సబ్ ఫీచర్

విరిసిన ఎర్ర కలువ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగాల్‌లో మీరెప్పుడైనా వివాహ వేడుకలకు వెళ్లారా? అక్కడ రుచికరమైన వంటల ఘుమ ఘుమలతో పాటు పెళ్లి కుమార్తె ఎర్ర చీర కట్టుకుని ఉండటం గమనిస్తారు. శుక్రవారంనాడు ఘనంగా నిర్వహించిన ఇండియన్ క్రికెటర్ కోహ్లీ- అనుష్క రిసెప్షన్‌లో కూడా అనుష్క ఎర్ర బెనారస్ చీరలో అరవిరిసిన ఎర్ర కలువ వలే గోచరించింది. ప్రముఖ డిజైనర్ సవ్వసాచీ ముఖర్జీ డిజైన్ చేసిన ఈ ఎర్ర చీరలో అనుష్క నుదుట సిందూరంతో, ముఖాన బిందితో అచ్చమైన భారతీయ స్ర్తికి ప్రతిరూపంగా నిలిచింది. జీవితమంతా ఆనందంగా గడిచిపోవాలంటే ఎర్ర చీర ధరించాలనే ఆచారాన్ని అనుష్క కూడా ఆచరణలో పెట్టారు. మెడలో వజ్రాలు పొదిగిన హారం ఆమె అందాన్ని రెట్టింపు చేసింది. రాబోయే రోజుల్లో అనుష్క ధరించిన ఈ చీరలు మార్కెట్లో విరివిగా సందడి చేస్తాయని భావిస్తున్నారు.
బెంగాల్‌లో అనాదిగా వస్తున్న సంప్రదాయం..
పశ్చిమ బెంగాల్ వివాహ వేడుకల్లో పెళ్లి కుమార్తెకు ఎరుపు బెనారస్ చీరనే కడతారు. అది వారి సంప్రదాయం. ఎర్ర చీర కట్టుకుంటే వధువు జీవితం స్వర్గతుల్యంగా ఉంటుందని అక్కడివారి నమ్మకం. ఈ నమ్మకంతోనే పేద, ధనిక తారతమ్యం లేకుండా రెండు వేల నుంచి లక్ష రూపాయలు ఖరీదు చేసే చీరల వరకు వారివారి స్తోమతను బట్టి పెళ్లిలో ధరిస్తారు. సాధారణంగా పట్టు బెనారస్ చీర తయారుకావటానికి 15 నుంచి నెల రోజులు పడుతుంది.