సబ్ ఫీచర్

కొసరి కొసరి వడ్డింపు కరువాయే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలాగు భోంచేతుము
ఈ విందు మే మేలాగు భోంచేతుము
కూర్చుండ చోటే లేదు
జానాబెత్తెడు విస్తళ్లలోన
హస్తంబు ఆడించ అసలే వీలుకాదు
వంటకాలలోన రుచీపచీ లేనేలేదు
వడ్డించే వదినగారి వడ్డాణము జారిపోయే
ఏలాగు భోంచేతుము...
ఒకప్పుడు మన వివాహ వేడుకల్లో భాగంగా భోజనాల సమయంలో సరదాగా పాడుకునే ఈ పాట నేటి తరానికి తెలియకపోయినా నిన్నటి తరంలో కొందరైనా వినే ఉంటారు. ఈ పాటని ఇప్పటి ఆధునిక విందు భోజనాలకు అన్వయించి పాడుకుంటే...
ఏలాగు భోంచేతుము.. మే మేలాగు భోంచేతుము.. వడ్డించే అద్దె మనుషుల్లోన ఆత్మీయత కానరాదే.. తినేవారికేమో నానా తిప్పలాయే.. ఏలాగు భోంచేతుము?- అని పదాలు అల్లుకోవాల్సిన పరిస్థితి. నేటి ‘బఫే’ సిస్టం వల్ల మనకు దాపురించిన వైపరీత్యమిది.
పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లుగా మన భారతీయులకు విదేశీ పద్ధతుల మీద మోజెక్కువ. ఆచరణలో అవి ఎంత చెత్తవి అయినా మనవాళ్లకి అవి ఆధునికమైనవిగా, గొప్పవిగానూ కనబడతాయి. ఒకప్పుడు గొప్పవారింట వేడుకల్లో మాత్రమే కనిపించే బఫే సిస్టం ఇప్పుడు గల్లీలో జరిగే వేడుకల్లోనూ భాగమైపోయింది. సంప్రదాయ విందు పద్ధతి ముందు విదేశీ అలవాటు అయిన ‘బఫే’ పద్ధతి ఏవిధంగా అనుసరణీయమో మనమొక్కసారి ఆలోచించాలి. ఈసందర్భంగా ఒకసారి మనం ఇప్పుడు ఆచరిస్తున్న రెండు రకాల పద్ధతులను పోల్చిచూస్తే ఈ విషయం మనకు స్పష్టమవుతుంది.
ఆప్యాయతకు అద్దంపట్టేలా..
ఒకప్పుడు మన ఇళ్లల్లో జరిగే శుభాకార్యాల్లో విందు ఏర్పాట్లు చూస్తే ఎంతో పద్ధతిగా ఉంటాయి. వరుసగా విస్తళ్లు వేసి.. వసతిగా కూర్చునే ఏర్పాటు చేసి వంటకాలన్నీ అందరి విస్తళ్లలో సంపూర్ణంగా వడ్డిస్తారు. అంతా ఆశీనులయ్యాక మనిషి మనిషి దగ్గరకు వచ్చి ఏ ఐటమ్ కావాలో అడుగుతూ కొసరి కొసరి వడ్డిస్తారు. ఇలా చేయడం వల్ల అందరికీ అన్ని ఐటమ్స్ అందడమేగాక ప్రతి ఒక్కరినీ పలకరించి ఆప్యాయంగా వడ్డించిన అనుభూతి కలుగుతుంది. ఆహ్వానితులకు ఆత్మీయత గోచరిస్తోంది.
ప్లేట్లతో ఫీట్లు..
