సబ్ ఫీచర్

ఆర్మీ అధికారి ఫిట్‌నెస్ మంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగు పదుల వయసు వచ్చిందంటే కీళ్ల నొప్పులు, ఆయాసం. యాభై ఏళ్ల కె. శంకర్ యువకుడిలా పరుగులు తీస్తారు. సైక్లింగ్ చేస్తారు. మారథాన్‌లలో పాల్గొంటారు. కోడి కూతతో నిద్రలేచే శంకర్‌కు ఇలాంటి బాధలన్నీ దూరం. ఆర్మీలో పనిచేయటం వల్ల తన జీవనశైలిని ఒక ప్రణాళికాబద్దంగా సాగిస్తూ ఆనందంగా.. ఆరోగ్యంగా జీవితాన్ని మలుచుకున్న శంకర్ దశాబ్దకాలం నుంచి మారథాన్‌లలో పాల్గొనటం తన జీవితంలో ఒక భాగంగా చేసుకున్నారు. 12 గంటల్లో 31 కిలోమీటర్లు పరుగు.. 135 కిలోమీటర్లు సైక్లింగ్.. 2.9 కిలోమీటర్ల స్విమ్మింగ్ చేయటం సామాన్య విషయం కాదు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన 3/4 ఐరన్ ట్రియాతలాన్‌లో పాల్గొని తన సత్తా చాటారు. యాభై ఏళ్ల వయసులోనూ చదువుపై మమకారం వీడకుండా డిగ్రీలు సంపాదిస్తూ.. నవ యువకుడిగా జీవితాన్ని సాగిస్తున్న ఈ ఆర్మీ అధికారి తన ఫిట్‌నెస్ సీక్రెట్స్‌ను ఇలా పంచుకున్నారు.

చిన్నప్పటి నుంచే కసరత్తు

ఫిట్‌గా ఉండాలని చిన్నప్పటి నుంచి మక్కువ ఉండేది. ఇందుకోసం కసరత్తులు చేయటం అలవాటుగా చేసుకున్నాను. ఎవరైనా ఇంటి నుంచి బయటకు వెళితే బ్రష్ చేయకుండా వెళ్లరు. అలాగే ఏరోజైనా ఎక్స్‌ర్‌సైజ్ చేయకుండా కాలు బయట పెట్టానంటే ఇలాంటి ఫీలింగే కలుగుతుంది. అంతేకాదు ఆ రోజంతా ఎలాంటి పని చేయలేను. ఒంట్లోని శక్తి అంతా కోల్పోయినట్లు భావిస్తాను. ఇలా వ్యాయామం అనేది చిన్నప్పటి నుంచి జీవితంలో ఒక భాగమైంది. ప్రతిరోజూ ఉదయం 4 గంటలకు నిద్ర లేస్తాను. 5.45 వరకు చదువుకుంటాను. తరువాత 10 నుంచి 12 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తాను. 50 నుంచి 60 కి.మీ సైక్లింగ్ చేస్తాను. శనివారంనాడు అసలు స్విమ్మింగ్ చేయను. ట్రియాతలాన్ లక్ష్యాన్ని 10.5 గంటలలో ముగించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాను. ఇన్ని పోటీల్లో పాల్గొనటం వల్ల అలసిపోకుండా యాక్టివ్‌గా ఉండటానికి కారణం ఇక్కడ హైదరాబాద్ నగర వాతావరణం బాగుండటమే అని అంటారు. ఆర్మీలో చేరి దేశానికి సేవలందించిన శంకర్ మేజర్ స్థాయికి వెళ్లారు. సైన్యంలో చేరటం వల్ల అక్కడ నేర్చుకున్న క్రమశిక్షణ అయనకు చక్కటి జీవిత గమ్యానికి బాటలు వేసింది. ఇంజినీర్‌ంగ్‌లో గ్రాడ్యూయేషన్ చేసిన శంకర్ ఎంబీఏ చేశారు. యాభే ఏళ్ల వయసులోనూ ఆయనలో చదువుపై మమకారం తగ్గలేదు. సోలార్ ఎనర్జీకి సంబంధించి సర్ట్ఫికెట్ కోర్సు, టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఇన్ అగ్రికల్చర్‌లో పీజీ డిప్లొమా కోర్సు చేస్తున్నారు. ఉదయం నిద్రలేచిన వెంటనే ఇంచుమించు రెండు గంటలు చదువుకు కేటాయిస్తారు.

బావుల్లో ఈత కొట్టారు..

కర్నాటకలోని చిన్న పట్టణం నుంచి వచ్చిన శంకర్ చిన్నప్పుడు బావుల్లో ఈత నేర్చుకున్నారు. స్కూలు, కాలేజీ రోజుల్లోనే అథ్లెటిక్‌గా రాణించారు. గ్రాడ్యూయేషన్ పట్టా అందుకున్న వెంటనే ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ పెట్రోలియం కంపెనీలకు ఎంపికయ్యారు. తండ్రి కోరిక మేరకు పెట్రోలియం కంపెనీలో స్థిరపడ్డారు. ఆర్మీ యూనిఫారమ్ ధరించాలనే ఆయన కల నలభై ఏళ్ల వయసులో తీరింది. అదీ అంత ఈజీగా జరగలేదు. పది స్థాయిల్లో జరిగే ఈ ఎంపిక పోటీల్లో తొమ్మిదింటిలో విజయం సాధించగలిగారు. పదో స్థాయి పోటీల్లో అధిక బరువు ఉండటం వల్ల తిరస్కరించటం జరిగింది. నెల రోజుల్లో పది కిలోల బరువు తగ్గి మళ్లీ ఆర్మీ పోటీలకు సిద్ధమవ్వటం జరిగింది. ఆ ముప్పయి రోజులూ నా శరీరంలో పెద్ద పోరాటమే జరిగిందని చెబుతారు. భార్య సాయంతో కఠినమైన ఆహార నియమాలు పాటించటం వల్ల నెలరోజుల్లో పది కిలోల బరువు తగ్గి మళ్లీ మెడికల్ టెస్ట్‌కు హాజరై ఎంపికయ్యారు. కుఃచ్‌లో సంభవించిన భూకంపం, ఒడిస్సాలో తుఫాను తదితర విపత్తుల సమయంలో ఆర్మీ తరపున సేవలు అందించటం మరపురాని సంఘటనలు. ఇప్పటికీ సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయంటే సైనికాధికారులు పిలిచి శిక్షణ ఇవ్వమని అడుగుతుంటారు. ఇంత బిజీ జీవితంలో రిలాక్స్ అవ్వటానికి గోల్ఫ్ ఆడుతుంటారు.

ఆల్ రౌండర్!

మూడు డిగ్రీలు సంపదించిన శంకర్ ప్రస్తుతం నాలుగో డిగ్రీ సంపాదించేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారు. రాత్రి వేళల్లో డిన్నర్ తీసుకోవటం అనేది దశాబ్దకాలం నుంచి లేదు. తన శరీరానికి డిన్నర్ సరిపోవటం లేదంటారు. ఓ ప్రాంతానికి చెందిన ఆర్మీ విభాగంలో ఆయన 28వ అధికారిగా ఉన్నారు. ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే ఇప్పటికీ ఆయన సైన్యం నుంచి పిలుపునందుకుని తన సేవలు అందిస్తున్నారు. చ్ భూకంపం, ఒడిస్సా తుఫాను సమయాల్లో ఆయన సేవలు అందించారు.