సబ్ ఫీచర్

సభ్యులారా ఇది సబబేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందరు ఆడవాళ్లు కాళ్లనిండా పసుపు పూసుకొని, ముఖాన కుంకుమ బొట్టు పెట్టుకొని, చేతులకు గాజులు, మెళ్లో హారాలు, పట్టుచీరనో ఆమెకు తగ్గ చీరేదో కట్టుకొని మూర్త్భీవించి స్ర్తితత్వంలాగా కనిపిస్తుంటారు. ఒకటే గుళ్లు గోపురాలకు ప్రతిరోజు వెళ్తుంటారు. మరికొందరు అందంగా అలంకరించుకొని మహిళామండలులకు క్రమం తప్పకుండా వెళ్తుంటారు. గుడికి వెళ్లి అందరికోసం మొక్కుతున్నామని చెబుతుంటారు. వాళ్లు చేసే పూజ ఇతరులు చూస్తున్నారో లేదో అని గమనిస్తుంటారు. పైగా సెల్ఫీలు లేకపోతే వారి కూతర్లో లేక కొడుకుల చేతనో ఫోటోలు తీయించుకుంటూ ఉంటారు. వెంటనే అక్కడ్నుంచి అక్కడే ఇతరులకు ఆ ఫోటులు వాటితోపాటుగా ఎందుకు గుడికి వచ్చారో ఏ యే పూజలు ఎంతెంత కట్టి చేయించుకొన్నారో అన్నీ వివరంగా కూర్చుని ఫేస్‌బుక్‌లోనో, వాట్స్ అప్ లోనో పంపిస్తుంటారు. ఇది ఒకరకం.
మరికొందరు చక్కగా లేటెస్టుగా మార్కెట్‌లోకి వచ్చిన కొత్త అందమైన చీర దానికి తగ్గ జాకెట్టు, నగలు ఇలా అన్నీ హుందాగా అలంకరించుకొని మరీ మహిళామండలులకు క్రమంతప్పకుండా వెళ్తుంటారు. ప్రతిరోజు అక్కడ చిన్న పాటి ఉపన్యాసం కూడా ఇస్తుంటారు. ఇంట్లో చేయాల్సిన పనులు వారు చేసే ఘనకార్యాలు, మహిళామండలు ల తరఫున వారు చేసే సేవాకార్యాలు, డాక్టర్ల చేత క్యాంపులు, ఐటెస్టు ల్లాంటివి, పిల్లలకు ఉచిత పుస్తకాల పంపిణి ఇట్లాంటివి కూడా చేస్తుంటారు.
బాగుంది. కాని వీరు వీళ్ల ఇంట్లో చూస్తే బయట పల్లకీ మోత ఇంట్లో ఈగల మోతలా ఉంటుంది. ఇల్లు సరిగా పెట్టుకోరు. మోక్షగుండం విశే్వశ్వరయ్య చెప్పినట్లుగా ఎక్కడ ఉంచాల్సిన వస్తువులు అక్కడ ఉండవు. ముందు రూమ్‌లో గినె్నలు చెంబులు, మంచం మీద బియ్యం, కూరగాయలు, ఇక ఫ్రిజ్ సంగతి సరేసరి అది నిండి పోయి తలుపు తెరిస్తే కింద పడిపోతాయా అన్నట్టు ఉంటుంది. ఇక డ్రెసింగ్ టేబుల్ ఐనా, డైనింగ్ టేబుల్ అయినా పేపర్‌లతోనో, దువ్వెనతోనో నిండిపోయి ఉంటుంది. బట్టలు పెట్టుకొనే అలమర్లు అయితే చెప్పనక్కర్లేదు అవి నిండిపోయి ఉంటుంది. ఏదైనా అవసరమైనవి కావాల్సి వస్తే ఆ కుప్పనంతా మంచంమీదనో మరేదాని మీదనో వేసి అందులోంచి వెతుక్కుంటుంటారు.
మరికొందరు ఏదో కనిపించిది వేసుకొని వెళ్తుంటారు. వారి పిల్లలు స్కూల్ బ్యాగ్ ఎక్కడుందో స్కూలు టైమ్ అయిపోయాక వెతుక్కుంటారు. అపుడు హోం వర్క్ చేయలేదు మా టీచర్ కొడుతారు. నేను స్కూల్‌కి వెళ్లను అని చిన్న పిల్లలు ఏడుస్తుంటారు.
ఇంకొంతమంది ఉంటారు. వంట చేసేసి ఇంట్లో బయటకు పంపించాల్సిన వారిని పంపించేసి ఇక వాకిట్లో చేరుతారు. వాళ్ల మొగుడు ఎంత గొప్పవాడో, ఆఫీసులో ఎంత కష్టపడి పనిచేస్తున్నాడో ఎవరెవరు ఆయన మీద పడి తింటున్నారో, వీరికెంత ఆస్తిపాస్తులు ఉన్నాయో చెబుతుంటారు. పనిమనిషి లేకపోతే మేము అసలే ఉండలేము ఇంకా కొందరుంటారు. ఈ రోజు పనిమనిషి రాలేదు కనుక కాఫీ, టీలు లేవు. టిఫెన్స్ బయటనుంచి తెప్పించుకుందాం. పక్కవారి పనిమనిషి వస్తే ఆమె చేత పనులు చేయించుకుందాం అంటుంటారు. ఇంకొందరు ఆ పనిమనిషి ఇంటికి వెళ్లి ఆమెను తీసుకొని వచ్చి మరీ పని చేయించుకుంటుటారు.
కాని వీరెవరూ పని మాత్రం చేయడానికి ఇష్టపడరు.
ఇక ఉద్యోగినులు అయిన మహిళలు పొద్దునే్న ఆఫీసుకు వెళ్లాలి కనుక భర్త సగం పని చేస్తే నేను సగం పని చేస్తాను అంటారు. పిల్లలకు తినుబండారాల బాక్స్ మేము పెడుతున్నాం కనుక మీరు ఆ పిల్లలకు స్నానపానాలు చేయించాలి అంటారు. ఒకవేళ అది కుదరకపోతే ఆరోజు పిల్లలు స్నానాలు చేయకుండానే స్కూలుకు వెళ్తుంటారు. ఆయన చేయలేదు కనుక ఈమె కూడా వండదు. ఆరోజు ఇంకేదో ఏర్పాటు చేసుకొంటారు. ఇంకా ఇంకా ఎన్నో రకాలున్నాయి.
అయితే వీళ్లు చేసేపనులు ఎంతవరకు సబబు అని ఒక్కసారి ఆలోచించుకోరు. ఎదుటివారికి చెప్పడానికే నీతులు ఉంటాయనుకొంటే అది ఎంత బాగుంది. వీరు చేయాల్సిన పనులు చేయక మహిళామండలికి వెళ్లి ఉపన్యాసం ఇస్తే సరిపోతుందా? ఇంట్లో అత్తమామలకు అన్నం పెట్టకుండా వీధిలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఫోటులు పేపర్‌లో వేయించుకుంటే సరిపోతుందా? ఇంట్లో ఉన్నవాళ్లతో నిత్యం పోరాడుతూ గుళ్లకు తిరిగి అక్కడ స్వాములకు పూజలు చేస్తే అంతా బాగయి పోతుందా?
ఇలా ఎవరు చేయాల్సిన పనులు చేస్తున్న పనులు ఒక్కసారి ఆలోచించుకుంటే మనం చేస్తున్నది సబబేనా అని ఎవరికి వారు ఒక్కసారి సమీక్షించుకుంటే ఎలా ఉంటుంది?

-శ్రీలత