సబ్ ఫీచర్

హత్య చేసి సంతాపమా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తానే హత్య చేసి మృ తదేహం వద్ద తానే సంతాపం ప్రకటిస్తే ఎలా ఉంటుంది? ఎదుటివారిని నిలువెల్లా గాయాలకు గు రి చేసి, తానే పరామర్శిస్తే ఎలా ఉంటుంది? రక్తం రు చి మరిగిన పులి తాను సాధుజీవినయ్యానని చెబితే ఎలా ఉంటుంది?.. గుంటూరులో ‘రాహుల్ గాంధీ అండ్ కో’ ఏపికి ప్రత్యేక హోదా, రాష్ట్రానికి జరిగిన నష్టంపై ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఉంటుంది! అవును.. తెలంగాణలో అధికారంలోకి రావాలన్న కుట్ర బుద్ధితో, హేతుబద్ధత లేకుండా, అడ్డదిడ్డంగా, హడావుడిగా విభజన చట్టం రూపొందించి- ప్రత్యేక హోదాకు చట్టబద్ధత కల్పించకుండా ఏపి భవిష్యత్తును చిదిమేసి, భ్రూణహత్య చేసిన కాంగ్రెస్ -కుడి ఎడమ పార్టీలు గుంటూరుకొచ్చి.. ‘దగాపడ్డ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని దయతో సెలవివ్వడం’ నక్కలు నారాయణ మంత్రం పఠించడం లాంటిదే! తాము అధికారం వెలగబెట్టినప్పుడు ‘హోదా’కు చట్టబద్ధత కల్పించకుండా, ఆ తంటాలేవో కొత్తగా వచ్చే బిజెపి సర్కారు చూసుకుంటుందన్న కాంగ్రెస్ అతి తెలివికి- రెండు రాష్ట్రాల ప్రజలు మాడుపగులకొట్టినా ఇంకా బుద్ధిరాకపోగా.. నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ఉద్ధారకులమని ఎగేసుకుని రావడం తెగింపుకాక మరేమిటి? అదీకాకపోతే- ప్రజలు విభజన కాలం నాటి హత్యాకాండను మర్చిపోయి ఉంటారన్న ధైర్యమా? ప్రజాస్వామ్య బద్ధంగా, రాజ్యాంగపరంగా బిల్లు ఆమోదించకుండా, ఒక ప్రధాని పార్లమెంటులో ఇచ్చిన హామీ చట్టరూపం ఎలా అవుతుందో ఓడిపోయిన జట్టు యువరాజులు, పక్కవాయిద్య పార్టీలే సెలవివ్వాలి.
ఇంతకూ ఓడిపోయిన అనాథ పార్టీలన్నీ కట్టకట్టుకుని ఏపికి ఎందుకొచ్చినట్లు? హోదాపై ప్రేమతోనా? లేక పక్కనే ఉన్న తమిళ వృద్ధ సింహం కరుణానిధికి బర్త్‌డే గ్రీటింగ్స్ చెప్పి, అదే సమయంలో ఆంధ్రకూ వచ్చి ఒక పనైపోయిందనిపించడానికా? సొంత పార్టీ ఎంపీలు ప్రాధేయపడినా కనికరించకుండా, పళ్లూడిపోయి లేవలేని వృద్ధసింహాల మాట విని, కేసీఆర్‌నూ కలిపేసుకోవచ్చన్న అతి తెలివితేటలతో అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి, ఆ గాయాలను ఆంధ్ర ప్రజలు.. ప్రభుత్వంతో కలసి గుర్తుచేసుకుంటున్న నవ నిర్మాణ దీక్షల రోజుల్లోనే రాష్ట్రానికి రావటం గొప్ప సాహసమే. దీన్నిబట్టి కాంగ్రెస్ నాయకత్వానికి ఇంకా రాచరికపు పోకడలు వదలలేదని అర్థమవుతూనే ఉంది. ‘అక్క ఆర్భాటమే గానీ, బావ బతికేదిలేదన్న’ట్లు రాహుల్ బాబు ఎంత కష్టపడినా మరో పదేళ్లు ఏపిలో కాంగ్రెస్ నుదుట అధికార సౌభాగ్యం కల్లే!
