సబ్ ఫీచర్

సంపూర్ణ ఆరోగ్యానికి ఆయుధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పది కాలాలపాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి, సమాజానికి మేలు చేస్తేనే మానవ జన్మకు సార్థకత. ఇలా ఉండాలంటే, ప్రతీ ఒక్కరూ తప్పక పాటించాల్సిన పద్ధతులు బోలెడు ఉన్నాయి. అబ్బే... టైం లేదు... అంతా బిజీబీజీ అయిపోతున్నాం... అంటున్నా వారిని తరచూ చూస్తుంటాం. అసలు ఈ బిజీబిజీ దేనికని ఒకమారు ప్రశ్నించుకుంటే, అసలు సంగతి బోధపడుతుంది. నిత్యం పనివత్తిడితో శారీరక, మానసికంగా కుంగిపోయి, ఆనక ఆ సంపాదించినదంతా ఆస్పత్రులకు అర్పించడానికేనా ఈ బిజీబిజీ జీవితం? కాదు... ఇది ఉత్తముల జీవనం ఏ మాత్రం కాదు.
తాను ఆరోగ్యంగా ఉంటూ, కుటుంబ సభ్యులు, సమాజానికి ఆరోగ్యాన్ని అందివ్వాలి. ఎన్ని పనులు ఉన్నా సమాయానికి ఆహారం తీసుకోవాలి. ఇందులో అన్ని విటమిన్లు ఉండేలా జాగ్రత్త పడాలి. ఇక భుజించడానికి ఓ పద్ధతి కూడా ఉంది. గాభరాగా కాకుండా నెమ్మదిగా తినాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారుగా పెద్దలు. దీనిని మననం చేసుకుని, ఆహారాన్ని బాగా నమిలి మింగాలి.
కడుపు ఖాళీగా ఉన్నప్పుడు పట్టించుకోకుండా అశ్రద్ధగా ఉంటే అనారోగ్య సమస్యలు రాకమానవు. ఆహారాన్ని నమిలి తినడం అనేది జీర్ణప్రక్రియలో ముఖ్యమైనదని, పిండి పదార్థాం ఎక్కువగా ఉండే ఆహారాలు లాలాజలం ద్వారానే 30శాతం జీర్ణమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నోట్లోనే బాగా నమిలితే, జీర్ణవ్యవస్థకు మనం కొంత సాయం చేసినవారవుతాం. వర్షాకాలంలో, చలికాలంలో ప్రస్తుత వేసవి కాలంలో ఇలా... ఆయా కాలాలకు అనుగుణంగా ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఈ పద్ధతులను పాటించడం వల్ల శరీరం ఆయా రుతువులను అనుగుణంగా మలుచుకొనేందుకు ఉపయోగపడుతుంది.
తగినన్ని కూరగాయలు, పప్పు దినుసులు, వివిధ రకాల ధాన్యాలను, పండ్లు ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి సమతుల్య ఆహారం అందించినట్టు అవుతుంది. కొంతమందికి కొన్ని రకాల ఆహారాలు, నూనెలు వంటివి తీసుకుంటే అప్పటికప్పుడు ఎలర్జీలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇటువంటి సమయంలో అశ్రద్ధ చేయకుండా సమీపంలోని వైద్యుని సంప్రదించడమే మేలు.
వ్యాయామం, నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే ఒక్క పౌష్టిక ఆహారమే కాదండోయ్... ప్రతీ రోజూ వ్యాయామం, తగినంత నిద్ర అవసరమే. వ్యాయామంటే ఏదో వంద బస్కీలు, వంద సూర్యనమస్కారాలు కాదు... ఆయా శరీరాలకు తగ్గట్టుగా అంటే వృద్ధాప్యంలో నడక ఎంతో మేలు చేస్తుంది. అలాగే యవ్వనంలో కాస్తంత సూర్యనమస్కారాలు లేదా యోగా చేయాల్సిందే. కొంతమంది ప్రతి చిన్న పనికీ రెండు చక్రాల వాహనానే్న ఆశ్రయిస్తారు. ఇలా చేయడం వల్ల శరీరానికి మంది కాదు... పైపెచ్చు వాతావరణంలో కాలుష్యం, పెట్రోల్ వృథా! ఇకపోతే, నిద్ర... మానసికంగా, ఆరోగ్యకరంగా మనిషి ఎదగాలంటే నిద్ర ఎంతో అవసరం. వీటితోపాటు మంచివారితో స్నేహం కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. మానసిక ఒత్తిడులు సమసిపోతాయి. మీ సమస్యను అవతలి వారికి చెప్పడం వల్ల హృదయం కొంత తేలికవుతుంది. ఒకవేళ వారి వల్ల ఆ సమస్యకు పరిష్కారం దొరకొచ్చు కూడా... ఇక మీదే ఆలస్యం... ఆరోగ్య సూత్రాలు పాటించి, సంపూర్ణ ఆరోగ్యవంతులు కండి... ఇరుగుపొరుగు వారికి ఆదర్శంగా నిలవండి!

-జి.కల్యాణి