సబ్ ఫీచర్

సాధికారత దిశగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏవైనా మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ కార్యక్రమాలకు హాజరయ్యే పెద్దలు మహిళల అభివృద్ధి పట్ల ప్రసంగాల్లో దంచేస్తారు. ఆ ఘాటు ప్రసంగాలన్నీ అక్కడి వరకే.. కార్యరూపం శూన్యం. అయితే అనంతపురం జిల్లాలోని రూరల్ డెవ్‌లప్‌మెంట్ ట్రస్ట్ ( ఆర్డీటి) మహిళల అభివృద్ధికి ప్రాముఖ్యతనిచ్చి అనేక కార్యక్రమాలను చేబడుతోంది. వెనుకపడిన ప్రాంతమైన అనంతపురం జిల్లాలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి పునాది వేసింది ఆర్డీటి అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దళిత, గిరిజన, ఇతర వెనుకబడిన మహిళల సమస్యలపై ఎప్పటికప్పుడు వారికి అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యవంతులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఆర్డీటిలో మహిళా విభాగానే్న ఏర్పాటు చేసింది. పురుషులతో సమానంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో మహిళలు అభివృద్ధిని సాధించేటట్లు చేయడమే లక్ష్యంగా ఆర్డీటి పనిచేస్తోంది. అందులో భాగంగా ...
స్వయం సహాయక సంఘాల ఏర్పాటు... ఆర్డీటి సంస్థ గ్రామీణ ప్రాంతాల్లోని దళిత, గిరిజన, ఇతర వెనుకబడిన మహిళలతో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసింది. ఆర్డీటి పనిచేస్తున్న అన్ని ప్రాంతాల్లో ఇప్పటి వరకు సుమారు లక్షా 22వేల మంది మహిళలతో దాదాపు 10వేలకు పైబడి స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశారు. ఒక్కో సంఘంలో 10నుంచి 15మంది దాకా వుంటారు. ఈసంఘాల్లోని మహిళలు ప్రతి నెలా కొంత డబ్బుని సంఘంలోని ఓ ఇద్దరి మహిళలను గ్రూపులీడర్లుగా ఎంపిక చేసుకుని వారి గ్రామాల పరిధిలోని బ్యాంకులో లీడర్ల పేరిట ప్రారంభించిన పద్దులో జమచేస్తుంటారు. సంఘంలోని మహిళలకు ఏవైనా అత్యవసర ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు ఇతరులపై ఆధారపడకుండా వారు చేసుకున్న పొదుపునుంచి కొంత మొత్తాన్ని అందజేస్తారు. ఆ మొత్తాన్ని తీసుకున్న మహిళలు ఎటువంటి వడ్డీ లేకుండా నిర్దేశించిన సమయంలో బ్యాంకులో జమచేసేస్తారు. ఈవిధంగా మహిళలు ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపుచేసుకునే విధంగా ఆర్డీటి ప్రోత్సహిస్తోంది.
మహిళాభివృద్ధి నిధి... సంఘాల్లో వున్న మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరచడానికి మహిళాభివృద్ధి నిధి కీలకం. ప్రతి సంఘం పేరిట ఆర్డీటి సంస్థ కొన్ని లక్షల రూపాయలు ( సంఘంలోని సభ్యుల సంఖ్యను, వారి అవసరాలను బట్టి) బ్యాంకులో నిల్వచేయడం జరుగుతుంది. సంఘంలోని మహిళల ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వారు ఏవైనా చిన్నచిన్న వ్యాపారాలు, పాడిపశువులు, గొర్రెలు తదితరాలకోసం ఈ నిధి నుంచి రుణం ఇవ్వడం జరుగుతుంది.