అధికారంపై ఆశతో రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ ఇచ్చినా, ఆ రాష్ట్రానికైనా పూర్తిగా న్యాయం చేసిందా? అంటే అదీ లేదు. ‘విభజన’ ఆలోచన ఉన్నప్పుడు రెండు రాష్ట్రాలకు ఏమివ్వాలో ఉభయులనూ పిలిచి మాట్లాడి, వారి అంగీకారానంతరం దానికి చట్టబద్ధత కల్పించి, పార్లమెంటులో బిల్లు పెట్టేనాటికే దానికో రూపం ఇచ్చి ఉంటే రెండు రా ష్ట్రాల మధ్య ఇంత పంచాయితీ కొనసాగేది కాదు. అందుకు భిన్నంగా తంపులు పెట్టి తమాషా చూసే విభజన రాజకీయానికి, ఇప్పుడు రెండు రాష్ట్రాల తెలుగువాళ్లే నష్టపోతున్నారు. హైకోర్టు ఇప్పటికీ విభజన కాలేదు. హైకోర్టు సంగతి తేలేదాకా అసలైన విభజన జరగనట్లేనని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, ఆర్టీసీ, విద్యుత్, ఉన్నత విద్యామండలి వంటి కీలక శాఖల్లో రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఘర్షణలన్నీ కాంగ్రెస్ కుటిల రాజకీయాల పుణ్యమే. ప్రజలకు కాపలా కాయాల్సిన రెండు రాష్ట్రాల పోలీసులు సరిహద్దుల్లో, శత్రువుల మాదిరి కొట్టుకునే దౌర్భాగ్య పరిస్థితికి కచ్చితంగా కాంగ్రెస్ నీచ రాజకీయమే కారణమన్నది నిష్ఠుర నిజం!
విభజన జరిగిన మూడేళ్లు వెనక్కి వెళితే.. రాష్ట్రానికి వచ్చి, మళ్లీ ప్రజలకు ముఖం చూపించే నైతిక అర్హత కాంగ్రెస్‌కు ఉందా? అని ఎవరికైనా అనిపిస్తుంది. గుంటూరు ‘్ఫ్లప్ షో’లో చేతులు పైకెత్తి మీ వెనుక ఉంటామంటూ వాక్రుచ్చిన పార్టీల గడప ఎక్కి, హేతుబద్ధత లేకుండా చేస్తున్న విభజనను అడ్డుకుని, ప్రజలతో చర్చించి సమన్యాయం చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నాటి విపక్ష నేత చంద్రబాబు చెవినిల్లుకట్టుకుని చెప్పి- చేతులెత్తిన వారికెవరికీ పట్టలేదు.
అసలు విభజన వ్యవహారంలో పాపపుణ్యాల మాటకొస్తే ‘తిలాపాపం తలా పిడికెడన్న’ట్లు ఆ పాపంలో అందరి పుణ్యమూ ఉంది. సీపీఎం తప్ప మిగిలిన పార్టీలన్నీ విభజనకు తలా ఓ చేయి వేసినవే. బిజెపి-టిఆర్‌ఎస్ విభజనవాదం చేసి చివరివరకూ ఆ మాటమీద నిలబడితే, మిగిలినవన్నీ పిల్లిగంతులే! విభజన ఏవిధంగా చేయాలన్న ఒక గొడ్డలిని జగన్ అందిస్తే, రెండుసార్లు లేఖలు ఇచ్చి నరికేయమని బాబు సలహా ఇచ్చారు. అయినా జనం జగన్‌ను కా కుండా బాబునే నమ్మడానికి అనుభవమే అక్కరకొచ్చింది. తాను రెండుసార్లు విభజన లేఖలు ఇచ్చినా, దాన్ని కూడా కాంగ్రెస్ క్రూరత్వ ఖాతాలోనే కలిపినప్పటికీ జనం మాత్రం బాబునే నమ్మడం ఆయన అదృష్టం. సమైక్యాంధ్రకు ‘జై’కొట్టినా ప్రజలు జగన్‌ను నమ్మకపోవడం ఆయన దురదృష్టం.
విభజన తర్వాత తెలంగాణలో ఉండిపోయిన ఆంధ్ర ప్రజలు, ఆ మూలాలున్న వారి ప్రస్తుత స్థితిగతులు, విభజన జరిగి మూడేళ్లయినా సొంతగడ్డకు రాకుండా అక్కడ ఉండిపోవడానికి గల కారణాలనూ సింహావలోకనం చేసుకోవలసిందే. ఉమ్మడి రాష్ట్రం విడిపోతే తెలంగాణలో ఉన్న సీ మాంధ్రుల ఉనికికి ముప్పు వస్తుందన్న ప్రచారం ఉత్తిదేనని ఈ మూడేళ్లలో తేలిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో సీమాంధ్రులు మూకుమ్మడిగా ‘కారు’ ఎక్కారు. హైదరాబాద్‌లో స్ధిరపడిన సీమాంధ్రుల రక్షణకు తాను పూచీకత్తు వహిస్తానని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఇచ్చిన భరోసాను కేసీఆర్ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకూ హైదరాబాద్ సహా తెలంగాణలోని సెటిలర్లపై ఈగ కూడా వాలలేదు.
