సబ్ ఫీచర్

కొత్త ఏడాదిలో ప్రభుత్వం ఏం చేస్తుంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కులభూషణ్ యాదవ్ అనే భారతీయుణ్ణి పాకిస్తానీయులు అపహరించారు. అతనిమీద గూఢచర్య నేరం మోపారు. భారత్ ఈ అంశంపై అంతర్జాతీయ న్యాయస్థానం (ది హేగ్) వారిని ఆశ్రయించింది. ఈలోగా పాక్ సైనిక న్యాయస్థానం కులభూషణ్ యాదవ్‌కు మరణశిక్ష విధించింది. ఐతే ఈ శిక్ష అమలు కాకూడదు అని భారత్‌కు అనుకూలంగా ది హేగ్‌లోని న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఇదంతా ఇటీవలి కథయే.
భారత్‌పై ఎందుకింత కక్ష?
ఇది తెలుసుకోవాలంటే కొన్ని సైద్ధాంతిక మూలాలను అనే్వషించవలసి ఉంది. బ్రిటీషువారు 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చినప్పుడు ద్విజాతి సిద్ధాంతం తెరపైకి వచ్చింది. హిందువులు ముస్లిములు వేరే వేరే జాతులు- వీరు కలిసి జీవించలేరు- అని ఆనాటి ముస్లిం లీగు నాయకుడు మహమ్మద్ ఆలీ జిన్నా ప్రతిపాదించాడు. గాంధీ, నెహ్రూ, పటేల్ వంటి ఆనాటి అగ్రశ్రేణి కాంగ్రెస్ నాయకులను బెదిరించాడు. నౌకాలీ వంటి చోట్ల వేలాది హిందువులు అకారణంగా చంపబడ్డారు. ఈ రక్తప్రవాహాలమధ్య భారత స్వాతంత్య్ర భానుడు ఉదయించాడు. ఇండియా, పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ (ఆక్రమిత కాశ్మీర్) అలా భారతదేశం ముక్కలు చేయబడింది. ‘హా సతే కే లియా పాకిస్తాన్ లజకే లేంగే హిందూస్తాన్’ (ఆషామాషీగా బెదిరించి పాకిస్తాన్ సాధించాము. యుద్ధం చేసి హిందూస్తాన్ గెలుచుకుంటాము) అని పాకిస్తాన్ నాయకులు ప్రకటించారు.
బ్రిటన్, అమెరికా వంటి దేశాలకు వ్యాపారమే ముఖ్యం. అందుకవి యుద్ధాలు సృష్టించి ఆయుధాలు అమ్ముకుంటూ ఉండటం వారి వ్యాపార నీతి. ఈ విధంగా గత డెబ్బది సంవత్సరాలుగా అమెరికా తన ఆయుధాల విక్రయ కేంద్రంగా పాకిస్తాన్‌ను మార్చుకున్నది. కెన్నడీ, ఒబామా వంటి ఒకరిద్దరు ఉదారవాదులను మినహాయిస్తే దాదాపు అమెరికన్ అధ్యక్షులంతా పాకిస్తాన్‌కు మిలటరీ సహాయం అందజేసినవారే. 2002లో న్యూయార్క్‌లోని ఎంపైర్ బిల్డింగ్ మీద జిహాదీ ఉగ్రవాదులు దాడి చేయటంతో ఉగ్రవాదం యొక్క తీవ్రత మొదటిసారి అమెరికా అనుభవంలోకి వచ్చింది. నిజానికి గత వెయ్యి సంవత్సరాలుగా భారతదేశం ఉగ్రవాదుల దాడికి గురి అవుతూనే వుంది. కాబట్టి ఇండియాకు ఎంపైర్ బిల్డింగ్ విధ్వంసం వంటి సంఘటనలు కొత్త కాదు.
