సబ్ ఫీచర్

విద్యాదాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలీసు గుండెల్లో కరకుదనమే కాదు కరుణ కూడా దాగి ఉంటుందని నిరూపిస్తున్నారు హైదరాబాద్ బేగంపేట్ సబ్ ఇన్‌స్పెక్టర్ మధు. ఒకప్పుడు మాస్టారుగా పనిచేసిన ఈ యువ పోలీసు అధికారికి తనలోని విద్యాతృష్ణ తీరలేదనుకుంటా బేగంపేట పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని అక్కడి పేద పిల్లలకు విద్యాదాతగా మారారు. ఆసక్తికరమై విషయమేమిటంటే 2013లో హైదరాబాద్ పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్‌గా జాయిన్ అవ్వకముందు ఆయన ఓ గురువు. ఆరేళ్ల పాటు ఐఐటీ ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. దురదృష్టవశాత్తు మధు అనారోగ్యం పాలు కావటంతో ఉపాధ్యాయ వృత్తిని విడనాడటం జరిగింది. సామాజిక మార్పు విద్య ద్వారానే జరుగుతుందని ప్రగాఢంగా విశ్వసించే మధు ఓ రోజు జీరా ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారు. ఇది తెలుగు మీడియం స్కూల్. ఇక్కడ కొద్దిమంది విద్యార్థులు మాత్రమే ఉతీర్ణులవుతున్నట్లు గ్రహించారు. ఆ పాఠశాలలో కనీస సదుపాయాలు సైతం లేకపోవటం గమనించి ఆ పాఠశాలను దత్తతు తీసుకున్నారు. వారికి సేవ చేయాలనే ఆయన ఆసక్తికి స్థానికులు సైతం స్పందించి చేయూతనిచ్చారు. ఇపుడు ఈ పాఠశాల విద్యార్థులకు స్కూలు బ్యాగ్స్, నోట్‌బుక్స్, స్టేషనరీ, క్యారమ్ బోర్డు, వాలీబాల్ కిట్స్ వంటి అన్నింటినీ సమకూర్చారు. పాఠశాలలో శానిటేషన్ సదుపాయం సరిగా ఉండేలా సిబ్బందిని నియమించటం జరిగింది. బోధనా సిబ్బందిని నియమించటంతో పాటు పాఠశాలకు ప్రహారీ గోడ సైతం ఏర్పాటు చేశారు.
భార్యసైతం...
ఈ పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాల విద్యార్థుల వలే అన్ని పోటీ పరీక్షలకు వెళ్లేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ పోటీ పరీక్షలకు విద్యార్థులను తయారుచేసేందుకు భర్తకు తోడుగా భార్య ముందుకు రావటం విశేషం. ఓ బిడ్డకు తల్లయిన తన భార్య పోటీ పరీక్షలకు సంబందించిన శిక్షణ ఇవ్వటానికి ముందుకు రావటం ఆనందంగా ఉందని ఈ ఎస్సై చెబుతున్నారు. విద్యార్థులకు నైపుణ్య ఆధారిత విద్యను అందిస్తే నేడు పోటీని తట్టుకోగలరని మధు అంటున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ పాఠశాలను అంగ్ల బోధన పాఠశాలగా మార్చేందుకు మధు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇలా ఈ కరకు హృదయంలో పేద విద్యార్థులపై కరుణ చూపటం నిజంగా ఆశ్చర్యకరమే.