సబ్ ఫీచర్

ఇరువురికీ మంచి మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ పద్మా...,
ఉభయకుశలోపరి. నీ ఉత్తరం అందింది.
ఈ మధ్య పేపర్లలో వచ్చే వార్తలు వింటుంటే చాలా బాధవేస్తోంది. తిండి లేక అల్లాడేవారు ఎంతోమంది మనదేశంలో ఉన్నారనే వార్తలు మనం వింటుంటాం కదా. కాని నేడు చూడునిన్న టమాటాలు నీళ్లపాలు చేస్తున్నారు. ఇదే టమాట కొన్నాళ్ల క్రితం కిలో వందకూడా పలికింది. మరి నేటి పరిస్థితి. కిలో ఒక రూపాయి కూడా ఎక్కువే అంటున్నారు. దీనికి కారణం ఏమిటంటావు? మొన్నామథ్య ఉల్లిగడ్డలూ నేలపాలు అయ్యాయి. ఇక ఏముంది వచ్చేది మామిడి పండ్ల సీజన్. మామిడి పండ్లు అంటే అందరికీ ఇష్టమే. కాని ఆ వచ్చే మామిడి ధర ఎలా ఉంటుందో అని వినియోగదారుడు చూస్తాడు. అటు రైతు తనకు గిట్టుబాటు ధర పలుకుతుందా లేదా ని చూస్తాడు.
కాని ఇపుడు మార్కెటులో నిల్వచేసుకోవడానికి కావాల్సిన స్టోరేజీలు లేవట. అందుకే ఈ పంటలన్నీ నేలపాలు అవుతున్నాయి. రైతు కష్టం బూడిదలో పోసిన పన్నీరు చందంలాగా అవుతోంది. అటు తినడానికి అందడంలేదు. ఇటు పంట పండించినందుకు ధర రావడంలేదు.
రైతుకు మంచి ధర అన్నా రాకుండా ఉంటుంది. లేకపోతే వినియోగదారుడు కొనుక్కులేని పరిస్థితులైనా ఎదురవుతూ ఉంటాయి. దీనికంతా కారణం మాత్రం ఒక్కటే అధికంగా వచ్చిన దిగుబడిని భద్రపర్చే సదుపాయాలు లేకపోవడమే. మార్కెటును ఎప్పుడూ ఒకేవిధంగా ఉండేలా చేయాలన్నా అటు వినియోగదారులకు ఇటు రైతులకు అనుకూలమైన ధరలు ఉండాలన్నా భద్రపరిచే వీలు కలిగి ఉన్నట్లు అయితే ఇరువురూ నష్టపోకుండా ఉంటారుకదా.
కాని, రైతు పండించిన పంటను భద్రపర్చే వీలు అటు రైతులకు లేదు. ఇటు దళారులకు కూడా లేదు. మార్కెటు యాడ్స్‌లో కోల్ట్ స్టోరేజ్‌లు ఉన్నాయి. వాటిని వినియోగించుకున్నా కూడా టమాటకు పూర్తి ధర రాదు.
దీన్ని మనం నియంత్రించాలంటే కొత్తగా మార్కెటులోకి వచ్చే టెక్నాలజీని సొంతం చేసుకోవాల్సిందే. రైతు పంట పండించడంలో మెళుకువలు నేర్చుకున్నట్లే పండించిన పంటను భద్రపర్చడంలోను మార్కెటు కు వచ్చి మంచి ధర పలికేలా చేయడంలో అంతే కష్టం ఉంటుంది. కనుక ఈ పనిని మన స్ర్తిలు ఎందుకు చేయకూడదు అనిపించింది.
కొత్తగా అమెరికా పేటంట్ హక్కు ఉన్న బ్లాక్ బ్యాగ్స్ గురించి నీకు తెలుసా? మన దేశంలో విజ్తార్ అగ్రిటెక్ కంపెనీకి ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొన్నట్లు నేను విన్నాను. స్పెయిన్ కుచెందిన నైస్ ప్రూట్స్ కంపెనీతో దీనికోసమే టై అయింది.