కొద్దిరోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్‌కు ఇచ్చే 2 బిలియన్ డాలర్ల సైనిక సహాయాన్ని నిలిపివేశాడు. పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశం అని అమెరికా గుర్తించింది. భారతదేశంలో ఎక్కడ మతఘర్షణలు జరిగినా వాటి మూలాలు హైదరాబాద్ పాతబస్తీలో ఉన్నట్లే- ప్రపంచంలోని అన్ని ఉగ్రవాద సంస్థల మూలాలు ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్నాయి. ‘‘మాకు ప్రజాస్వామ్యం సరిపడదు. సైనిక పాలనయే శ్రేష్ఠం’’ అని పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ చేసిన ప్రకటన గుర్తుచేసుకోవలసి వుంది. ప్రపంచంలో స్పష్టమైన రాజకీయ వ్యూహం కల దేశం చైనా. వారు అంచెలు అంచెలుగా ఆసియాలో తమ సామ్రాజ్యవాద విస్తరణ సాగిస్తున్నారు. ఈ దిశగా బెలూచిస్తాన్‌లో రోడ్లు నిర్మించారు. లడక్, అరుణాచల్‌ప్రదేశ్, డోక్లాం వంటి ప్రాంతాలల్లోకి చొచ్చుకొని వచ్చారు. పాకిస్తాన్‌కు ఆర్థిక సహాయం అందజేసి దానిని తమ వలస రాజ్యంగా మార్చుకున్నారు. నేపాల్‌ను కబళించారు. తెలంగాణ, కేరళ, బెంగాల్ చత్తీస్‌గఢ్, జార్ఖండ్, త్రిపుర వంటి ఇండియన్ యూనియన్‌లోని రాష్ట్రాలల్లో తమ ఏజెంట్లను ప్రోత్సహించారు. ‘్భరతదేశాన్ని ముక్కలు చేయండి’ అని న్యూఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడు కన్హయకుమార్ ఒక ఊరేగింపులో చేసిన ప్రకటన వీడియో మొత్తం ప్రపంచం చూచింది. ఈ విధంగానైనా తన వ్యూహరచనతో ముందుకు సాగిపోతున్నది. అమెరికా తన ఆర్థిక సహాయాన్ని పాకిస్తాన్‌కు ఆపితే ఆ మేరకు పాకిస్తాన్ చైనా నుండి మరింత సాయాన్ని పొందగలుగుతుంది. అంతేకాదు ఉత్తరకొరియాలోని అణ్వస్త్ర క్షిపణుల నిర్మాణానికి పాకిస్తాన్ నుండి యురేనియం, ముడి పదార్థమూ, సైంటిస్టులు అందటం గమనార్హం. ఇలా చైనా-పాక్ సైనిక బందీలో భారతదేశం విలవిలలాడుతున్నది.
ఈ దశలో 2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. స్వఛ్ భారత్ అంటూ వీధులు ఊడ్చటం, చైనా సరుకులకు ఇండియాలో మార్కెట్ సిద్ధం చేయటం, పాకిస్తాన్‌కు అడపాదడపా నిరసన పత్రాలు పంపటం వంటి కార్యక్రమాలతో నరేంద్ర మోదీ నాలుగేండ్ల పాలనాకాలం ఇపుడు ముగిసింది. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి వంటి సంస్కరణలు సరే, వౌలికమైన సినో-పాక్ చక్రబంధం నుండి ఇండియాను కాపాడడానికి తీసుకున్న చర్యలు శూన్యం. ఆర్టికల్ 370 రద్దు చేస్తామని, ఆక్రమిత కాశ్మీరును విముక్తం చేస్తాము అని సింధూ నదీజలాల ఒప్పందం రద్దు చేస్తాము అని బీజేపీ లోగడ ప్రకటించింది కదా! ఈ మానిఫెస్టోలోని హామీలు ఎందుకు అమలు కాలేదు? అరుణాచలప్రదేశ్‌లో చైనావారు రోడ్లు నిర్మించటం ఏమిటి? అని ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఎందుకు అడగటం లేదు? కరాచీ పోర్టులో చైనా సబ్‌మెరైన్ న్యూక్లియర్ క్షిపణితో పొంచి ఉండటం ఏమిటి? బ్రహ్మపుత్రా నదిపై చైనా డామును నిర్మించటం ఏమిటి? దలైలామాను ఇండియాకు తరిమివేయటం ఏమిటి? కనీసం ఒక్కడైనా ఈ ప్రశ్నలు ఎందుకు వేయడంలేదు? దక్షిణ చైనా సముద్ర తీరంలో జపాన్‌లో చైనా ఘర్షణలకు దిగింది. మొన్న హాంగ్‌కాంగ్‌లో చైనాకు వ్యతిరేకంగా ప్రజా ప్రదర్శనలు జరిగాయి. మొత్తం ఆసియా మార్కెట్‌ను చైనా అంచెలు అంచెలుగా కబళిస్తున్నది. ఇండియాకు చుట్టూ వున్న చిన్న దేశాలు కూడా కష్ట సమయంలో ఇండియాకు మద్దతుగా నిలుస్తాయని చెప్పలేము. అంటే మన విదేశాంగ నీతి విఫలమయిందని అర్థం. పోనీ అంతర్గత భద్రత సురక్షితంగా ఉన్నదా అంటే అదీ ప్రశ్నార్థకమే. నిన్నటి వరకు కేరళలో కన్నూరు జిల్లాకే పరిమితమైన మార్క్సిస్టు హింసాకాండ ఇపుడు మొత్తం రాష్ట్రానికి విస్తరించింది. మత్తన్నూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. తిరుఅనంతపురంలోని శ్రీశంకర కళాశాలలో జరిగిన స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలలో శిర్ష అనే విద్యార్థి నాయకుడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకుణ్ణి ఓడించాడు. దానితో ఆగ్రహించిన సిపియం నాయకుడు కాలితిల్ ప్రత్యర్థులపై దాడి చేయగా ఆ విద్యార్థులు హాస్పిటల్లో చావుబతుకులమధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కొట్టాయం జిల్లాలోని ఎట్టమనూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాన్ని డిసెంబర్ 25 జీససు పుట్టినరోజున తగులబెట్టారు. దీనికి గోపాలకుట్టి మాస్టర్ అనే సంఘ నాయకుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని విచారణ కమిటీ వేయవలసిందిగా డిమాండ్ చేశారు. కాని పిన్నారాయ్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కారణం- ప్రభుత్వమే స్వయంగా ఈ హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నది!
