సబ్ ఫీచర్

లివింగ్ రూం తీర్చిదిద్దుకోండిలా!...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లు అందంగా కనిపించాలని అనుకుంటే సరిపోదు. డ్రాయింగ్ రూం, లివింగ్ రూం, డ్రెస్సింగ్ రూం, డైనింగ్ రూం, హాల్, కిచెన్, కిడ్స్ రూం... ఇలా గదులు వేరైనప్పటికీ, వాటి అలంకరణలో తేడా ఉన్పప్పటికీ, వాటిమధ్య సారూప్యం ఉండేలా చూసుకోవాలి. ఇంటికోసం చేసే ప్రతి పనీ ఇంటి అందాన్ని మరింత పెంచేదిగా ఉండాలి. పిల్లల రూంను ఎలా అలంకరిస్తే వారు సంతోషంగా వుంటారో ఆలోచించి ఆ విధంగా చేయాలి. డ్రాయింగ్ రూమ్‌లో కళాకాంతులు తెచ్చే ఇత్తడి ఫర్నీచర్, ఉడ్ ఫర్నీచర్‌ను అమర్చాలి. గదిలో అమర్చిన లైటింగ్ ఆ గది అందాన్ని మరింత ఇనుమడింపజేస్తూంది. మీ గది రంగును రిఫ్లెక్ట్ చేసే విధంగా బల్బులను అమర్చితే మంచిది. ఇంటి లోపలి అలంకరణ అనేది చాలా ముఖ్యం. ఆ అలంకరణే ఇంటికి వనె్న తెస్తుంది. డ్రాయింగ్‌రూం, లివింగ్ రూం, డ్రెస్సింగ్ రూం, డైనింగ్ హాల్, కిచెన్, పిల్లల గది అన్నింటినీ కళాత్మకంగా సర్దినపుడే వాటి అందం రెట్టింపు అవుతుంది. ఇంట్లో గదుల గురించే కాకుండా పోర్టికో, ఇంటిముందు వుండే ప్రదేశంలో, ఇంటి వెనుక పెంచే మొక్కలు, ఊయల గురించి కూడా కొంచెం శ్రద్ధ వహిస్తే మంచిది.
ఇంటి అలంకరణలో చిన్న ఇల్లైనా... పెద్ద ఇల్లైనా అలంకరించునే విధానంలోనే ఆ ఇంటి సౌందర్యం దాగుంటుంది. ఒక ప్రక్క ఫర్నీచర్, మరోప్రక్క ఇంటికి వేసే రంగులు, ఇంట్లో కనిపించే అందమైన వస్తువులు- ఇలా అన్నీ ఉన్నా ఆ ఇల్లు అందంగా కనిపించదు. సర్దుబాటు అనేది హాల్లో ఏముండాలి, కిచెన్‌లోఏమేమి పెట్టుకోవాలి, అలాగే బెడ్‌రూం, డ్రాయింగ్ రూం. వరండా.. ఇలా అన్ని రూముల్లో సర్దుబాటు చేసుకొంటే చిన్న ఇల్లైనా చాలా అందంగా కనిపిస్తుంది. చిన్న ఇంట్లో ఎక్కువ సామగ్రి ఉన్నపుడు కొన్ని చిన్న చిన్న చిట్కాలు ఉపయోగిస్తే చిన్నఇల్లైనా పెద్దదిలా కనిపించాల్సిందే. హాలులో ముఖ్యంగా ఫర్నీచర్‌ను గోడలుకు ఆనించి పెట్టడం మంచిది. ఇలా చేయడం ద్వారా అటు ఇటు తిరిగేందుకు చోటు విశాలంగా ఉంటుంది. సోఫాలు కొనేముందు గది పొడవు, వెడల్పు దృష్టిలో పెట్టుకుని కొనడం మంచిది. సోఫా, దివాన్ వంటివి ఒక కోణంలో పెట్టడం ద్వారా ఆ గది పొడుగ్గా ఉన్న భావన కలుగుతుంది. టీవీ స్టాండ్ తీసుకునేటపుడు ఎక్కువ షెల్ఫ్‌లు ఉన్న దానిని తీసుకుంటే డివిడిలు, పుస్తకాలు వాటిలో దాచుకోవచ్చు. అలాగే సోఫా కమ్ బెడ్ వంటి వాటిని తీసుకోవడంవల్ల అందులో బట్టలు, పుస్తకాలు, సామాన్లు వంటివాటిని పెట్టుకొనుటకు అనుకూలంగా వుంటుంది. హాలులో సిటింగ్ ఏర్పాట్లు మ్యూజిక్ సిస్టం, టివి, వాల్ హ్యాంగింగ్స్, లైటింగ్ సిస్టం, సోఫాల దగ్గర నేలమీద సుతిమెత్తని తివాచీలు ఏర్పాటుచేసి అందంగా అమర్చండి.

-తరిగొప్పుల విఎల్లెన్‌మూర్తి