సబ్ ఫీచర్

ఆనందోబ్రహ్మ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూమిమీద భూతల స్వర్గం అనేది ఏదేనా ఉందంటే అది ఫిన్లాండ్ దేశమే. ఫిన్లాండ్ ప్రపంచంలోని చిన్న దేశాలలో ఒకటి అయినప్పటికీ, వరల్డ్ హ్యాపీ ఇండెక్స్‌లో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నదంటే, అందుకు ప్రధాన కారణం అక్కడ అమలులో ఉన్న విద్యా విధానమే. మన దేశంలో మాదిరిగా చదువుకు సంబంధించి పిల్లలపై ఎటువంటి వత్తిడి ఫిన్లాండ్‌లో ఉండదు. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా విధానంగా కొనియాడబడుతున్న ఫిన్లాండ్ విద్యా విధానాన్ని ఒకసారి పరిశీలిద్దాం.
ఏడు సంవత్సరాల వయస్సు వచ్చేంతవరకు పిల్లల్ని పాఠశాల గడప ఎక్కనివ్వరు. ఏడు సంవత్సరాలనుంచి పది సంవత్సరాల వయసు వరకు సంవత్సరంలో సగం రోజులు పాఠశాలలో, మిగిలిన సగం రోజులు సెలవుల్లో గడుపుతారు. పాఠశాలలో పాఠ్యాంశాల బోధన సమయం తక్కువ. విద్యార్థులకు సంగీతం, కళలు, ఆటలు నేర్పించడానికి ప్రాధాన్యం ఇస్తారు. పాఠశాలల విద్యార్థులు ఎప్పుడు కావాలంటే అప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి, ప్రత్యేకంగా విశ్రాంతి గదులు ఉంటాయి. 13 సంవత్సరాల వయసు వచ్చేంతవరకు విద్యార్థులకు గ్రేడింగ్, ప్రోగ్రెస్ కార్డుల గొడవ వుండదు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రతిభను తెలుసుకోవాలంటే, వారు స్కూల్ యాజమాన్యానికి దరఖాస్తు చేసుకోవాలి.
ప్రతి పాఠశాలకు ప్రత్యేకంగా ఒక వైద్యుడు ఉంటారు. పాఠశాలలోని విద్యార్థులకు వైద్య సలహాలు ఇస్తుంటారు. ఏ పాఠశాలలో కూడా ఆరు వందలకు మించి విద్యార్థులు ఉండటానికి వీలులేదు. విద్యా సంస్థలు అన్ని కేవలం
ప్రభుత్వ యాజమాన్యంలోనే పనిచేస్తాయి. ప్రైవేటు పాఠశాలలు ఏర్పాటుకు
అనుమతించరు. 56 దేశాల నుంచి ప్రతి సంవత్సరం 1500 మంది విద్యార్థులు ఫిన్లాండ్‌లో చదువుకోవడానికి వస్తూంటారు. ఫిన్లాండ్‌లో ఉపాధ్యాయుడి హోదా సివిల్ సర్వీసెస్ అధికారులకన్నా ఎక్కువ. అక్కడ ప్రభుత్వ విధానాలు, చట్టాలు రూపకల్పనలో ఉపాధ్యాయులే కీలక పాత్ర వహిస్తారు. ఫిన్లాండ్‌లోని ప్రతి ముగ్గురు విద్యార్థులలో ఒకరు తాము ఉపాధ్యాయుడు కావాలని కోరుకుంటారు. ఉపాధ్యాయుడిగా ఎంపిక కావాలంటే మొత్తం ఏడు వంవత్సరాలు వివిధ విభాగాలలో శిక్షణ పొందాలి. ఐదు సంవత్సరాలపాటు ఉపాధ్యాయ శిక్షణ కోర్సు, ఆరు నెలలు సైన్యంలో పనిచేయాలి. చట్టాలు, ప్రభుత్వ విధానాల రూపకల్పన, స్వయం రక్షణా, ప్రథమ చికిత్స తదితర అంశాలపై సంవత్సరంపాటు శిక్షణ ఇస్తారు. అగ్నిమాపక దళంలో ఆరు నెలలు శిక్షణ తీసుకోవాలి. ఈ శిక్షణ పూర్తిచేసినవారిని ఉపాధ్యాయులుగా నియమిస్తారు. శిక్షణ పూర్తయ్యేటప్పటికే ఉపాధ్యాయుడు అన్ని అంశాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉంటారు. విద్యార్థులకు వారు మిడిమిడిజ్ఞానంతో కాకుండా సంపూర్ణ జ్ఞానం బోధన సాగిస్తారు. మనకు మాదిరిగా ఇరుకు గదులలో కాకుండా, ఆహ్లాదకరమైన వాతావరణంలో తరగతులు నిర్వహిస్తారు. దీనివలన విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకొంటారు. చదువు పూర్తి అయి బయటకు వచ్చేటప్పటికి ప్రతి విద్యార్థి చదువుతోపాటు ఏదో ఒక ఆట లేదా కళలో ప్రావీణ్యాన్ని కలిగివుంటారు. అందువలన, ప్రపంచంలో అత్యంత సంతోషంగా జీవించే దేశంలో ఫిన్లాండ్ ప్రథమ స్థానంలో ఉంది.

- పి.్భర్గవరామ్