ఈమధ్య బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా త్రిపుర వెళ్లి ‘‘మేము అధికారంలోకి వస్తే ఈ నాయకులకు జైలుశిక్ష తప్పదు’’ అని హెచ్చరించారు. ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు చైనా బెదరదు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఏ గుజరాత్ రాష్ట్రంనుండి వచ్చాడో అదే గుజరాత్ నుండి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కూడా వచ్చాడు. అంటే మోదీ ఇపుడు ఉక్కు మనిషి అవతారం ఎత్తాలని భారత జాతి ఆకాంక్షిస్తున్నది. ఇపుడు ఒక్క విషయం మనం గుర్తించాలి. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరూ అంతే దూరం. అంటే చైనాను చూచి పాకిస్తాన్‌ను చూచి ఇండియా భయపడుతున్నట్లే ఇండియాను చూచి బీజింగ్, ఇస్లామాబాద్‌లు కూడా భయపడుతాయి. ఈ రహస్యం కేంద్ర ప్రభుత్వం గ్రహించాలి. రాజస్థాన్, గుజరాత్‌లపై పాకిస్తాన్ అణ్వాయుధాలు ప్రయోగిస్తాము అని బెదిరిస్తున్నది. అదే జరిగితే ప్రపంచపటంలో పాకిస్తాన్ అనే దేశమే మిగలదు. ‘‘నేను ఇండియాపై అణుబాంబు వేయాలని ఉవ్విళ్లూరాను. కాని ప్రతీకార చర్యకు భయపడి ఊరుకున్నాను’’ అని మాజీ పాక్ సైన్యాధ్యక్షుడు ముషారప్ చేసిన ప్రకటన గుర్తుంచుకోవాలి.
ఇపుడు ఇండియా వెంటనే చైనా సరుకులపై ఇండియాలో పూర్తి నిషేధం విధించాలి. కేరళలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రయోగించాలి. కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 ఉపసంహరించాలి. ఆక్రమిత కాశ్మీర్‌లోని 200 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలి. దలైలామాను టిబెట్ అధినేతగా ప్రకటించాలి. నేపాల్‌ను చైనా ఏజెంటు భట్టారాయ్ కబంధ హస్తం నుండి విముక్తం చేయాలి. ఈ తక్షణ చర్యలు చేపట్టకుండా కాలక్షేపం చేస్తే ప్రస్తుత బిజెపి ప్రభుత్వం లోగడ మన్మోహన్‌సింగ్‌గారి ప్రభుత్వానికి ‘బి’ టీంగా చరిత్రలో మిగిలిపోతుంది. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి బిజెపి పాలిత ప్రాంతాలల్లో కాంగ్రెస్ చిచ్చు పెట్టి సమస్యలను సృష్టిస్తున్నది. త్వరలో తెలంగాణలోని ప్రభుత్వానికి కూడా కాంగ్రెస్ నుండి, ప్రొ.కోదండరామ్ నుండి సెగ తగలనున్నది. దీనికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.
ఇప్పుడు ఎన్నికలు జరిగితే 70 సీట్లు మావేనని కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎలా చెప్పగలుగుతున్నారు? గుజరాత్ ఎన్నికలలో విద్రోహ కార్యకలాపాలు నిర్వహించిన జిగ్నేష్ మెవానీ, శిల్పేష్, హార్దిక్ పటేల్, అహ్మదామాద్ ఆర్చిబిషప్‌లపై ఆ రాష్ట్రంలోని నూతన ప్రభుత్వం తీసుకోబోయే చర్య ఏమిటి? పాకిస్తాన్‌లోని కులభూషణ్ యాదవ్‌ను సజీవంగా ఇండియా తీసుకురాగలరా? సినో-పాక్ ఎకనమిక్ కారిడార్ పూర్తి అయింది. దీనికి ఇండియా ధీటుగా సమాధానం చెప్పగలదా?

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్