ఇక ‘బఫే’ సిస్టం చూస్తే ‘ఎహే’ అనిపించేలా అంతా అస్తవ్యస్తమే! తినే ప్లేటు దగ్గరి నుంచి మనమే వెతుక్కోవాలి. ప్లేటును చేజిక్కించుకున్నాక వరద బాధితుల్లా లైన్లో నిల్చుని ఒక్కో ఐటమ్‌ని అడిగి వేయించుకుంటూ వెళ్లాలి. చేతిలో విస్తరి మొయ్యలేక, నిల్చునే సత్తువ లేక, మంచినీళ్ల కోసం వెతుకులాట, మారు వడ్డించుకురావాలంటే జనం మధ్య తోపులాట.. ఇలా ఎనె్నన్నో తంటాలు. వడ్డించిన విస్తరి చేతికి వచ్చాక అక్కడక్కడా వెతికి ఓ కుర్చీ చూసుకుని కూర్చున్నామా ఆ రిలాక్సేషన్ కాసేపే. మారు వడ్డించుకోవడానికి ఆ కుర్చీలోంచి కదిలామా.. మళ్లీ తిరిగి వచ్చేటప్పటికి ఆ సీటు మనకు వుంటుందన్న గ్యారంటీ లేదు. అంటే సీటు కోసం మళ్లీ పాట్లు తప్పవన్నమాట. వృద్ధుల విషయంలోనైతే ఆ తిప్పలు ఇంతింతకాదు. వాళ్లు ఎక్కువసేపు నిలబడలేరు. అలాంటివారికి ప్లేట్లో అన్నీ వడ్డించి తీసుకొచ్చి ఇచ్చినా ఓ చేతిలో ప్లేటు పట్టుకుని తినడం మరో అవస్థ. మధ్యలో మంచినీళ్లు తాగాలంటే వాటికోసం వెతుక్కుంటూ వెళ్లి గ్లాసు తెచ్చుకుంటే సగం తాగిన ఆ గ్లాసును ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితి. నచ్చిన ఐటమ్‌ని మారు వడ్డించుకోవాలంటే మళ్లీ అక్కడిదాకా వెళ్లి తెచ్చుకోవాల్సిందే. మొదటిసారి క్యూగా వెళ్లినవాళ్లు రెండోసారి నుంచి ఇష్టానుసారం వెళ్లడంతో వడ్డించే చోట గుంపులుగా చేరతారు. దాంతో వాళ్లను తప్పించుకుంటూ, తోసుకుంటూనో వెళ్లాల్సిందే. ఇదోరకమైన తోపులాట అన్నమాట. అలా పదేపదే ఆ ఫీట్లు చేయలేక చాలామంది ప్లేట్లో వున్నవాటితోనే సరిపెట్టుకుని ఏదో భోజనం అయిందనిపించేస్తుంటారు. కళ్లు తిరిగేటన్ని వెరైటీలు మనముందు కనబడుతున్నా కడుపునిండా తినలేని దౌర్భాగ్య స్థితి. వచ్చినవాళ్లలో ఎవరు భోంచేశారో, ఎవరు చేయలేదో తెలియని అయోమయ పరిస్థితి. ఇన్ని అవస్థలతో కూడిన ఈ ‘ముష్ఠి’ పద్ధతి మనకు అవసరమా?
అయితే ఈ పద్ధతిలో వున్న ఒకేఒక్క సానుకూలాంశం గురించి అందరూ చెప్పేదేమిటంటే.. ఆధునిక జీవనశైలిలో కాలహరణం లేకుండా త్వరగా భోజనం ముగించుకుని బయడపడవచ్చని! అదే పంక్తి భోజనాలైతే అందరితోబాటు ఒకేసారి కూర్చుని, ఒకేసారి లేవాలంటే చాలా టైమ్ పడుతుందని, దానివల్ల పనులపై తొందరగా వెళ్లాలనుకునేవారికి కష్టం అవుతుందని! ‘బఫే’ సిస్టంలో అయితే ఎవరికి కావాల్సినవి వారు వడ్డించుకుని చకచకా తిని వెళ్లిపోవచ్చని. ఈ రకంగా చూస్తే ఇది ఒప్పుకోవాల్సిన అంశమే. ముఖ్యంగా నగరాల్లో వుండేవారికి ఇది మరీ అవసరం. ఈ విషయాల్ని అర్థం చేసుకున్న కొందరు తమ ఇళ్లల్లో జరిగే వేడుకల్లో ఇటు సంప్రదాయ పంక్తి భోజనాలని, అటు ఆధునిక ‘బఫే’ సిస్టంనీ అందుబాటులో ఉంచుతున్నారు. ఎందుకంటే వచ్చిన అతిథుల్లో ఎవరికి వీలైన పద్ధతిలో వాళ్లు భోజనం ముగించుకుని వెళ్లడానికి వీలవుతుంది. కేవలం ఒక్క బఫే సిస్టంని మాత్రమే పెడితే అది అతిథులను అవస్థపెట్టినట్టే అని గమనిస్తే చాలు!

- డి స్వాతి