ఇంకో విచిత్రమేమంటే.. ఉద్యమ సమయంలో ఏ ‘ఆంధ్రోళ్లు’ తమ సాగునీటి ప్రాజెక్టులను దోచుకుంటున్నారని ఉద్యమకారులు ధ్వజమెత్తారో, గత మూడేళ్ల నుంచి అదే ఆంధ్రా కాంట్రాక్టర్లు ఎంచక్కా పనులు చేసుకుంటున్నారు. మేఘా ఇంజనీరింగ్ వంటి బడా కంపెనీలకు ‘ఇద్దరు చంద్రులూ’ రెడ్‌కార్పెట్ వేస్తుండటం మరో వింత. ఉద్యమ సమయంలో వీ టిపై విరుచుకుపడిన తె లంగాణవాదులు ఇపు డు తమ సొంత పాలనలో నూ అవే దృశ్యాలు కనిపిస్తున్నా, పెదవి విప్పకపోవడం బట్టి వారంతా ‘త త్వం’ ఆలస్యంగా తెలుసుకున్నట్లు అర్థమవుతుంది.
హైదరాబాద్ వాతావరణం, సామాజిక పరిస్థితులు, స్వేచ్ఛాయుతమైన జీవనం, తెలంగాణ పౌరుల వ్యక్తిత్వం, కావలసినంత వినోదం ఇవన్నీ సీమాంధ్రులను సొంత రాష్ట్రానికి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నాయి. తెలంగాణలో కులాల పితలాటకం లేదు. ఎవరి పని వారిదే. ఆంధ్రలో పరిస్థితులు అందుకు భిన్నం. ఆంధ్రలో ప్రతిదీ కులం కోణమే. ప్రతి అడుగులోనూ కులం బాహాటంగా కనిపిస్తుంటుంది. ఒక కులానికి మరో కులానికి కొట్లాటలు. ఒక్కముక్కలో చెప్పాలంటే నిత్యజీవనంలో కులం ఓ భాగం! గుంటూరు-కృష్ణా జిల్లాల్లో ఇది మరీ ఎక్కువ. పైగా వినోదం భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. వాతావరణ పరిస్థితీ అంతే. అందుకే ఇప్పటికీ చాలామంది ఏపి మంత్రులు, అధికారులు శని, ఆదివారాల్లో ఉమ్మడి రాజధానిలోనే ఉంటున్నారు. వాటికయ్యే ఖర్చులన్నీ సర్కారే భరిస్తుందనుకోండి. అది వేరే విషయం! ఇంకా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడకపోవడం, జీవన వ్యయం హైదరాబాద్ కంటే విపరీతంగా ఉండటం వల్ల ‘సెటిలర్లు’ సీమాంధ్ర వైపు చూడలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావలసిన బాధ్యత పా లకులదే!
* * *
జగన్ బాబుకు చెవిరెడ్డి వంటి మిత్రులున్నంత వరకూ వేరే శత్రువులు అవసరం లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా ఉద్యోగులను చంద్రబాబుపై ఎగదోసి, ఆ సానుకూలత తన ఖాతాలో కలిపేసుకునేందుకు పులివెందుల ముద్దుబిడ్డ తపిస్తుంటే, చెవిరెడ్డి లాంటి ఎమ్మెల్యేలు దానిని తన నోటిదురుసుతనంతో విజయవంతంగా చెడగొడుతున్నారు. చింతమనేని ప్రభాకర్ వంటి ఎమ్మెల్యేలు ఉద్యోగులపై దాడులు చేస్తున్నారని, రవాణాశాఖ కమిషనర్‌పై ‘తెలుగు తమ్ముళ్లు’ కాలుదువ్వారన్న తాటికాయంత అక్షరాలతో అటు సొంత మీడియా, ఇటు జనంలోకి వెళ్లి వైసీపేయులు ఇన్నాళ్లూ ఉద్యోగుల్లో పెంచిన వ్యతిరేకత అంతా చెవిరెడ్డి చేసిన ఒక్క హెచ్చరికతో మర్చిపోవాల్సి వచ్చింది. ఓ రెండేళ్ల తర్వాత వచ్చి, ఆ వచ్చిన వారితో మక్కెలిరగదీయించుకునే జగన్ ప్రభుత్వం కంటే.. తాము సక్రమంగా విధి నిర్వహణ చేయకపోయినా, వారినికి ఐదురోజులే పనిచేయిస్తూ, తామంటే భయపడుతూ పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం ఉంటేనే నయమన్న మానసిక పరిస్థితికి ఉద్యోగులను తీసుకువచ్చిన చెవిరెడ్డికి తెలుగుదేశీయులు ఎంతైనా రుణపడి ఉండాలి!
*

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144