సబ్ ఫీచర్

చారలు.. చమక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త ఏడాది సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్స్‌ను మోసుకొచ్చింది. ముఖ్యంగా చలికాలంలో చారల ప్రింట్స్ చమక్క్‌మంటూ మెరుపులు కురిపిస్తున్నాయి. చారల అందాలు ప్రముఖం కానున్నాయని ఫ్యాషన్ డిజైనర్లు సైతం అంగీకరిస్తున్నారు. చారల డిజైన్ టాప్స్, స్కర్ట్‌లపైనా అందంగా కనిపిస్తాయి. ప్రయాణాలలోనూ, పార్టీలలోనూ ఎంతో సౌకర్యవంతంగా కనిపిస్తాయి. బాలీవుడ్ సినీతారల వార్డ్‌రోబ్‌లో నాటికల్ చారల డిజైన్ల దుస్తులతో నిండిపోయి ఉంటాయి. దీపికాపడుకునే, కంగనరానౌత్, ప్రియాంక చోప్రా, కరీష్మాకపూర్ తదితరులు టాప్స్‌ను చారల డిజైన్లలోనే ఇష్టపడుతున్నారు. సినీతారలు అనుసరిస్తున్నారు కదా అని మనం కూడా అనుసరిస్తే తప్పులేదుకానీ మన బాడీ లాంగ్వేజీకి తగ్గట్లు ఎంపిక చేసుకోవటం ఉత్తమం అని అంటున్నారు బెంగళూరుకు చెందిన బ్లాగర్ అంచల్. ఈమె తన బ్లాగులో నాటికల్ ప్రింట్స్ దుస్తులు ధరించిన చిత్రాలనే ఎక్కువగా పోస్ట్ చేస్తుంటారు. నలుగురిలో ప్రత్యేక గుర్తింపును నాటికల్ ప్రింట్ దుస్తులు కలిగిస్తాయంటారు ఆమె. అమ్మాయిలు మెడపైన చారల ప్రింట్ ఉన్న కండువాను కప్పుకున్నా వైవిధ్యంగా కనిపిస్తారని రేష్మా అనే ఫ్యాషన్ డిజైనర్ చెబుతున్నారు. తెల్లటి దుస్తులపై నలుపు, ఎరుపు, ఉదా రంగుల్లో ఉండే చారలు వింత అందాన్నిస్తాయి. జీన్స్ మీద చారల టీ షర్ట్ వేసుకుంటే ప్రత్యేకంగా కనిపిస్తారు. పాత మోడల్ అనుకోకుండా ఉంటే ఆడంబరంగానూ కనిపిస్తారు. ఎత్తు, బరువు ఎక్కువగా ఉండేవారు నిలువు చారలు ఎంచుకుంటే మంచిదంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. బ్రైట్ కలర్స్, వినూత్నమైన డిజైన్లు, అతి సున్నితమైన వర్క్‌తో ఉమెన్స్ వేర్ మార్కెట్లోకి వచ్చాయి. పసుపు, కూరగాయల ఆకుపచ్చ, ఎరుపు వంటి రంగులను ఎంపిక చేసుకుంటే మంచిది. ఈ తరం అమ్మాయిలు ఇంకాస్త ముందడుగు వేసి ఆధునిక శైలికి అనుగుణంగా చారలతో అనేక ప్రయోగాలూ చేస్తున్నారు. కాస్త ఆధునికంగా కనిపించాలంటే పొడవాటి చారలు మరింత అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. వీటిని ఇష్టపడేటపుడు పెద్దగా నగలతో అవసరం ఉండదు. సింపుల్ వియర్‌రింగ్స్‌తో సూపర్‌లుక్స్ సొంతం చేసుకోవచ్చు. అన్ని సందర్భాలకు టీ షర్ట్స్ సెట్ కావు. లోగోలు లేకుండా ఉన్నవి కొనుక్కోవడం మంచిది. వీటికి సెట్ అయ్యే షూస్ లేకపోతే మొత్తం లుక్ దెబ్బతింటుంది. కార్పోరేట్ కల్చర్‌కు సరిపడేలా ఈ డిజైన్లు ఉంటాయి. పండుగ సందర్భంగా ఇచ్చే విందుల్లో ఈ డ్రెస్స్ వేసుకుంటే ఆ వేడుకలో మెరిసిపోవటం ఖాయం. ఎప్పుడూ ఒకేలాంటి టీ షర్ట్స్ వేసుకోవాలన్నా బోర్ కొడుతుంది. కాబట్టి కాస్త వైవిధ్యంగా కనిపించే చారల పైటాప్స్ వేసుకోండి.