్లో ఏ పార్టీ ఎంత ఖర్చుపెట్టిందో, పెట్టగలిగిందో లెక్క తేల్చినపుడు ఈ అంశం ప్రభావం గురించి బేరీజు వెయ్యవచ్చు. నల్లధనంపై యుద్ధం చేస్తున్న ప్రధానిగా ప్రచారంతోపాటు, ఇతర పక్షాల్ని ఆర్థికంగా మూలకు నెట్టేసిన ఈ నిర్ణయం ‘రాజకీయ మెరుపు దాడి’ కాదా?
ఇక కులం. వీలైనన్ని యాదవేతర బిసి కులాల్ని, దళితులు, అత్యంత వెనుకబడిన వర్గాల్లో ఇన్నాళ్లూ నిర్లక్ష్యానికి గురైన వారిని సమీకరించి బిజెపి పెద్దపీట వేసింది. తద్వారా కుల సమీకరణాల్లో పైచేయి సాధించింది. మూడోది మతం. గతంలో వలే హడావుడి చెయ్యడం ద్వారా కాకుండా, రాష్ట్ర జనాభాలో గణనీయ శాతమున్న మస్లింలకు ఒక్క సీటూ కేటాయించకపోవడం, అప్పుడప్పుడూ ప్రధాని ఖబరిస్థాన్ లాంటి పరోక్ష వ్యాఖ్యలు చెయ్యడం ద్వారా బిజెపి తన ‘మెజారిటీ’ వాదాన్ని బలంగా చెప్పగలిగింది. తద్వారా అనుకొన్నది సాధించింది.
నిన్నటివరకూ అధికారంలో వున్న సమాజ్‌వాదీ పార్టీ కావాల్సినంత ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను మూటగట్టుకునే ఉంది. వ్యామోహమో, వాస్తవమో గానీ సమాజ్‌వాదీలో అంతర్గత పోట్లాటలు దీనికి అదనం. కాంగ్రెస్‌తో చేతులు కలపిన వ్యవహారం ‘ఒక అంధుడు వేరొక అంధునికి దారి చూపే వ్యవహారం’గా మిత్రమే మిగిలింది. ఆఖరు నిమిషం బంధాలు అలాంటి ఫలితాల్నే ఇస్తాయి మరి. మాయావతి ముస్లింలకు వందస్థానాలు కేటాయించడం లాంటివి ఆమె లౌకికవాద దృక్పథం కన్నా, ఎలాగోలా గెలవాలన్న నిస్పృహనే పట్టి చూపించాయి. కాంగ్రెస్ యుపిలో సొంతంగా చెయ్యగలిగింది ఏమీ లేదు.
అందరూ ఒప్పుకోవాల్సింది- బలోపేతమై, విస్తరిస్తున్న, వికసిస్తున్న ‘కమలం’ గురించే. ప్రతిపక్షాలు ఇదే తీరులో ఉంటే, వచ్చే ఎన్నికల నాటికి అన్ని సానుకూలతలూ దానికే ఉంటాయి. బిజెపి మెరుపుదాడి వ్యూహాల్ని అర్థం చేసుకొని ప్రతివ్యూహాలు, సామాజిక మాధ్యమాల్ని వాడుకోవడం వంటి పద్ధతులను ఆధునీకరించుకోవాలి. ప్రయత్నిస్తే వామపక్షాలు కాంగ్రెస్ కన్నా మెరుగ్గా అందరినీ మెప్పించే పాత్రను పోషించగలవు. బలమైన అధికార పక్షానికి దీటుగా బలమైన ప్రతిపక్షం, జాతీయస్థాయిలో ఉండడం ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరం కనుక.

-డాక్టర్ డి.వి.జి.శంకరరావు