సబ్ ఫీచర్

పెంపుడు జంతువుల స్వర్గ్ధామాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ సాయంత్రం వేళ మీరు హాయిగా రిలాక్స్ అవ్వాలనుకున్నారు. కాని మీరు పెంచుకునే పెంపుడు కుక్కపిల్లకు దెబ్బతగిలి అది మీతో ఆడుకునే పరిస్థితిలో లేదు, మీ మనసు మనసులో లేదు. బాధగా ఉంటుంది. కాని మీరు హైదరాబాద్‌లో ఉన్నాం అని మరిచిపోవద్దు. ఎందుకంటే హైదరాబాద్ నగరం పెంపుడు జంతువులకు పెన్నిధిగా మారిందని గ్రహించండి. చిన్న ఫోన్‌కాల్ చేస్తే చాలు మీ పెంపుడు జంతువుకు ఎలాంటి సేవ చేయటానికైనా పలు సర్వీసులు సిద్ధంగా ఉన్నాయి.
స్నేహానికి పెన్నిధి పెంపుడు జంతువు. అందుకే కుక్కకు ఉన్న విశ్వాసం మనిషి కూడా లేదంటారు. యజమాని ఆపదలో ఉంటే చాలు తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా శాయశక్తులా కాపాడటానికి ప్రయత్నిస్తుంది. అందుకే నేడు అనేకమంది మూగజీవాల పట్లప్రేమికులవుతున్నారు. జంతువులను ప్రేమించే అభిరుచి కొంతమందికి మాత్రమే ఉంటుంది. రోడ్డుమీద చిన్న కుక్కపిల్లకు దెబ్బతగిలినా వీరు విలవిలలాడిపోతారు. ప్రేమతో పెంచుకునే వాటి ఆనందం కోసం తహతహలాడుతుంటారు. ఇటువంటి జంతు ప్రేమికుల కోసం హైదరాబాద్ మహానగరంలో అనేక సెంటర్లు, సర్వీసులు వెలుస్తున్నాయి. వాటి కోసం ప్రత్యేకంగా టాక్సీలు, స్పా సెంటర్లు, రెస్టారెంట్లు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి.
పెట్స్ టాక్సీ సర్వీసు
శ్రీవాస్తవ గోర్తీ కాలీఫోర్నియాలో హైదరాబాద్‌వాసి. మనసున్న యువకుడు. నగరంలో పెంపుడు జంతువుల కోసం ట్యాక్సీ సర్వీసు ప్రారంభించాడు. పెంపుడు జంతువుల తల్లిదండ్రులు ఏ సమయంలో కాల్‌చేసినా ఈ ట్యాక్సీలు మీ ముందు ఉంటాయి. జంతువులను ఆసుపత్రికిగానీ, మరెక్కడికైనా తీసుకువెళ్లాలంటే ఇబ్బందులు పడటం సహజం. వాటిని ట్యాక్సీల్లోగానీ, ఆటోల్లోగానీ ఎక్కించుకోరు. ఒకవేళ ఎక్కించుకుంటే అదనపు ఛార్జీలు వసూలు చేస్తుంటారు. కాని ‘దొడో కస్టమర్ సర్వీసు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా తీసుకువెళుతుంది. జంతువులు ఠీవిగా కూర్చుని వెళ్లేవిధంగా సీట్లు అమర్చారు. కిలోమీటరుకు కేవలం ఏడు రూపాయలు మాత్రమే వసూ లు చేస్తారు. ఎంతోమంది కారు యజమాను లు వీరి వద్ద ఉన్నారు. ఒకవేళ జంతువులు వాహనాల్లో అపరిశుభ్రం చేసినా వారే క్లీన్ చేసుకుంటారు.
కేఫ్ సెంటర్
పెంపుడు జంతువులతో కేఫ్ సెంటర్‌లోకి రానివ్వరు. ఆదివారంనాడు సాయంత్రం వేళలో ముద్దులొలికే పప్పీతో షికారు చేస్తూ ఏ కేఫ్‌సెంటర్‌కు వెళ్లాలన్నా ఇబ్బందే. తోటి కస్టమర్లు వాటిని కేఫ్ సెంటర్లలో వస్తే ఇష్టపడరు. ఈ ఇబ్బందులు గమనించిన ఇద్దరమ్మాలు వీటి కోసం చక్కటి కేఫ్ సెం టర్‌ను ఆరంభించారు. జంతువులకు కేఫ్ సెంటర్ ఏమిటి అని తల్లిదండ్రులు ఎగతాళి చేసినా పట్టుబట్టి రుచిర, హేమంత్ సకర్వాల్ ‘కేఫ్ డీ లోకో’ సెంటర్‌ను ఏర్పాటుచేశారు. ఈ కేఫ్ సెంటర్‌లోకి జంతువులతో పాటు వారి యజమానులు కూడా సౌకర్యవంతంగా కూర్చొని కమ్మటి ఓ కప్పు కాఫీ తాగి వెళ్లవచ్చు. ఈ సెంటర్‌ను అమల అక్కినేని ప్రారంభించారు. రుచిరకు పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం. ఆమె పెట్ ‘ ఫ్లూటో’ చూసినపుడల్లా ముద్దులొలికే పెంపుడు జంతువులు అందమైన సాయంత్రాలు ఆహ్లాదంగా గడపాలంటే ఏదోఒకటి చేయాలని భావించింది. ఆలోచన రావటంతోనే తల్లిదండ్రులను ఒప్పించి ఈ కేఫ్ సెంటర్‌ను ఏర్పాటుచేసింది. ఈ కేఫ్ సెంటర్‌లో పెంపుడు జంతువుల బర్త్‌డే పార్టీలు కూడా చేసుకోవచ్చు. ఇంకా నగరంలో జూబ్లీహిల్స్‌లో ఆటమ్ లీఫ్ కేఫ్, సికింద్రాబాద్‌లో కాఫీ కప్ ఉన్నాయి.
అందంగా అలంకరిస్తారు..
అన్నింటికంటే నెక్లెస్‌రోడ్డులో డాగ్ పార్క్ పెం పుడు జంతువులకు ఆహ్లాదకరమైన ప్రదేశం. ఒకప్పుడు ఈ పార్క్‌కు మూడు లేదా నాలుగు పెంపు డు జంతువులు మాత్రమే వచ్చేవి. కాని నేడు 200 వరకు వచ్చి ఎంజాయ్ చేస్తుంటాయి. ఆదివారం ఈ పార్క్ బిజీ బిజీగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పెంపుడు జంతువులను అందంగా అలంకరించుకోవాలని ఉబలాటపడేవారికి ము స్కాన్ అనే సెంటర్ కూడా ఉంది. ఇందులో కుక్కలను, ఇతర పెంపుడు జంతువులను అందంగా రంగురంగుల డ్రెస్స్‌ల్లో అలంకరిస్తారు. వాటి జుత్తును కట్ చేసి అందమైన పెళ్లికూతురు వలే ముస్తాబు చేస్తారు. మరింకెందుకు ఆలస్యం. పెంపుడు జంతువుల తల్లిదండ్రులారా! హాయిగా ఎంజాయ్ చేయండి.