సబ్ ఫీచర్

పదండి విజయభేరి మోగిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళా దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా ముందుగా మహిళలందరికీ శుభాకాంక్షలు! గడప దాటిరానివాళ్ళం ఈనాడు రాజకీయ సింహాసనాలు మనవే. ప్రతి ఉన్నత స్థానంలో మహిళలే. ప్రధానమంత్రి పదవినుంచి అన్నింటా తామై నిలుస్తున్నాం. ఎవరెస్ట్ అంత ఎత్తుకి ఎదగడం కాదు అక్కడా పతాకాన్ని ఎగురవేశారు. విమానాల్లో ఎయిర్‌హోస్టెస్‌గా ఉండటమే గొప్ప అనుకుంటుంటే పైలట్స్‌గా రాణించారు. యుద్ధ విమానాలను కూడా నడిపేస్తున్నారు. మెట్రోని హైదరాబాద్‌లో మొదట నడిపిన ఘనకీర్తి కూడా మనమే కొట్టేసాం.
ఆటల్లోనూ మేటిగా నిలిచారు. షటిల్ బాడ్మింటన్ స్టార్ పి.వి.సింధువల్ల ప్రపంచ ఖ్యాతినే సంపాదించేసాం. కంటే ఆడపిల్లనే కనాలి అనే సూక్తి కూడా వాడుకలోకి వచ్చేసింది. హంపివల్ల చెస్ రాజ్యం కదిలింది. ఎందరో మహిళలు చెస్ రంగంవైపు దృష్టి పెట్టడానికి ఆమె కారణమయ్యింది. కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టర్‌గా విజయాన్ని సాధించారు. మహిళలు క్రికెట్ రంగం వైపు కూడా దూసుకుపోతూ తమ ప్రతాపాన్ని చాటుకుంటున్నారు.
ఇంత గొప్పగా చాటుకుంటున్న వీళ్ళంతా ఎంతో కష్టపడితేనే పైకి వచ్చారు. ఎన్నో అవరోధాలను దాటితేనే ఈ స్థితికి రాగలిగారు. ఎవరికీ విజయం అరచేతిలోకి వచ్చి పడదని ఈ సందర్భంగా మనం గుర్తుచేసుకోవాలి. అకుంఠిత దీక్ష, కృషి, పట్టుదల, కుటుంబాల శ్రేయోభిలాషులు, కోచ్‌లు, గురువుల చేయూతే వారిని ఈ స్థానంలో నిలబెట్టింది. ఏ రంగంలో స్ర్తిలు లేరు అనే రీతిలో విజయాన్ని గుప్పెటలో బంధిస్తున్నారు. వ్యాపార రంగాలలో, సినిమాల్లో, టీవీ షోలల్లో, ఉద్యోగాల్లో అన్నింటా మహిళలే. చివరకు ఇపుడు పెళ్లిచూపుల్లో అబ్బాయిలను ఎంపిక చేసుకునేది కూడా అమ్మాయిలే. ఒకప్పటి అబ్బాయి స్థానంలో ఇప్పుడు మహిళ ఉంది. ఇది మనకు గర్వకారణం. ఇంత ప్రగతిని సాధిస్తున్నా రోజూ ఏదో ఒక మూల అన్యాయంగా బలి అయిపోతున్న ఆడపిల్లల వార్తలు వింటూనే ఉన్నాం. పసిపాపలమీద కూడా అత్యాచారాలు, చివరకు వివాహితలను కూడా వదలటంలేదు. బంధాలకు అనుబంధాలకు విలువ లేకుండా పోతోంది.ప్రక్కింటి తాతో, సొంత తండ్రో ఈ కళంకిత లిస్టులో చేరుతున్నారు. ఇంతకన్నా పైశాచికత్వం ఎక్కడుంది?
దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి అని మహిళలంతా ఆలోచించాలి. ముందుగా తమను తామే రక్షించుకోగల విద్యలు కరాటే, కర్రసాము లాంటివి నేర్చుకోవాలి. ఇప్పటికే ఎందరో మహిళలు ఆ వైపుగా తమ నడక సాగిస్తున్నారు. అలా కొందరు కాదు అందరూ అడుగులు వెయ్యాలి. మన ప్రభుత్వం కూడా వారికి ఈ విద్యలు ఉచితంగా నేర్పిస్తూ, మహిళలకు చేయూతనిచ్చే అవకాశాన్ని కల్పించాలి.
మహిళకు జరుగుతున్న అన్యాయాలలో మగవారి పాత్ర ఎక్కువగా వుంటోంది. సృష్టి ఇద్దరితో సమానంగా ప్రారంభమైంది. స్ర్తిలకు సమాన హోదా ఇవ్వాలి. రాజకీయాల్లో కూడా అది వారి హక్కు. అలాగే స్ర్తిలను గౌరవించటం నేర్చుకోవాలి. అదే మన సంస్కృతి, మన సంప్రదాయం. ప్రపంచ దేశాల్లో మనకంటూ గొప్ప ఖ్యాతిని ఆపాదింపజేసిన వాటిని కలలో కూడా మనం మరిచిపోకూడదు. వాటిని నిలబెట్టుకోవడం మన బాధ్యత. అలాగని అందరూ అలా ఉన్నారని నేను అనను. ఓ మహిళ ఎదుగుతోందంటే భర్తో, పిల్లలో, కుటుంబమో చేయూత ఇస్తున్నారనేది అక్షరసత్యం. ఆ చేయూత మరింత పెద్ద స్థాయిలో ఉంటే మరిన్ని విజయాలను మహిళలు సొంతం చేసుకోగలుగుతారు. కాస్తంత మిణుకు లాంటి మెరుపు కనిపించినా ప్రభుత్వం వాళ్ళను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అన్యాయాలను, అక్రమాలను, అత్యాచారాలను అరికట్టుకుంటూ మనకి మనం గమ్యాన్ని చేరే సాహసం చేయాలి. ఏదీ సులభంగా చేతికి చిక్కదు. అందిపుచ్చుకోవడంలోనే ఘనత ఉంది. ఈ విషయాలు గుర్తుంచుకొని ఇంకా మునున్మందు మహిళలు సాగాలని, అత్యుత్తమ విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా!
*
- యలమర్తి అనూరాధ
9247260206
*
మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003