ఈ బ్లాక్ బ్యాగ్స్‌ల్లో పంటను నిల్వచేస్తే సుమారుగా వెయ్యిరోజుల వరకు పంట నిక్షేపంగా ఉంటుదని చెప్తున్నారు. బ్లాక్ బ్యాగ్స్‌లో టమాటాలు, ఉల్లిగడ్డల్లాంటివి కూడా కుళ్లిపోవట. చిదిమిపోకుండా కూడా ఉంటాయి. ఎట్లా నిలువ చేసినవి అట్లానే ఉంటాయి. సహజత్వాన్ని కలిగి ఉండేలా చేయడానికి ప్రిజర్వేటర్స్‌ను కూడా ఇందులో ఉపయోగించరట. ఈ బ్లాక్ బ్యాగ్స్ టెక్నాలజీ ని ప్రపంచంలోని అందరూ వాడి చూసారట.
ఇక మనదేశంలోని వచ్చిన ఈ బ్లాక్‌బ్యాగ్స్ ను కోల్డ్‌స్టోరేజ్ ప్లాంట్లకు అనుసంధానం చేస్తున్నారు. అందులో మొదటి రెండు యూనిట్లు హైదరాబాదులో ఏర్పాటు కాబోతున్నాయి. హిందుస్థాన్ ఎల్‌ఎన్జీ తో కలసి హైదరాబాదులో రెండు కోల్ట్ స్టోరేజి ప్లాంటు తెరవబోతున్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లో మామిడిపండ్ల నిల్వ కోసం మరో రెండు ప్లాంట్లు పెట్టబోతున్నారు.
ఈ బ్లాక్ బ్యాగ్స్ టెక్నాలజీ వల్ల రైతుల ఆదాయం నాలుగు రెట్లు పెరుగుతుందంటున్నారు. దీనివల్ల ఇక పై పంట నష్టపోవడం అంటూ ఉండదు. ఒకవేళ పంట మరీ ఎక్కువగా ఉంటే విదేశాలకు కూడా ఎగుమతి చేసుకొనే వీలును కూడా ఈ బ్లాక్‌బ్యాగ్స్ కలుగచేస్తాయి
అయితే ఇదంతా మన రైతులు చూసుకోవాల్సింది కాని, మహిళలంతా ఈ బ్లాక్‌బ్యాగ్స్ టెక్నాలజీ పై పట్టు సాధించి మన దేశ ఉత్పత్తులను నిల్వచేయడంలోను, రైతులకు నష్టం కలుగకుండా చేయడంలో తోడ్పడేలాగా చేయాల్సిన బాధ్యతను తలకెత్తుకుంటే బాగుంటుందని నా ఆలోచన.
రైతు పండించిన పంటకు మంచి ధర రాకపోతే ఆ రైతుకు కన్నీళ్లు తప్ప మరేం గుర్తుకురావు. ఎంతో కష్టపడి ఎండకువానకు తట్టుకొని బిడ్డలా పెంచుకున్న చేను పంటకాస్తే రైతు తన బిడ్డ ఎదిగినట్టుగా సంతోషపడుతాడు. అట్లాంటి పంట మంచి దిగుబడి, ఆ దిగుబడికి రావాల్సిన ధర వస్తే రైతు ఆనందాన్ని వెలకట్టలేము. ఆ ఆనందంలో ఆయన పడ్డ కష్టం అంతా మర్చిపోతాడు.
అందుకే రైతుకు, వినియోగదారుడికి ఇద్దరికీ ఆనందం కలిగేట్టుగా మనమూ ఈ ఆలోచనతో సరికొత్త ఆలోచన్లు చేసే దిశగా మనం అడుగులు వేద్దాం. ఈ సంగతినేను మన మహిళామండలిలో చర్చిద్దాం అని అనుకొంటూ ఉన్నాను. నీవేమంటావు. నీవు ఈదిశగా ఆలోచిస్తావని అనుకుంటూ
ఇట్లు..
నీ శర్మద