సబ్ ఫీచర్

సల్వార్ సొగసు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవిలో ఉష్ణోగ్రతలు నానాటికి పెరిగిపోతున్నట్లే ఫ్యాషన్ ప్రపంచంలో సల్వార్ కమీజ్ కొత్త అందాలు చోటుచేసుకుంటున్నాయి. వొంటికి నప్పేలా..మనసుకు హాయినిచ్చే కాటన్ వస్త్రాలు ఈ కాలంలో కొత్త సొగసును అందిస్తాయి. అందులోనూ ఇది ఫంక్షన్ల సీజన్. అమ్మాయిలు సీతాకోక చిలుకల్లా సొగసుగా..సౌకర్యవంతంగా కనిపించాలంటే కాటన్ సల్వార్ కమీజ్‌లనే యువతులు, గృహిణులు ఇష్టపడుతుంటారు. వీటికి చెమటను పీల్చే గుణం అధికం. సల్వార్ కమీజ్‌ల అందం ఈనాటిది కాదు. మొఘలుల కాలం నుంచి ఉంది. దేశమంతా విస్తరించిన ఈ సల్వార్ కమీజ్‌లు నేటి ఫ్యాషన్ నిపుణులకు కొంగు బంగారమైంది. భానుడి భగభగలను తట్టుకోవాలంటే వొంటికి చల్లదనాన్ని ఇచ్చే లేత రంగులతో డిజైన్ చేసిన డ్రెస్స్‌లు వినూత్నంగా ఉంటాయి. లేత ఉదా, కనకాంబరం రంగులు మేళవించిన పూల డిజైన్‌తో ఉన్న సల్వార్ కమీజ్ యువతులకు సౌకర్యవంతంగా ఉంటుంది. టాప్‌ను ముదురు రంగుల పువ్వులతో డిజైన్ చేసి అదే రంగు దుప్పటాతో కలిసి బాటమ్‌ను లేత రంగుతో మేళవించిన మెత్తటి కాటన్ సల్వార్ కమీజ్ డ్రెస్స్‌ను వదులుగా స్టిచ్చింగ్ చేయించుకుని వేసుకుంటే స్టయిల్‌గా ఆకట్టుకుంటుంది. ముదురు బోర్డర్ రంగులతో లేత పింక్ కలర్‌తో ప్రింటైన డ్రెస్స్ కంటికి ఇంపుగా ఉంది. టాప్ లేతవర్ణంలోనూ, ప్యాంట్ ముదురు వర్ణంలో ఉన్నప్పటికీ రెండు రంగుల మేళవింపుతో వసంత శోభను తెచ్చిపెడుతోంది. లేత ఆకుపచ్చ ప్యాంట్, లేత పింక్ కలర్‌లో టాప్ డిజైన్ చేయటంతో వర్ణ వైవిధ్యంతో పార్టీవేర్‌గా వేసుకోవచ్చు. లైట్ కలర్ సల్వార్ కమీజ్‌లకు కొత్త కొత్త డిజైన్లు అద్దుతున్నారు. మనకు కావల్సిన రంగుల్లో లభిస్తున్న అలాంటి కొన్ని సల్వార్ కమీజ్‌లు ఇవి.