సబ్ ఫీచర్

టాన్‌ను తొలగించేద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవిలో ఎండ ప్రభావానికి చర్మం కాంతి విహీనంగా మారుతుంథి. ముఖ్యంగా బయట తిరిగేవారికి ఇది సర్వసాధారణం. ఎండలో తిరిగేవారి చర్మం తొందరగా నల్లగా (టాన్) మారిపోతుంది. దుమ్మూ, ధూళి చేరి చర్మం మృదుత్వాన్ని కోల్పోతుంది. ఇలాంటి సమయంలో చర్మానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి.
* చర్మంపై టాన్, మృతకణాల వంటివి ఎండలో తిరిగేవారికి సహజంగా ఎదురయ్యే సమస్యలు. వీటిని నివారించేందుకు అరకప్పు ఓట్‌మీల్‌లో నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యం రవ్వ, పావు కప్పు కీరదోసరసం, కొద్దిగా పాలు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడా, చేతులకు బాగా పట్టించి కాసేపు ఆరనివ్వాలి. తరువాత నీటితో తడుపుతూ నెమ్మదిగా నలుగులా రుద్దితే మృతకణాలన్నీ తొలగిపోతాయి. ముఖంపై పేరుకున్న టాన్ వదిలిపోతుంది. చర్మం మృదువుగా, అందంగా ఉంటుంది.
* పావుకప్పు బత్తాయి రసం, పావు కప్పు క్యారెట్ రసం, పావు కప్పు నిమ్మరసాలను తీసుకుని బాగా కలపాలి. దీన్ని ముఖానికి రాయాలి. ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి. అంతే ముఖంపై ఉన్న మురికి తొలగిపోయి, చర్మం అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది.
* అరకప్పు పెరుగులో పావుకప్పు కీరదోసరసం, చెంచా తేనె, రెండు చుక్కల ఆలివ్ నూనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఎండ తగిలే శరీర భాగాలైన ముఖం, మెడ, చేతులకు రాసుకోవాలి. ఆరిన తర్వాత చల్లని నీళ్ళతో కడిగేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే శరీరంపై ఉన్న టాన్ తొలగిపోతుంది. చర్మం తాజాగా ఉంటుంది.
* కళ్ల కింద వాపు, నల్లటి వలయాలు ఉన్నప్పుడు బంగాళాదుంప రసంలో కొద్దిగా రోజ్‌వాటర్ కలిపి దాన్ని కళ్ళ చుట్టూ రాయాలి. తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
* ముఖం కాంతి విహీనంగా ఉన్నప్పుడు పావుకప్పు కొబ్బరి నీళ్లలో రెండు చెంచాల పాలు, కొద్దిగా రోజ్‌వాటర్ కలిపి ముఖానికి రాసుకోవాలి. తరువాత సవ్య, అపసవ్య దిశల్లో కొద్దిసేపు మర్దన చేయాలి. ఇలా చేసినందువల్ల మురికి తొలగిపోయి, రక్తప్రసరణ చక్కగా జరిగి ముఖం తాజాగా కనిపిస్తుంది. *