సబ్ ఫీచర్

పనికొచ్చే చెత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐస్ బక్కెట్ సవాల్ పాతదై పోయింది. ఇపుడు సరికొత్త సవాల్ హైదరాబాద్ నగర వాసుల ముందుకు వచ్చింది. అదేమిటంటే ఇంట్లో పనికిరాని బక్కెట్ ఏర్పాటు చేసి అందులో పనికిరాని వ్యర్థాలను నిల్వచేసి కంపోస్ట్ ఎరువుగా తయారుచేయటం. ఇలా కంపోస్ట్ ఎరువును తయారు చేస్తానని ముందుకు వచ్చేవారికి వెన్నుతట్టి ప్రోత్సహించే సంస్థ కూడా ఉంది. అదే ‘స్వచ్ఛగృహ బృందం’. ఏడుగురు సభ్యులున్న ఈ స్వచ్ఛగృహ బృందం హైదరాబాద్ నగరంలో రోజుకు రోజుకు పేరకుపోతున్న చెత్త సేకరణకు సరికొత్త పరిష్కారాన్ని కనిపెట్టింది. ఇంట్లో అవసరం లేని వ్యర్థాలను ఏదో రకంగా వదిలించుకోవాలని చూస్తుంటాం. అయితే ఇంటి వ్యర్థాలను సరైన పద్ధతిలో వదిలించుకుంటే పర్యావరణాన్ని, భూగర్భ జలాలు కాపాడినవారవుతారనే ఆశయంతో, ఆ వ్యర్థాలను వినియోగంలోకి తీసుకురావాలనే సంకల్పంతో కంపోస్ట్ బక్కెట్‌లకు శ్రీకారం చుట్టారు ఈ ఏడుగురు. ఇటీవల జరిగిన ధరిత్రి సంరక్షణ దినోత్సవం నాటి నుంచి ఈ వ్యర్థాలను సేకరించే పని ప్రారంభించారు. సత్యమేవ జయతే అనే కార్యక్రమ స్ఫూర్తితో దీనిని ప్రారంభించామని ఈ బృందం ఏర్పాటుకు ప్రధాన కారకుడైన రాయికంటి నాగానంద్ చెబుతున్నారు.
ఇంటిలో తోటలు!
ఇంటి వ్యర్థాలను టెర్రాస్, ఇండోర్ గార్డెన్ పెంపకానికి ఉపయోగిస్తే ఎంతో మేలు. అందుకోసమే ప్రజలను కంపోస్ట్ కుండలను ఏర్పాటు చేసేలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. వాస్తవానికి తడి వ్యర్థాలు కంపోస్ట్ ఏరువుగా మారటానికి కనీసం మూడు నెలలు సమయం పడుతుంది. దీనివల్ల దుర్వాసన వస్తుంది. ఇంతకాలం గృహస్థులు వేచి ఉండటానికి ఇష్టపడరు. అందుకే ఈ గ్రూపు సభ్యులు స్వచ్ఛగృహ పేరుతో పార్కులు తదితర ప్రాంతాల్లో డెమోస్టాల్స్ ఏర్పాటు చేస్తారు. ఈ ఇంటి వ్యర్థాలను సేకరించి కంపోస్ట్‌గా మార్చే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
సోషల్ మీడియా కలిపింది..
ఫేస్‌బుక్ పరిచయమే వీరిని ఇలాంటి సేవకు కలిపింది. వ్యర్థాలకు సరికొత్త అర్థం చెప్పే సదాశయంతో వీరంతా గ్రూపుగా ఏర్పడటానికి ఐదేళ్లు పట్టింది. వీరందర్నీ కలిపింది ఫేస్‌బుక్ అనే సోషల్ మీడియా అని చెప్పవచ్చు. ఈ ఫేస్‌బుక్ పేజీలు కంపోస్ట్ ఎరువును తయారుచేసే పర్యావరణ పరిరక్షణ ప్రేమికులుగా మార్చేస్తుందనే నమ్మకం మాకుందని ఈ బృందంలోని సభ్యురాలు ఆర్తి చౌదరి విశ్వాసం. వీరి పిలుపునకు స్పందించిన అనేకమంది పర్యావరణ ప్రేమికులు ఈ గ్రూపులో చేరటానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే మూడు వేల మంది సభ్యులు ఉన్నారు. వీరంతా టెర్రస్, ఇండోర్ గార్డెన్‌ను పెంచాలనే ఆసక్తి
ఉన్నవారే. నాగానంద్ చొరవ వల్లే ఈ బృందం ఏర్పాటైందని చెప్పవచ్చు. శోభ, ఆరతి చౌదరి, విశాలి పాటిల్, నీతా ప్రసాద్, వి.ఎం నళిని, లంక రమణ ఈ బృందంలో యాక్టివ్ మెంబర్లు. కంపోస్ట్ ఎరువ తయారీ, టెర్రస్, ఇండోర్ గార్డెన్ సాగు పద్ధతులను వివరిస్తూ 300 వరకు వర్క్‌షాప్‌లు నిర్వహించారు.
సేంద్రీయ సాగు చేస్తున్నారు
ఈ బృందంలో ఒకరైన ఆర్తి చౌదరి ఇంటికి సరిపడా కూరగాయలను పెంచుకుంటుంది. కుటుంబ సభ్యులకు పౌష్టికాహారాన్ని అందించాలనే సంకల్పంతోనే కూరగాయాలను, పండ్లను స్వయంగా పెంచుకుంటుంది. ఎలాంటి పురుగు మందులు వేయకుండా కంపోస్ట్ ఎరువును స్వయంగా తయారు చేసుకుని పెంచుకుంటుంది. మరో సభ్యురాలు శోభ కూడా అమెకు ఉన్న 400 గజాల స్థలాన్ని పెర్మాకల్చర్ గార్డెన్ అని పిలుస్తారు. ఎందుకంటే సహజ సిద్ధంగా ఏర్పడిన గార్డెన్ అన్నమాట. ఈ స్థలంలో ఆమె ఏమీ పెద్దగా పని చేయరు. ఇక్కడ పెంచుతున్న పువ్వులు, పండ్లు, నేలమీద పడే విత్తనాల వల్లే ఈ తోట చిన్నపాటి అడవి వలే మారిందని చెప్పవచ్చు. ఇంట్లోని వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువును తయారుచేసి ఇక్కడ పెరిగే మొక్కలకు వేస్తుంది. మరింకెందుకు ఆలస్యం పర్యావరణాన్ని ప్రేమించేవారంతా ఈ బృందంలో చేరి కంపోస్ట్ ఎరువు తయారీలో భాగస్వామలవ్వటానికి అడుగు ముందుకు వేయండి. ఎందుకంటే వేసవి కాలమే కంపోస్ట్ ఎరువు తయారీకి అనుకూలమైన కాలం.*

చిత్రం.. స్వచ్ఛగృహ బృందం సభ్యులు శోభ, ఆర్తి చౌదరి, నాగానంద్