సబ్ ఫీచర్

సమయాభావంలో సౌందర్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవును పొద్దున్న లేస్తే పిల్లలు స్కూళ్లకు, టీనేజ్ అమ్మాయిలు కాలేజ్‌లకు, స్పెషల్ క్లాసులకు, ఆడవాళ్లు ఉద్యోగాలకు, ఇంటి పనులకే సమయం కేటాయించలేని నేటి పరిస్థితుల్లో చర్మ సౌందర్యం కోసం పైగా అది నార్మల్ స్కిన్నా, డ్రై స్కిన్నా, కాంబినేషన్ స్కిన్నా అని తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం కోసం సమయం కేటాయించటం ఎలా?
పోనీ ఇన్ని జాగ్రత్తలు తీసుకోకపోతేనేం? అనుకుంటే నేటి కాలుష్య వాతావరణంలో వున్న వయసు కంటే ఐదు పైదేళ్ల పైబడిన వాళ్లలా కనిపించి మనకన్నా పెద్దవాళ్లు కూడా మనల్ని ఆంటీనో అక్కా అనో అంటే మాత్రం బాధగా ఉంటుంది. పైగా ఎంత వయుసొచ్చినా సినిమా హీరోయిన్లలా అందంగా కనిపించాలన్న ఆశ అందరి ఆడవాళ్లల్లో అంతర్లీనంగా ఉన్నా సమయం, పార్లర్లకెళ్లే స్థోమత కొన్ని ఇబ్బందులు అందరికీ ఉంటాయి. అందుకే మన సమయం వృధా కాకుండా మామూలు పనుల్లోనే సౌందర్యానికి కూడా ప్లాన్ చేసుకుంటే సమస్యే ఉండదు కదా! అందుకే మీ కోసం.
అరకిలో ముడిపెసలు, అరకిలో పచ్చి సెనగపప్పు, ఒక కప్పు బియ్యం శుభ్రం చేసుకుని మరపట్టించి డబ్బాలో నిలువ చేసుకుంటే చాలు.
* స్నానానికి ఎంత హడావిడిగా వెళుతున్నా సోప్‌కి బదులు ఈ పొడిని ఓ గినె్నలో నాలుగైదు చెంచాలు వేసుకెళ్లి స్నానం చేయబోయే వేడినీళ్లతోనే క్రీంలా కలిపేసుకుని సోప్‌లాగే వొంటికి రాసుకుని స్నానం ముగిస్తే సరి.
మరో రెండు నిమిషాల సమయం ఉండే అదే పొడిలో చిటికెడు చాయ పసుపు, తేనె వేసుకుని పొడి చర్మమైతే పాలు, జిడ్డు చర్మమైతే రెండు చెంచాల పెరుగు వేసుకుని మీకు పడితే కొన్ని చుక్కల నిమ్మరసం కలుపుకుని ప్రతిరోజూ కానీ వారంలో కనీసం రెండు రోజులు కానీ స్నానానికి వాడుకుంటే ఫేషియల్, మెనిక్యూర్, పెడిక్యూర్ అంటూ వృధాగా సమయం, డబ్బు ఖర్చు చేసే పని ఉండదు.
అలాగే అందుబాటులో ఉన్నదాన్ని బట్టి ఒకసారి రోజ్ వాటర్ చుక్కలు, ఒకసారి కలబంద గుజ్జు, విటమిన్ ఇ ఆయిల్ కూడా కలుపుకోవచ్చు.
రాత్రిళ్లు పడుకునే సమయంలో కాస్త కాటన్ తీసుకుని వంటగదిలో పాలు కాచేముందు చల్లని పాలలో ముంచి అది మరిగేలోపు ముఖానికి మెడకు, కళ్ళచుట్టు రాసుకుని బెడ్డెక్కే ముందు చల్లటి నీళ్లతో ముఖం సోప్ లేకుండా కడుక్కుని పడుకుంటే ఆటోమేటిక్‌గా మాయిస్చరైజ్ అవుతుంది. మర్నాడు మామూలుగా స్నానం చేస్తే చాలు. కెమికల్స్ వున్న క్రిములు కొనే అవసరం రాదు. ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
లెమన్ రైస్, లెమన్ జ్యూస్ వంటివి చేసినపుడు తొక్కలు డస్ట్‌బిన్‌లో పడేసే ముందు మోచేతులు, చేతివ్రేళ్లు, గోళ్లు, పాదాలు కాలిగోళ్లపై రుద్దుకుని పడేస్తే కాలుష్యం వల్ల పేరుకున్న నలుపు విరిగిపోవటమే కాక, గోళ్లకు, చర్మానికి సి విటమిన్ అంది ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంటుంది.
చివరగా ఒక చిట్కా ఏమిటంటే.. ఇంట్లో మల్లె, గులాబీల్లాంటి పువ్వులుంటే స్నానాకెళ్లటానికి పది నిమిషాలు ముందే కొన్ని రేకులు వేడినీళ్ల బకెట్‌లో వేసి పేపర్‌తో మూతపెట్టి స్నానం మొదలుపెట్టే ముందు అవి తీసేసి స్నానం చేస్తే నేచురల్ బాడీ స్ప్రేగా ఉపకరిస్తుంది.

-డేగల అనితాసూరి, హైదరాబాద్