సబ్ ఫీచర్

కుబేరుడైన బేరర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకనే మనవాళ్లు అంటారు ఏ పుట్టలో ఏ పాముందోనని! కేరళలో ఓ ‘స్ట్రీట్’ వుంది. స్ట్రీట్ అంటే వీధి కాదు. అదో పెద్ద విలాసవంతమైన రెస్టారెంటు. పోయినె్నల అక్కడికో టిప్ టాప్ యువకుడు వచ్చాడు. కూర్చోమని కుర్చీ చూపిస్తే ‘నాకో ఉద్యోగం ఇప్పించండి’ అని దీనంగా ప్రాధేయపడ్డాడు. అతని పేరు ధృవ్- పద్దెనిమిది ఉంటుందేమో వయస్సు. ‘అవతలికి నడూ’ అన్నారు. కానీ ఆ హోటలుకి పెట్టుబడిదారుడయిన ఓ పెద్దమనిషి ద్వారా సిఫార్సు అందింది. కుర్రవాడు సర్వీసింగ్ బాగా చేశాడు కానీ, అయిదో రోజునే వచ్చి వారం రోజులు శలవు కావాలన్నాడు. ‘‘ఏం ఆటలుగా వుందా?’’ అన్నారు.
‘‘కాదు సార్! మా నాయనమ్మ చావుబ్రతుకుల్లో వుంది’’ అన్నాడు.
‘‘ఓనం’’ పండుగ వస్తోందయ్యా! ఇక్కడ రద్దీ బ్రహ్మాండంగా వుంటుంది. మనుషులు చాలరు. పైగా టిప్పులు కూడా నీకు బాగా తగులుతాయి అన్నా ధ్రువుడు ‘‘నాయనమ్మ కోసం పోవాల్సిందే’’నంటూ పరుగులు తీశాడు. ఓనం పండుగ వచ్చింది. ధ్రువుడు రాలేదు. కస్టమర్లు కూడా ‘‘కుర్రాడు మంచి సర్వీసు చేస్తాడు ఎక్కడ?’’ అంటూ అడగసాగేరు.
ఇంకెక్కడ? ధ్రువుడు? చెక్కేశాడు. కుర్రాడు కదా అంతే అనుకున్నారు రెస్టారెంటు యాజమాన్యం. ఓనం పండుగ ఐదో రోజు ‘స్ట్రీట్’ ముందుకి అదిరిపోయే లగ్జరీ మోటారుకార్లు వరుసగా మూడు వచ్చి ఆగాయి. స్ట్రీట్‌కి అంత సీనులేదు. అవాక్కైపోయారు అంతా.. అంతలో కార్లలోనుంచి నవీన రాకుమారుల్లాంటి యువకులు దిగారు. మంచి బేరం అని మురిసిపోతూ చూశారు. కానీ, ఆ సంపన్న బృందం మరెవరో కాదు, ధ్రువుడు అతని మిత్ర బృందమున్నూ. నగల పెట్టెలు, అందాల బహుమతుల పెట్టెలు కూడా దిగాయి. ఖరీదైన పెన్నుల దగ్గరనుంచీ వజ్రాల ఉంగరాలు, హారాలు, వాచీలు దాకా చాలా గిఫ్టులు వున్నాయి. ఎవరి హోదాకి స్థాయికి తగినట్లు వారికి ధ్రువుడు అతని ఫ్రెండ్సు హ్యాపీ ఓనం అంటూ బహుమతులు పంచేశారు. తెరుచుకున్న నోళ్ళు మూసుకుని-అరె! ధ్రువా! నువ్వా? సారీ! మీరా! అన్నారందరూ. ఆ జూనియర్ ఎవడో కాదు- ఎస్.ఆర్.కె గ్రూపు- అనగా దేశంలోనే అతి పెద్ద వజ్రాల వ్యాపార కంపెనీ వాళ్ళ బుల్లబ్బాయి.
మన స్ట్రీట్ మీద పడ్డ ‘కుబేర’ తనయుడు! జాలీ అనుభవం కోసం ఉద్యోగం చేశాడు. ఇంకా నయం! కుర్రవాడిని మనం నాలుగు తిట్టి తన్ని గట్రా చెయ్యలేదు. కటకటాలు లెక్కెట్టేవాళ్లం.. అనుకున్నారు. కానీ దీనే్న అంటారు రాజకుమారుడికి ‘ముష్టిరాత’ అని ఓ సామెతలో. లేకపోతే ఎందుకా సరదా?

వీరాజీ