సబ్ ఫీచర్

భూమాతను రక్షించుకుందాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు టెక్నాలజీ పేరుతో విలాసవంతమైన జీవితం గడపడానికి అలవాటుపడి, ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నాం. పరిశ్రమలు వదిలే వ్యర్థ పదార్థాల వల్ల జల కాలుష్యం, వాహనాలు వదిలే పొగవల్ల వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ప్లాస్టిక్ పర్యావరణానికి ముప్పు అని తెలిసినా విచ్చలవిడిగా ప్లాస్టిక్ వస్తువులను వాడుతున్నాం. దాంతో ప్లాస్టిక్ వ్యర్థాలు భూమి పైపొరల్లో పేరుకుపోయి అనేక సమస్యలకు కారణమవుతున్నాయి. అధిక దిగుబడుల కోసం పంట పొలాలపై రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడుతున్నారు. కలప కోసం అడవుల్ని నరికి మూగ జీవులకు నీడ లేకుండా చేస్తున్నారు. పచ్చదనం మీదే ప్రపంచ మనుగడ ఆధారపడి వుందన్న విషయం మరువకూడదు. మనిషికొక చెట్టు నాటి, బిడ్డలా పెంచితే దేశంలో కోట్ల వృక్షాలు పుట్టుకొస్తాయి. పచ్చని చెట్లు కాలనీల నిండా నాటితే భూమాత చల్లగా వుంటుంది. దాంతో వర్షాలు పుష్కలంగా కురుస్తాయి. సర్వజీవకోటికి ప్రాణాధారమైన చెట్లను నరకడం మాని మొక్కలను నాటడం అలవాటు చేసుకోవాలి. పర్యవరణానికి ముప్పు వాటిల్లితే అకాల వర్షాలు పండిన పంటలను మింగేస్తాయి. మండే ఎండలు మనల్ని మాడ్చేస్తాయి. కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొచ్చి ప్రజల ప్రాణాలు తీస్తాయి. పర్యావరణాన్ని పరిరక్షించాలంటే, కొండలను కొండలుగా వుంచాలి. నదులను నదులుగా పారనివ్వాలి. చెట్లను చెట్లగానే బ్రతకనివ్వాలి. స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి లభించిననాడే కాలుష్య రహిత సమాజం ఏర్పడుతుంది. తద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుంది. పెరుగుతున్న కాలుష్యంతో జీవన విధానం గతి తప్పుతోంది. నాయకులు కాలుష్య నివారణ గురించి ప్రసంగిస్తారు. మొక్కలు నాటమంటారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించమంటారు. కానీ వాళ్ళు మాత్రం ఇవేమీ చేయరు.
లక్షలాదిగా పెరిగిపోతున్న వాహనాలు, వాటి నుంచి వెలువడుతున్న కాలుష్యం దేశాన్ని కలవరపెడుతున్న సమస్య. నగరాలలో పరిశ్రమలు విడిచిపెడుతున్న పొగ జీవరాసులకు సెగగా మారింది. దీనికితోడు పెరిగిపోతున్న నగరీకరణ మరింత కాలుష్యరహిత సమాజాన్ని వృద్ధి చేస్తోంది. అందువల్ల భూమి, నీరు, గాలి అన్నీ కలుషితమయిపోతున్నాయి. దీనికితోడు ప్లాస్టిక్ వినియోగం పరిసరాలకు, వాతావరణానికి, పర్యావరణానికి ప్రమాదకరమని తెలిసినా ప్లాస్టిక్ వస్తువులను విచ్చలవిడిగా వాడుతున్నారు. ఏ నగరంలో చూసినా, ఏ యాత్రా స్థలంలో చూసినా ప్లాస్టిక్ దుర్గంధం పెచ్చరిల్లుతోంది. పెళ్ళిళ్ళలో వందలాది ప్లాస్టిక్ వస్తువులను వాడి పడేస్తున్నారు. విందు వినోదాల పేరిట ప్లాస్టిక్ ప్లేట్లు కూడా వచ్చాయి. మనిషి ఆరోగ్యానికి ప్రమాదమని తెలిసి కూడా ప్లాస్టిక్ వినియోగానికి విపరీతంగా అలవాటుపడటం ధరిత్రికి పెద్ద విపత్తని మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. ప్లాస్టిక్ వస్తువులు వీటిని కలుషితం చేస్తూ పరిసరాలను విషపూరితం చేస్తున్నాయి. కాలుష్య కోరల్లో చిక్కుకొని భూమాత అల్లాడుతోంది.

-కాయల నాగేంద్ర