సబ్ ఫీచర్

చైతన్యదీపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె ఉన్నత విద్యావంతురాలు కాదు. రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. సాధారణ గృహిణి. ఆ మగువ ప్రదర్శించిన తెగువ వల్లే నేడు రాజస్థాన్‌లోని పలు గ్రామాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతున్నది. మహిళలు చైతన్యవంతులు అయితే, పలు రుగ్మతలను విజయవంతంగా నిర్మూలించవచ్చునని రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలోగల చోటిహుద్దా అనే వృద్ధురాలు నిరూపించారు.
ఎడారి రాష్టమ్రైన రాజస్థాన్‌లో ప్రభుత్వం న్యాయ ఆప్ కే ద్వార్ (మీ గడప వద్దకు న్యాయం) అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే అజ్మీర్ జిల్లాలోని బితూర్ గ్రామానికి వెళ్లారు. గ్రామంలో ఉన్న అటల్ సేవా కేంద్రం వద్ద అరుగుమీద కూర్చుని ఉన్న చోటిహుద్దా అనే మహిళ వద్దకు సి.ఎం వసుంధర వెళ్లి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటని ప్రశ్నించింది. చోటిహుద్దా తడుముకోకుండా మంచినీరు, విద్యుత్ కొరత గురించి చెప్పారు. తమ గ్రామానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారని ఆమె తెలిపింది.
విద్యుత్ చౌర్యం చేయబోమని ప్రమాణం
మీరు విద్యుత్ పంపిణీ, సరఫరా నష్టాలు తగ్గిస్తే, నిరంతరాయంగా బితూర్ గ్రామానికి విద్యుత్ సరఫరా చేస్తామని సి.ఎం. వసుంధర హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ప్రకటనపై పురుషులు ఎవరూ స్పందించలేదు. మహిళలు అందరూ సంఘటితమై విద్యుత్ పంపిణీ, సరఫరా నష్టాలకు గల కారణాలను శోధించారు. విద్యుత్ చౌర్యం, విద్యుత్ మీటర్లు టాంపర్ చేయడాలే ఇందుకు కారణంగా వారు గుర్తించారు. అనంతరం గ్రామ సర్పంచ్ సల్మాన్‌ఖాన్ నాయకత్వంలో గ్రామస్థులతో సమావేశాన్ని ఏర్పాటుచేసి, విద్యుత్ చౌర్యం, మీటర్లు టాంపర్ చేయడం వంటి పనులు చేయమని ప్రమాణం చేయించారు. దీంతో బితూర్‌కు విద్యుత్ సరఫరా చేసే భీమ్‌పుర్ ఫీడర్ పరిధిలో విద్యుత్ పంపిణీ, సరఫరా నష్టాలు 40 నుంచి 17 శాతంకు తగ్గాయి.
మహిళా ఉద్యమానికి స్పందన
గ్రామంలో విద్యుత్ చౌర్యం లేదా విద్యుత్ మీటర్లు టాంపర్ చేసే వారిని మహిళలు గుర్తించి, వారికి నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. వారు వినకపోతే, విజిలెన్స్ అధికారులకు వారిని పట్టించడం చేశారు. మహిళల ఫిర్యాదు మేరకు విద్యుత్‌ను అక్రమంగా వాడుకొంటున్న 12 మందిపై విజిలెన్స్ అధికారులు కేసులుపెట్టి, 2.5 లక్షల రూపాయలు వారి నుంచి అపరాధ రుసుంగా వసూలు చేశారు. మహిళలు సాగిస్తున్న ఉద్యమం వలన విద్యుత్ సరఫరా మెరుగుపడటంతో, పురుషుల నుంచి కూడా వీరికి మద్దతు లభించడం ప్రారంభం అయింది.
నేడు బితూర్ ఆదర్శం
బితూర్‌లో విద్యుత్ అక్రమ వినియోగం నిరోధించడానికి చేస్తున్న కృషిని రాష్ట్రంలోని మహిళలు అందరూ ఆదర్శంగా తీసుకొంటున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం దీనికి బితూర్ మోడల్ అని పేరు పెట్టింది. ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి రాజస్థాన్ ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నది. రాజస్తాన్‌లో మొత్తం 21వేల విద్యుత్ ఫీడర్లు ఉండగా, అందులో ఐదు వేల ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలు 40 అంతకన్నా ఎక్కువ శాతం ఉన్నాయి. బితూర్ మోడల్ అమలులో భాగంగా పవర్ ఫ్రెండ్స్‌ను నియమిస్తున్నారు. ప్రస్తుతం రాజస్థాన్‌లో బితూర్ మోడల్ పట్ల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మొత్తంమీద మహిళల చైతన్యంతో రాజస్థాన్‌లోని గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు విద్యుత్ కష్టాలు తగ్గాయి.

చిత్రం.. బితూర్ గ్రామస్థులతో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే

-పి.హైమావతి