సబ్ ఫీచర్

దూసుకుపోతున్న ఆటో భవాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్’ అన్నాడో కవి. అవును. ఈ మాటలు ఆ ఆటో భవాని విషయంలో అక్షరాలా నిజమనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆడవాళ్ళు మగవాళ్ళకు ఏ విషయంలోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు గుంటూరు నల్లచెరువుకు చెందిన కోలా భవాని. హెచ్‌ఐవితో భర్త మరణించినా, నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా తన కాళ్ళమీద తను నిలబడింది. గుంటూరులో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ, తన ముగ్గురు పిల్లలను చదివించుకుంటూ జీవితం సాగిస్తోంది. ఆరేళ్ళుగా ఆటోనో నమ్ముకున్న భవానికి వచ్చే సొమ్ములు వడ్డీలకే సరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.

గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన భవాని 14 ఏళ్ళ వయసులోనే తల్లిదండ్రులు పెళ్లి చేసేశారు. పెళ్లంటే ఏమిటో కూడా తెలియని వయసులో భర్త హనుమంతరావు చేయి పట్టుకుని నంబూరుకు మెట్టినింటకు చేరింది. హనుమంతరావు తల్లిదండ్రులతో కలిసి నంబూరు గ్రామం లో ఓ హోటల్ నడిపేవాడు. వారికి ముగ్గురు మగ పిల్లలు జన్మించారు. ఏడేళ్ల తర్వాత (్భవానికి 21 ఏళ్ళు) హనుమంతరావు హెచ్‌ఐవితో కన్నుమూశాడు. ఓ వైపు భర్త మృతిని జీర్ణించుకోలేక, మరోవైపు ముగ్గురు చిన్నపిల్లలను పెంచేదెలా అనుకుంటూ శూన్యంలోకి నెట్టివేసినట్లుగా మారింది భవాని పరిస్థితి. ఆత్మహత్య చేసుకుందామంటే ముగ్గురు చిన్న బిడ్డలు కళ్ళముందు కదలాడేసరికి తన ప్రయత్నాన్ని విరమించుకుంది. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో గుంటూరులోని ఓ స్వచ్ఛంద సంస్థ సహకారం కోరింది. ఉపాధి కల్పించమని వేడుకుంది. భవానికి సంస్థ నిర్వాహకుడు చుక్కా శామ్యూల్ అనిల్‌కుమార్ ఉపాధి కల్పించారు. ఆయన సంస్థలోనే హెచ్‌ఐవి వ్యాధిగ్రస్తులకు ........... అలా గుంటూరుకు మకాం మార్చింది. గుం టూరులో భవాని అత్తమామలకు ఓ ఇల్లు ఉంది. అత్తమామలను ఒప్పించి ఆ ఇంట్లో ఉంటూ జీవితాన్ని ప్రారంభించింది. చుట్టుప్రక్కల వారి సహకారంతో అగ్రిగోల్డ్ ఏజెంట్‌గా, చిన్న చిన్న పనులు చేయడం ప్రారంభించింది.
మలుపుతిప్పిన ఆటో
ఎన్ని పనులు చేస్తున్నా భవానికి కష్టాలు మాత్రం తప్పడంలేదు. పిల్లల చదువులు, ఖర్చులు చుట్టుముట్టడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడేది. ఆ సమయంలో చిలకలూరిపేటకు చెందిన మరో స్వచ్ఛంద సేవా సంస్థలో పనిచేస్తున్న బాజీ ఆటో కొని అద్దెకు ఇవ్వమని సలహా ఇచ్చాడు. అతడి సలహా మేరకు తన చెల్లెలి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు తీసుకుని తాకట్టుపెట్టి ఆటో కొనుగోలు చేసింది. దాన్ని బాడుగకు ఇస్తూ బాకీ తీర్చింది. అప్పటినుంచి ఎంతో కొంత మిగులు కనపడుతుంది అనుకునే సమయంలో ఆటో రిపేర్లకు రావడం, బాడుగకు తీసుకెళ్లిన డ్రైవర్లు ఇబ్బందులకు గురిచేయడం ప్రారంభించారు. దీంతో అరకొర సంపాదనను ఆ ఆటోకోసం వెచ్చించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో భవాని అయోమయానికి గురైంది.
ఆటో బాడుగగు ఇవ్వడం ఎందుకు, నువ్వే నడపవచ్చుగా అంటూ అనిల్‌కుమార్ సలహా ఇచ్చారు. దాంతో పట్టుదలతో ఆటో నేర్చుకోవడం మొదలుపెట్టారు. పట్టుదలతో అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, కేవలం ఒక్కరోజులోనే పూర్తిస్థాయిలో డ్రైవింగ్‌పై పట్టు సాధించింది.
మేలు మరువని గుణం ఆమెది..
తన కాళ్ళపై తను నిలబడడానికి కృషిచేసిన అత్తింటివారు, బ్రదర్ అనిల్‌కుమార్, ఫాదర్ అల్లం రాయపరెడ్డిలకు ఆమె కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వారే లేకుండా నేడు తన పరిస్థితి ఏమిటని కన్నీటి పర్యంతమైంది.
పిల్లలను తీర్చిదిద్దడమే ధ్యేయం..
ముగ్గురు పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది వారికి చక్కటి భవిష్యత్తును అందించడమే ధ్యేయమని పేర్కొంది. ప్రస్తుతం పెద్ద కుమారుడు హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తిచేసి నెల్లూరులోని ఓ హోటల్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కుమారుడు ఇంటర్ పూర్తికాగా, మూడో కుమారుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడని వివరించింది. వారు ప్రయోజకులుగా తయారైతే చాలు.. అంతకుమించి నా జీవితానికి మరే ఆశ లేదని పేర్కొంది. ప్రభుత్వం నుంచి లేదా స్వచ్ఛంద సంస్థలు, దాతలనుంచి తనకు ఏమైనా సహాయం అందితే మరింత మేలు జరుగుతుందని ఆమె ఆశిస్తోంది.
ముఖ్యంగా ఆటోలో ఎక్కే కాలేజీ విద్యార్థినులు భవానీ ధైర్యానికి, ఆత్మ సంకల్పానికి, నిజాయితీకి అభినందనలు కురిపిస్తున్నారు. చిన్న చిన్న విషయాలకే తెగ బాధపడిపోయి నాశనం చేసుకుంటున్న యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నావని వేనోళ్ళ పొగుడుతున్నారు. వారిస్తున్న మద్దతుతో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతోంది.

- నీలిమ సబ్బిశెట్టి