సబ్ ఫీచర్

జలసిరి.. ఆమె ఊపిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెరువును పునరుద్ధరించే పనులు జరుగుతుండగానే ఇక్కడ ప్రజలు సహకరించకపోగా దొంగచాటుగా వ్యర్థాలు తీసుకువచ్చి పోసేవారు. అంతేకాదు ఈ ప్రాంతంలోకి వాహనాల్లో వచ్చి మొక్కలను పాడుచేసేవారు.
- మధులిక

మీరు గనుక తొమ్మిది నెలల క్రితం హైదరాబాద్ మహానగరం రాజేంద్రనగర్‌లోని నెక్నాంపూర్ చెరువు వద్దకు వెళితే అక్కడ కంపుకొట్టే మురుగు, ఖాళీ మందు సీసాలు, చెత్తాచెదారంతో చెరువు నీరంతా అసహ్యాంగా ఉండేది. అదే చెరువు వద్దకు నేడు వెళితే.. చెరువు చుట్టూ చిరుగాలులకు తలలు ఊపే విభిన్నరకాల మొక్కలు కనువిందు చేస్తాయి. దాదాపు మూడువేల రకాల మొక్కలు పచ్చగా కళకళలాడుతూ మనసు ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. దీనికి తోడు స్వచ్ఛమైన నీరు సవ్వడి చేస్తుంటుంది. ఎదుగుతున్న పచ్చటి మొక్కలపై వాలే రంగు రంగుల సీతాకోక చిలుకలు, చిన్ని చిన్న గువ్వపిట్టలు అక్కడ సందడి చేస్తుంటాయి. నీళ్లలో చలాకీగా తిరిగే చేప పిల్లలు కనిపిస్తాయి. పనికిరాదనుకున్న చెరువును పచ్చటి పొదరిల్లుగా మార్చిన మధులికా చౌదరికి ఈ పక్షులు, చేప పిల్లలు, సీతాకోక చిలుకలు కృతజ్ఞత చెబుతున్నట్లు అక్కడకి వచ్చినవారికి ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి.
ప్రకృతి ప్రేమికురాలు
ప్రొఫెసర్‌గా పనిచేసిన మధులిక ఎస్. చౌదరి ప్రకృతి ప్రేమికురాలు. ఈమె ఇంటికి సమీపంలో ఉండే ఈ చెరువును చూసి ఎంతో బాధపడేది. వారసత్వంగా వచ్చిన ఇలాంటి చెరువులు, సరస్సులను వ్యర్థాలతో నాశనం చేస్తున్నామని బాధపడేది. గోల్కొండ, ప్రేమమతి మసీదు వంటి పురాతన కట్టడాలు వన్యప్రాణులకు ఆవాసాలుగా విలసిల్లినట్లుగానే ఇలాంటి జలసిరిని పురావస్తు సరస్సుగా మార్చేస్తే పక్షులకు, క్రిమికీటకాలు ఆవాసంగా మారుతుందనే దృఢ సంకల్పంతో సరస్సు పునరుద్ధరణకు ఉపక్రమించింది. పాఠశాల, కాలేజీ విద్యార్థులను కూడగట్టింది. అంతేకాదు తనకు సహకరించమని పెద్దలను అభ్యర్థించింది. సరస్సుగా ఏ విధంగా తీర్చిదిద్దాలనుకున్నదో ఓ ప్రాజెక్టు రూపంలో అధికారుల ముందు ఉంచింది. ఆమె చేసిన ఎన్నో ప్రయత్నాలు ఫలించి నేడు ఈ సరస్సు ఇలా నేడు కాంతులీనుతోంది. ఇంకా ఈ చెరువు చుట్టూ ఉండే కొండచిలువలు, చిన్నచిన్న వన్యప్రాణులను కాపాడాలనే ధ్యేయంతోనే ఈ సరస్సు వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా తీర్చిదిద్దాలంటే అంత సులువుగా జరగదని, అందరూ కలిసికట్టుగా కదిలితేనే సాధ్యం అని మధులిక చెబుతుంది. ప్రకృతిని కాపాడాలనే ఏకైక సంకల్పంతో మధులిక తన బృందంతో పనిచేస్తుంది. గణేష్ ఉత్సవాల సందర్భంగా విగ్రహాల నిమజ్జనం జరగకుండా చూడాలని కోరుకుంటోంది.
జలకళ
ఇపుడు గనుక ఈ సరస్సు వద్దకు వెళ్లి ఆనందంగా తిరిగిరావాలంటే కచ్చితంగా కొన్ని కఠినమైన నిబంధనలు పాటించాల్సిందే. ఈ నిబంధనలు కేవలం ఈ సరస్సును పదికాలలపాటు కాపాడుకునేందుకేనని అంటారు మధులిక.
కార్లు వంటి నాలుగు చక్రాల వాహనాలు ఇక్కడకు అనుమతించరు.
ఎలాంటి వ్యర్థపదార్ధాలు వేయకూడదు.
ఇక్కడ ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులు వాడకూడదు.
మనతో పాటు ఉండే వన్యప్రాణులకు చెందిన ఈ ప్రాంతాన్ని ఆక్రమణలకు పాల్పడకూడదు.
శబ్దకాలుష్యం ఉండకూడదు.
చెత్తాచెదరాన్ని, మురికిని ఇక్కడ పారపోయకూడదు. ఎలాంటి దహన క్రియలు జరపకూడదు.
అరుదైన వన్యప్రాణులకు ఆలవాలం
నెక్నాంపూర్ సరస్సు వన్యప్రాణులకు ఆలవాలమైందంటే ఆశ్చర్యపోక తప్పదు. 136 రకాలకు వివిధ జాతుల పక్షులు ఇక్కడ సేదతీరుతుంటాయి. పిచ్చుకలు మొదలుకుని హెరాన్స్, ఇమిస్, ఎగ్రెట్, గుడ్లగూబలు, అరుదైన యూరేషియన్ పక్షులు ఇక్కడ సందడి చేస్తుంటాయి. వెరైటీ పాములు కూడా కనిపిస్తుంటాయి. ఆఫ్రికన్ నత్తలు, తాబేళ్లు, ముంగిసలు, కొండచిలువలు, చేపలు కూడా కనువిందుచేస్తుంటాయి.