ముందుగా వ్యాపారం, ఇతర పాడిపశువుల కోసం మహిళలకు రుణాలిచ్చే ముందు వారు ఎన్నుకున్న వ్యాపారంలో వారికి అనుభవం వుందా..లేదా.. అని పరిశీలించి ఎటువంటి నష్టం వాటిల్లకుండా లాభపడుతూ అభివృద్ధి చెందేందుకు వారికి అవగాహన పెంచడం జరుగుతుంది. అనంతరం వారికి మహిళాభివృద్ధి నిధినుంచి వారు చేబట్టదలచిన వ్యాపారానికి అవసరమైనంత మొత్తాన్ని ఇస్తారు. తిరిగి ఆ మొత్తాన్ని ఎటువంటి వడ్డీ లేకుండా మహిళాభివృద్ధి నిధి పద్దులోకి జమచేయాల్సి వుంటుంది. ఈవిధంగా పాడిపశువులు, గొర్రెలు, కూల్‌డ్రింక్ షాపులు, కిరాణా షాపులు, ఇతర దుకాణాలను ఏర్పాటు చేసుకుని ఆర్డీటి సంస్థ అందజేసే మహిళాభివృద్ధి నిధి ద్వారా ఎన్నో కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో సంతోషంగా జీవనం కొనసాగిస్తున్నారు.
ఉమెన్ టు ఉమెన్ ... ఆర్డీటి సంఘాల్లోని ప్రతి మహిళను వ్యాపారవేత్తగా తయారుచేయడం ఈ ఉమెన్ టు ఉమెన్ ముఖ్య ఉద్దేశ్యం. సంఘాల్లోని మహిళల పేరిట ఒక్కో మహిళకు రూ 4వేలు చెప్పున బ్యాంకుల్లో 7 సంవత్సరాల పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారు. 7సంవత్సరాలకు డిపాజిట్ చేసిన మొత్తం రూ 40వేలు వస్తుంది. ఆమొత్తాన్ని తీసుకుని ఏదైనా వ్యాపారం చేసుకునేందుకు ప్రోత్సహిస్తారు. ఈవిధంగా ఉమెన్ టు ఉమెన్ మహిళల వ్యాపారాభివృద్ధికి ఉపయోగపడుతోంది.
మహిళలు- ప్రోత్సాహం
మహిళలు పలు చేతి పనుల్లో రాణించే విధంగా శిక్షణ.. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వారికి ఇష్టమైన పలు చేతిపనులపై శిక్షణనిచ్చి పోత్రహిస్తున్నారు. ఇందులో భాగంగా టైలరింగ్, కుట్లు అల్లికలు, న్యాప్‌కిన్‌ల తయారీ, బుక్ బైండింగ్, ఫినాయిల్, అగరబత్తీల తయారీ తదితర చేతిపనులను నేర్పుతూ వారికి సంఘాల ద్వారా రుణాలిచ్చి వ్యాపార, కుటుంబ అభివృద్ధికి ప్రోత్సహించడం.
కౌన్సిలింగ్ సెంటర్‌లు... ఇళ్ళల్లో బాల బాలికలు, భార్యాభర్తల మధ్య ఏవైనా సమస్యలు తలెత్తి జీవితంపై నిరాశ చెంది ఆత్మహత్యలకు పాల్పడే మహిళలు చాలామంది వుంటారు. సంఘాల ద్వారా ఎక్కడైనా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న మహిళలను గుర్తించి కౌన్సిలింగ్ ద్వారా ఆ మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి మీకు అండగా ఆర్డీటి వుందన్న భరోసా కల్పించి వారికి భవిశ్యత్తుపై ఆశ కల్పించడం.
కుటుంబం - అభివృద్ధి
విద్య...వైద్యం.. సంఘాల్లో వున్న మహిళల పిల్లలకు విద్యలో రాణించే విధంగా ప్రాథమిక విద్య స్థాయి నుంచే తర్ఫీదునివ్వడం. బాలికలు ఉన్నత విద్యలో రాణించే బాలికలను కార్పొరేట్ కళాశాలల్లో చదివించి వారికి డాక్టర్, ఇంజనీరింగ్ కోర్సులకోసం ప్రత్యేక శిక్షణనిప్పించడం, వారు డాక్టర్, ఇంజనీరింగ్ ఎంట్రెన్స్‌లలో రాణించి సీటును సంపాదిస్తే వారి చదువు పూర్తయ్యేంతవరకు ఆర్డీటి పూర్తీగా అండగా నిలుస్తోంది.
