సబ్ ఫీచర్

విజయదశమి ఎప్పుడు చేసుకుంటాం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశ్వయుజ మాసంలో, మనస్సుకు అధిపతి అయిన చంద్రుడు వెనె్నలను బాగా పండించే శరదృతువులో శుక్లపాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు అంబికారాధన చేస్తారు. దీని ఆంతర్యమేమిటంటే, పశు రాక్షసత్వంతో కూడిన మానవుడు, సక్రమంగా భావనాయుక్తంగా నవాహ్నిక (తొమ్మిది రోజులు) దీక్షతో వ్రతాన్ని ఆచరించి, మానవతా విలువలను కాలప్రాముఖ్యాన్ని తెలిసికొంటాడు. అనగా మనలో చేరిన తొమ్మిది విధములయిన అజ్ఞాన లక్షణాలను సాధన ద్వారా దూరం చేసికోవటం, తనలో వున్న మహిషత్వాన్ని పారద్రోలి మనీషత్వాన్ని పొందటం.
పదవ రోజు విజయదశమి. శరన్నవరాత్రి ఉత్సవానికి మకుటాయమానమైన పండుగ- విజయదశమి. నవరాత్రి పూజకు జయకేతనం- విజయదశమి. లోకాలనేలే ప్రభ్వి శ్రీరాజరాజేశ్వరీ మాతను విజయదశమి రోజున పూజిస్తాం.