సబ్ ఫీచర్

తల్లి భాషతోనే.. తడుములాట ఉండదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘దేవ భాష అయిన సంస్కృతానికి అతి దగ్గరగా ఉన్న భాష తెలుగు ఒక్కటే. తెలుగులో ఉన్న మాధుర్యం మరి ఏ భాషలోను లేదు. తెలుగువారు తమ భాష యొక్క విలువ తెలుసుకోవడం లేదు సరికదా దానిని చిన్న చూపు చూస్తూ పెరటిలోని మొక్క ఔషధానికి పనికిరాదన్నట్లు భావిస్తున్నారు’’.
ఈ మాటలు ఎవరో మన దేశస్థుడు అన్నవి కావు. తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషిచేసిన సి.పి. బ్రౌన్ అను ఆంగ్లేయుడు చెప్పినవి. అతడు పందొమ్మిదవ శతాబ్దికి చెందినవాడు. కడప జిల్లా కలెక్టర్‌గా పనిచేశాడు. జీవితాంతం తెలుగుభాష కొరకే శ్రమించాడు. మూలపడిన అనేక తాళపత్ర గ్రంథాలు వెలికి తీయించి తెలుగు సాహిత్యానికి జీవం పోసిన మహామనీషి.
ఆధునిక చదువుల ధర్మమా అని మన పిల్లలకి తెలుగుభాషలోని మాధుర్యం తెలియడం లేదు. అక్షరాభ్యాసం ఐదు సంవత్సరాలు నిండిన తరువాత చేయాలి. చదువు ప్రారంభించడానికి అది సరియైన సమయం. ఇప్పుడు మన పిల్లలకి మూడవ సంవత్సరం నుండే చదువు ప్రారంభిస్తున్నాం.
ఇది తెలుగు అనుకుంటారేమో పొరపాటు. ఈ చదువు ఇంగ్లీషు రైమ్స్‌తో ప్రారంభం అవుతుంది. మా అబ్బాయి తెలుగు మీడియమ్ పాఠశాలలో చదువుతున్నాడు అని చెప్పడానికి తల్లిదండ్రులు సిగ్గుపడిపోతున్నారు. పిల్లలు విద్య మాతృభాష ద్వారానే నేర్చుకోవడం శ్రేష్టమని గాంధీజీ నొక్కి వక్కాణించారు. అదే అభిప్రాయం అనేక మంది విద్యావేత్తలు స్పష్టం చేశారు. ఇందువలన పిల్లలు తమ భావాలు స్పష్టంగా వ్యక్తం చేయగల శక్తి కలుగుతుంది. అయితే గాంధీజీ ఇంగ్లీషు భాష నేర్పడానికి అభ్యంతరం చెప్పలేదు. దానిని ఒక భాషగా సరియైన వయసులో నేర్పాలి. ప్రభుత్వం ఇప్పుడు ఆంగ్ల మీడయమ్ పాఠశాలలు ప్రారంభించింది దానికి కారణం ప్రైవేటు సంస్థలు. ఆ సంస్థలు ఎల్‌కెజి నుండి ఇంగ్లీషు మీడియమ్ నేర్పబడునని ప్రచారం చేస్తున్నాయి.
ఆంగ్ల మీడియమ్ వ్యామోహం ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయింది. కనుక కామన్ విద్యావిధానం శ్రేయస్కరం. ప్రజాస్వామ్యంలో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తుంది. అందువలన కామన్ విద్యావిధానం అమలులోకి రావడం కష్టం. ఎల్‌కెజి స్థాయి నుండి ఇప్పుడు ఇంగ్లీషు మీడియమ్ పాఠశాలలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పాఠశాలలకు వెళ్లే పిల్లల ఖర్చులు విపరీతంగా ఉంటాయి. బస్సు చార్జీలు డ్రస్సు చార్జీలు పుస్తకాల ఖర్చులు డొనేషన్లు సామాన్యులు భరించలేకపోతున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని ఈ ఖర్చులు భరించి ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి? వాటిని ఎవరైనా పరిశీలించారా? లేదు. అలా పరిశీలించనీయరు. అవి అన్నీ ఇంగ్లీషు మీడియమ్ పాఠశాలలు కనుక అక్కడ పనిచేసే ఉపాధ్యాయులంతా సమర్థులని అక్కడకు వెళ్లిన తమ పిల్లలు ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడుతారని ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది.
ఇది శుద్ధ పొరపాటు అక్కడ తెలుగు భాషకి ఏమీ విలువ ఉండదు అనే విషయం తల్లిదండ్రులకు తెలుసు. తెలిసి కూడా తప్పు చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలో నేటి తెలుగు భాష దుస్థితి చూద్దాం. వీటిలో తెలుగు నుడికారం సౌందర్యం కూడా కనిపించవు. వచ్చాడు, వెళ్లాడు వంటి వ్యవహారిక పదాలతో నిండిపోయాయి. వ్యవహారిక భాష ఒకరు నేర్పడం ఏమిటి. అది ఇంటి నుండే ప్రారంభమవుతుంది. వాచక పుస్తకాలలో అనేక దోషాలు, సమాచారం తప్పులు. ఇవి అన్నీ ఒప్పులుగా చలామణి అయిపోతున్నాయి. ప్రజల వద్ద నుండి విమర్శలు వస్తాయనే అభిప్రాయంతో వాచక పుస్తకాలలో సంప్రదాయ సాహిత్యాన్ని స్వల్పంగా ప్రవేశపెడుతున్నారు. చాలా పాఠాలు పిల్లలకు ప్రయోజనం లేనివి. వారి స్థాయికి మించినవి ఉంటున్నాయి. ఉదాహరణకు ఇంటర్మీడియెట్ తెలుగు నమూనా ప్రశ్నపత్రం పరిశీలించండి.
ప్రశ్న: ‘‘ది కిడ్’’ సినిమా గురించి వ్రాయండి.

