సబ్ ఫీచర్

క్రిస్మస్ కాంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రిస్మస్ కాంతులు ప్రతి ఇంటా వెలుగులు నింపుతున్నాయి. చలికాలంలో వచ్చే ఈ పండుగకు ఇంటిని అందంగా ముస్తాబు చేసేందుకు వెరైటీ కొవ్వొత్తుల వెలుగులతో నింపేసేందుకు ప్రతి గృహిణి తహతహలాడుతోంది. మార్కెట్లోకి విభిన్న రకాల క్రిస్మస్ క్యాండిల్స్ వచ్చేశాయి. చిరు వెలుగులనిచ్చే క్యాండిల్స్‌ను ఏర్పాటుచేసుకుంటే ఇల్లు శోభాయమానంగా వెలుగొందుతుంది. క్రిస్మస్‌కు ఇంటిని ఆకర్షణీయంగా, అందంగా అలంకరించాలంటే కొంత శ్రద్ధ పెట్టాల్సిందే. గ్రామీణ ప్రాంతాలలో రావిచెట్టును క్రిస్మస్ చెట్టుగా అందంగా అలకరించేశారు. కాని పట్టణ ప్రాంతాల్లో కృత్రిమ చెట్లనే విద్యుత్‌దీపాలతో ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దుతారు. గోడలకు పెయిటింగ్ వేయంచే బదులు సింపుల్‌గా మార్కెట్లో అందమైన ఆకృతిలో లభించే స్టిక్కర్లతో ముస్తాబు చేసుకోవచ్చు. అలాగే వేలాడే అలంకరణ వస్తువులను కూడా ఏర్పాటు చేసుకుంటే చూడముచ్చటగా ఉంటుంది. వాల్ పేపర్ల స్టెన్సిల్స్‌తో వివిధ డిజైన్లలో అతికించుకోవచ్చు. ఈ స్టెన్సిల్స్ కోసం ఓహెచ్‌పీ లేదా ప్లాస్టిక్ షీట్లను వాడితే నాణ్యంగా తక్కువ ఖర్చుతో గోడలను అందంగా ముస్తాబు చేసుకోవచ్చు. ఇంటి ముందు వేలాడదీసే స్టార్ పండుగకు ఇంటికి వచ్చే అతిథులకు స్వాగతం పలుకుతున్నట్లు వుంటుంది. గది మూలల్లో నిరుపయోగంగా ఉండే స్థలాన్ని సద్వినియోగం చేసుకుంటూ అందమైన లైటింగ్‌ను ఏర్పాటుచేసుకుంటే బాగుంటుంది. బంగారం వర్ణంతో పాటు ఆరెంజ్, పసుపు రంగుల్లో మెరిసే కొవ్వొతి దీపాల సెట్ కూడా ఇంటిని ప్రకాశవంతంగా చేస్తోంది. పూల ఆకారంలో తయారుచేసిన ఈ అలంకరణ కొవ్వొత్తుల సెట్ ధగధగా మెరుస్తుంది. మరింకెందుకు ఆలస్యం ఇంటిని క్రిస్మస్ కాంతులతో నింపెయ్యండి.