అనాథలకు, బుద్ధిమాద్యం, చెవిటి, మూగ బాల బాలికలకు అన్ని విధాలా ఆదుకుంటూ విద్యలో రాణించేవిధంగా వారికి తోడుగా నిలుస్తోంది ఆర్డీటి. అనారోగ్యం పాలైతే వైద్య చికిత్సలు కూడా చేయించుకోలేని కుటుంబాలకు ఆర్డీటి స్థాపించిన ఆసుపత్రుల ద్వారా ప్రతి రోజూ వేలమందికి వివిధ విభాగాల్లో వైద్య చికిత్సలు అందజేస్తోంది. ఆర్డీటి స్థాపించిన ఆసుపత్రులో లేని వైద్య చికిత్సలు అవసరమైన రోగులకు బెంగుళూరు, నెల్లూరు, తిరుపతి తదితర నగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్య చికిత్సలు చేయిస్తూ వేల మందికి మరోజన్మను ప్రసాదించింది ఆర్డీటి. ఇళ్ళు... ఆర్డీటి సంఘాల్లో వుండే పేద, బడుగు బలహీన వర్గాల వారికి ఇళ్ళను నిర్మింపజేసి నిలువనీడనిస్తోంది. ఆర్డీటి పని చేస్తున్న అన్ని జిల్లాల్లోనూ ఇప్పటి వరకు నిర్మింపజేసిన గృహాలన్నీ మహిళల పేరిటే వుండటం గమనార్హం...( ఇవన్నీ కేవలం మహిళలకు సంబంధించినవే.. ఆర్డీటి సంస్థ ఇంకా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ పేదల ఇంట దీపమై చీకట్లో మగ్గుతున్న జీవితాలకు వెలుగునిస్తోంది.) ప్రతి ఏటా మార్చి నెల వచ్చిందంటే చాలు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్డీటి సంఘాలున్న ప్రతి గ్రామంలోనూ ఒక్కో రోజు ఓచోట పెద్ద పండుగలా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
మహిళలు- భరోసా
ఆర్డీటి సంస్థ నిరుపేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహిళలకు అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు చేస్తున్న కృషి, అందజేస్తున్న ఆర్థిక ప్రోత్సాహం, పెంపొందిస్తున్న ఆత్మస్థైర్యం, అన్నివిధాలా మీకు అండగా ఆర్డీటి వుందన్న భరోసా, ఇలా చాలా విషయాలను ఈ మహిళా దినోత్సవ సంబరాల్లో మహిళలు నెమరేసుకుంటూ వారి జీవితాల్లో వెలుగు నింపుతున్న ఆర్డీటి వ్యవస్థాపకులు శ్రీ కీ.శే.్ఫదర్ వినె్సంట్ ఫెర్రర్ గారిని , మహిళాభివృద్ధికి ఆర్డీటీలో అన్నీ తానై వ్యవహరిస్తున్న శ్రీమతి అనే్న ఫెర్రర్ గారిని, ప్రస్తుతం ఆర్డీటి సంస్థ బాధ్యతలను తన భుజాలపై వేసుకుని సంస్థ ద్వారా పేదల అభివృద్ధికి అనునిత్యం శ్రమిస్తున్న శ్రీ మాంచో ఫెర్రర్‌లను తమ ఇంటి దేవుళ్ళుగా మహిళలు కీర్తించడం అభినందనీయం.

చిత్రాలు.. మహిళా దినోత్సవంలో సంఘ సభ్యులు
*యన్‌యండి - పేదలతో శ్రీమతి అనే్నఫెర్రర్

-నల్లమాడ బాబ్‌జాన్ సెల్ - 949272259