మరో ప్రశ్న: ‘‘వెరీగుడ్’’ నిజాయితీ అంటే అట్లా ఉండాలి’’ ఇది ఏ పాఠంలోనిదో ఏ సందర్భంలోనిదో వ్రాయాలిట. ఈ ప్రశ్న విధానం కూడా ఇంగ్లీషు పద్ధతే.
మరో ప్రశ్న:
కుటుంబంలో స్ర్తిల అణచివేత ఎలా ఉండేది?
ఏమిటి ఈ ప్రశ్న?
మన కుటుంబాలలో స్ర్తిలను అణచివేస్తున్నారా?
మరో ప్రశ్న:
హిట్లర్ చర్యలను నిరసిస్తూ చార్లీచాప్లిన్ తీసిన సినిమా ఏది? తెలుగు వాచకాలలో ఈ సినిమా సంబంధమైన పాఠం ఎందుకు? హిట్లర్ గురించి చార్లీ చాప్లిన్‌ను గురించి వీరికి ఏం తెలుస్తుంది?
మరో ప్రశ్న: రాముడు గ్రంథాలయానికి వెళ్లాడు.
ఈ వాక్యంలో క్రియా పదం ఏది? ఇది ఐదవ తరగతి ప్రశ్న. ఇంటర్మీడియెట్ పిల్లలకు స్ర్తిల అణచివేత ప్రస్తావన ఎందుకు? ఇలాటి పాఠం చదివితే వీరంతా పెద్ద అయిన తరువాత స్ర్తిలను నెత్తిపై పెట్టుకుని పూజిస్తారా? పెద్దల యెడల స్ర్తిల పట్ల ఎలా ప్రవర్తించాలో తల్లిదండ్రులు చెబుతారు. అది ఉటుంబ సంప్రదాయం. వాచకాలలో సంప్రదాయ గద్య పద్యాలకి ప్రాధాన్యత ఈయాలి. తెలుగులో స్వంత రచనలు చేయగల నైపుణ్యం కల్గించాలి. పూర్వం ప్రతినెల తెలుగులో ఒక వ్యాసం వ్రాయించి దానిని ఉపాధ్యాయులు దిద్దేవారు.
అందులో తప్పులు గమనించి తిరిగి పిల్లలు దానిని దోషరహితంగా వ్రాసేవారు. ఇప్పుడు ఆ పద్ధతి ఉందో లేదో తెలియదు. ఇంగ్లీషుమీడియమ్ వ్యామోహనం వలన పిల్లలు రెంటికి చెడిన రేవడులవుతున్నారు. తెలుగు వాచకం పుస్తకాలు ఒకరిద్దరు నిష్ణాతులచే వ్రాయించాలి. డజన్ల కొద్దీ రచయితలను నియమించడం వలన ఎవరి అభిప్రాయాలు వారు ప్రవేశపెడుతున్నారు. వాచకాలు సాహిత్యంపై అభిలాష కల్గించే విధంగా ఉండాలి. అందలి పాఠాలలో తెలుగు నుడికారం సౌందర్యం కనిపించాలి. తరగతి స్థాయిని దృష్టిలో ఉంచుకుని చిన్నయసూరి వీరేశలింగం గార్ల నీతిచంద్రికలోని పాఠాలు, సాక్షి వ్యాసాలు, మధురకవి నాళం కృష్ణారావుగారి గేయాలు పాఠ్యభాగాలుగా చేర్చాలి. ఇలాంటివి భాషా జ్ఞానము సాహిత్యంపై అభిలాష కల్గిస్తాయి.

- వేదుల సత్యనారాయణ