సబ్ ఫీచర్

మన వర్శిటీల స్థానమేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల ర్యాంకుల్లో భారత్ మరింత దిగజారింది. విశ్వవ్యాప్తంగా వెయ్యి ఉత్తమ విశ్వవిద్యాలయాల వార్షిక ర్యాంకుల జాబితాను టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఎప్పటిలా ఆక్స్‌ఫర్డ్ అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాదికన్నా మెరుగుపడిన కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ రెండోర్యాంకుతో ద్వితీయస్థానం సాధించింది. కాగా ఇండియాలో పేరెన్నికగన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఐఐటీలు గతఏడాది కన్నా వెనుకబడిపోయాయి. గత ఏడాది 201 నుంచి 250 స్థానాలలోపు ఉన్న ఐఐఎస్ ఈ ఏడాది 251-300 స్థానాలలోకి దిగజారిపోయింది. పరిశోధనలు, వాటి వల్ల కలిగిన ఫలితాల స్కోరు ఆధారంగా వర్శిటీల ర్యాంకులు ప్రకటించారు. ఢిల్లి, కాన్పూర్, మద్రాస్ ఐఐటీలు కూడా గత ఏడాదికన్నా కనీసం ఒక్కోస్థానం మేరకు ఈసారి వెనుకబడ్డాయి. ‘ప్రపంచ వర్శిటీల ర్యాంకుల్లో భారత్ వర్శిటీలు వెనుకబడిపోవడం బాధాకరం. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో పోటీ పెరిగిపోయింది. చైనా, హాంకాంగ్, సింగపూర్ వంటి ఇతర ఆసియా దేశాలు ఈ రంగంలో భారత్‌కన్నా స్థిరంగా ఉత్తమ ర్యాంకులను సాధిస్తుండటం విశేషం. అక్కడ ఆయా విద్యాసంస్థలకు నిధులు, పెట్టుబడులు పుష్కలంగా లభిస్తుండటం అందుకు కారణం. మొదటి 200 ఉత్తమ వర్శిటీల గీతకు దూరంగానే ఇండియన్ ఐఐటీలు ఉండిపోయాయి’ అని ది హయ్యర్ ఎడ్యుకేషన్ గ్లోబల్ ర్యాంకింగ్స్ ఎడిటోరియల్ డైరక్టర్ ఫిల్ బటి పేర్కొనడం గమనార్హం. అయితే పరిశోధనల నాణ్యత, ఆదాయం విషయంలో మొత్తంమీద భారత్ గత ఏడాదికన్నా గణనీయమైన ప్రగతి సాధించిందని పేర్కొన్నారు. భారత్‌లో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యకు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని, భవిష్యత్‌లో ఇది సాకారమవుతుందని ఆయన చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో పరిశీలిస్తే భారత్‌లోని విశ్వవిద్యాలయాలు మెరుగైన స్థితిలో లేవని ఆయన పేర్కొన్నారు. విదేశీ విద్యార్థులకు, బోధకులకు అవకాశాలు కల్పించే విషయంలో పరిమితులను భారత్ అమలు చేయడం వల్ల ఈ స్థితి ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. నిపుణులైన విదేశీ విద్యాబోధకులు, విద్యార్థులను చేర్చుకోడానికి భారత్‌లోని 20 విశ్వవిద్యాలయాలు ఆసక్తి చూపించాయని, అయితే ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ 251-300 ర్యాంకుల జాబితాలో స్థానం సంపాదిస్తే బాంబే ఐఐటి 351-400 విభాగంలో స్థానం సాధించింది. కాగా ఐఐడి ఢిల్లీ, ఐఐడి కాన్పూర్, ఐఐటి ఖరగ్‌పూర్, ఐఐటి రూర్కీ 501-600 ర్యాంకుల జాబితాలో చేరాయి. ఇది ఈ జాబితాలో దిగువశ్రేణి విభాగం. దేశాలవారీగా ప్రకటించిన ర్యాంకింగ్‌ల విభాగంలో మనదేశంలో అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ, బనారస్ హిందూ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లి, ఐఐటి గువాహటి మొదటి పది స్థానాల్లో నిలిచాయి. గ్లోబల్ ర్యాంకుల్లో ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ వర్శిటీలు తొలి రెండు స్థానాల్లో నిలవగా గత ఏడాది రెండోస్థానంలో నిలిచిన కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ ఇప్పుడు మూడోస్థానానికి చేరాయి. మొత్తంమీద భారత్‌లోని వర్శిటీలు ప్రపంచస్థాయి వర్శిటీల స్థాయికి ఎదగాలంటే కేంద్రప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని తాజా అధ్యయనం చెబుతోంది.

చిత్రం..ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ

-రవళి