సబ్ ఫీచర్

స్ఫూర్తిదాతలు వీరే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధించాలని ఉండాలే కాని ఏవీ ఆటంకాలేవీ ఆటంకపర్చలేవు.పట్టుదల, లక్ష్యం లాంటివి ఉంటే చాలు గమ్యాన్ని నిశ్చయంగా చేరవచ్చు అని చరిత్రలో ఎందరో మహామహులు చాటిచెప్పారు. ఆకాశంలో సగం అనే మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్లుతూ అన్నీ అవకాశాలను మేము సద్వినియోగం చేసుకొంటున్నాము అని నిరూపిస్తున్నారు.
ఇంతకుముందు కాలంలో అరకొర మహిళలు మాత్రమే ఉన్నత స్థానాల్లో ఉండేవారు. కాని నేడు మహిళల్లో కేవలం 33 శాతం కాదు 99 శాతం మంది చదువుల్లోను, ఆటల్లో, పాటల్లో, క్రీడల్లో, పారిశ్రామిక వాడల్లోను వారి వారి కున్న ఇష్టాన్ని బట్టి వారు తమ సత్తాను చాటి చెప్తునే ఉన్నారు.
కాని, అక్కడక్కడా ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. వారికి మగమృగాలను ఎదురుదెబ్బలను తగిలిస్తునే ఉన్నారు. అయినా వారిని, వారు చేసిన గాయాలను కూడా మాన్పుకుంటూనే అట్లాంటివారి నుంచి తమను తాము ఎట్లా రక్షించుకోవాలో కొత్త పాఠాలను నేర్చుకుంటూనే మహిళలు ముందుకెళ్తున్నారు.
కొత్తగా మహబూబ్ నగర్ జిల్లాలోని ఎర్ర దీక్షిత అనే నవకెరటం వెయిట్ లిఫ్టింగ్ లో ముందుకు దూసుకొచ్చింది. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ నుంచి వచ్చిన ఈ ఎర్ర దీక్షిత పేరుకే కాదు వెయిట్ లిఫ్టింగ్ లోను తాను ఏమిటో నిరూపించుకునేందుకు అత్యున్నత క్రీడాకారిణిగా ఎంపికైంది.
తెలంగాణా తేజం ఈ ఎర్ర దీక్షిత కామెన్‌వెల్త్ యూత్ ఫెస్టివల్ చాంపియన్ షిప్ లో 58 కేజీల విభాగంలో స్వర్ణపతకాన్ని గెలుచుకుంది.
జాతీయ స్థాయిలో 33, అంతర్జాతీయ స్థాయిలో 9 పతకాలు గెలుచుకుని తెలంగాణ కు కీర్తికిరీటంలో కలికితురాయిగా నిలిచింది.
దేశంలోనే అత్యుత్తమ యువ బాక్సర్ గా పేరు తెచ్చుకుంది. 17 ఏండ్ల నీహారిక. గత సంవత్సరం మేలో ఇస్తాంబుల్ లో జరిగిన 31 యూత్ బాలుర, బాలికల బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో రజితం సాధించింది. ఒలంపిక్స్ లో నే కాదు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తాను అని ఆత్మవిశ్వాసం నేడు వ్యక్తం చేసింది.
దీపిక: బాణాలు చేతబూని తనకంటూ ఓ ప్రత్యేకత ను ఏర్పరుచుకుని ప్రపంచ విలువిద్య పటంలోనే ప్రధాన పోటీదారుగా నిలిచింది. దీపికాకు మారిట్యురిన్ లో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ షిప్ కొరియాను కంగుతినిపించి మొట్టమొదటిసారిగా ఫైనల్‌లో అడుగుపెట్టిన భారత మహిళల జట్టుగా రికార్డు నెలకొల్పడంలో దీపిక పాత్ర ప్రశంసనీయమని అందరి చేత అనిపించుకుంది.
ఇట్లాగే అన్ని రంగాల్లోను మహిళను తమ సత్తాను చాటుతునే ఉన్నారు.
భారత బ్యాడ్మింటన్‌కు హైదరాబాదును అడ్డాగా మార్చిన ఘనత సైనాది. ప్రపంచ స్థాయిలో టోర్నీలో తిరుగులేని విజయాలు సాధిస్తూ చైనా గోడను బద్ధలు కొట్టిన భారత షట్లర్ గా రికార్డుల కెక్కింది.
ఇలానే సాహిత్య రంగంలో పోల్కంపల్లి శాంతాదేవి, మాదిరెడ్డి సులోచన, ఇల్లిందల సరస్వతీ దేవి పాకాల యశోదారెడ్డి, ముదిగంటి సుజాతరెడ్టి ఇలాంటివారెందరో పేరెన్నిక గన్నారు. అన్ని రంగాల్లోను ముందున్న మహిళలు గ్రామీణ ప్రాంతాల్లోనివారికి కూడా స్ఫూర్తిదాతలుగా మారి అందరినీ అన్నింటా అగ్రశ్రేణిలో నిలబెట్టడానికి శాయశక్తులా కృషి చేయాలి.

- కె.రామ్మోహన్ రావు