సబ్ ఫీచర్

గోపికలు మెచ్చిన గోవు లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్క ఇల్లాలునే ఇంట్లో స్వచ్ఛమైన వాతావరణాన్ని తేగలదు. పరిశుభ్రతను నెలకొల్పగలదు. ఇంట్లో ఉన్నవారందరి చిన్న పెద్దా అందరి ఆరోగ్యాన్ని రక్షించగలదు. అందుకే ఇంటిని చూసి ఇల్లాలిని చూడండి అన్నారు. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలన్నా, ఏ వస్తువును ఎంత మేరకు తినాలన్నా అందరూ ఆ ఇల్లాలు మీదనే నేటికీ ఆధారపడుతునే ఉన్నారు.
అందరి ఆరోగ్యాన్ని చూడగల శక్తి కేవలం ఇల్లాలుకే ఉంటుంది. అందరూ అన్నీ పనులు చేస్తారు. కాని కొన్ని పనుల్లో ప్రత్యేకత, నాణ్యత కావాలంటే కేవలం స్ర్తిలే దానికి తగిన వారుగా చెప్తారు. ఈవిషయంలో సర్వేలు కూడా నూటికి నూరు మార్కులు స్ర్తిల పక్షానికే వేస్తున్నారు. అంతటి బాధ్యతను, నైపుణ్యాన్ని ప్రదర్శించే స్ర్తి గోవు నుంచి వచ్చే లభించే పంచగవ్యాల గురించి తెలుసుకొంటే మరింత నాణ్యమైన ఆరోగ్యాన్ని తన వారికి ఇవ్వవచ్చు. కనుక ఈ రోజు పంచగవ్యాల గురించి తెలుసుకొందాం.
యజ్ఞాలు, హోమాలు నిర్వహించే యజమాని పంచగవ్య ప్రాశన చేయడం తప్పనిసరి.గోవు నుంచి లభ్యమయ్యేవి పంచగవ్యాలు
పాలు: గంగిగోవు పాలు గరిటెడైననూ చాలు.. అని ఆ రోజుల్లో వేమన తెలిపాడు. ఈ రోజు మనం ఆ ఖరము కంటే, అధమమైన పాలు స్వీకరిస్తున్నాము. కపిల గోవు పాలు తాగడం వల్ల వాతం, జలుపు మొదలైన వాటిని తగ్గిస్తుంది. తెల్లగోవు పాలు తాగడం వల్ల అతివేడి తగ్గుతుంది. ఎర్రని గోవుని పాలు తాగడం వల్ల పైత్యానికి చాలా మంచిదని పెద్దలు చెబుతారు. అప్పుడే పుట్టిన పసిపిల్లవానికి తల్లిపాలు తర్వాత ఆవు పాలు మంచివని నేటి వైద్యులు కూడా చెబుతున్నారు. ఆవుపాలు చిన్న గోధుమ రంగులో ఉంటాయి. ఇవి బంగారు ధాతువుకు సంకేతం. దగ్గరగా వచ్చిన యజమానిని గోవు వాసన చూసి, రుగ్మతను కనిపెట్టి, ఆ నాటి మేతలో అందుకు అవసరమైన మూలికలను మేస్తుంది. అందుకే గోవును గోమాత అంటారు.
పెరుగు, వెన్న: భగవంతుని అర్చనాదుల్లో వివాహాది శుభకార్యాల్లో ‘మధుపర్కము’ అనే ఔషధాన్ని ఇస్తారు. ఇది పెరుగు, తేనె కలిసిన పదార్థాము. దీనిని తీసుకోవడం వల్ల వీర్య వృద్ధి, ధాతు పుష్టి కలుగుతుంది.
వెన్న సేవించడం వల్ల నిర్మలమైన తెల్లని కరిగిపోయే మనస్థితి కలుగుతుంది. ఇక, నెయ్యి... పెరుగు నుంచి వెనె్న ద్వారా కాచిన నెయ్యి వల్ల చెడు కొలస్ట్రాల్ ఉండదు. అలాగే, ఆవు నెయ్యి ఎక్కువగా తీసుకోవడం వల్ల మనిషి మేధస్సు బాగా పెరుగుతుంది. ఈ నెయ్యిని దర్భలతో శుద్ధి చేసి, ఆజ్యంగా మార్చి హోమగుండాలలో వెయ్యిటం వల్ల ఆ హోమధూమం వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి, మంచి వర్షాలను కురిపిస్తుంది.
గోజలం : ఇది చాలా అపురూపమైనది. ఈ గోజలాన్ని తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధుల భయం ఉండదు. ఈ మధ్య ఒక జాతి గోజలం నుంచి బంగారాన్ని తీయడం విన్నాము. అలాగే, ఈ గోజలం వల్ల అనేకమైన ఔషధ విలువలు ఉన్నాయని లోకం కోడైకూస్తోంది.
గోమయం : పూర్వకాలం గోమయంతో శుద్ధి కార్యక్రమాలు చేసేవారు. అలా చేయడం వల్ల హాని కలిగించే సూక్ష్మక్రిములు రావు. పొలాల్లో కూడా గోజలయంతో కలిపిన గోమయాన్ని చల్లడం వల్ల పంటకు హాని చేసే తెగుళ్ళు రావు. గోమయకుప్పలో పిడుగుపడితే, బంగారం అవుతుందని అవుతుందని పెద్దలు చెబుతారు. ధనుర్మాసంలో పెట్టిన గొబ్బిళ్ళను రథసప్తమి నాడు ఉపయోగించి, పాలు కాయడం వల్ల ఆ పిడకల బూడిద కచ్చికగా మారి దానితో దంతావధానం చేయడం వల్ల పళ్ళు శుభ్రపడడమే కాక ఒక రకమైన గుండె క్యాన్సర్ రాకుండా నిలువరిస్తుంది. హిమాలయాలలో సన్యాసులు కేవలం గోచితో ఉండి, ఒళ్ళంతా ఈ గోవు పిడకలతో వచ్చిన విబూదిని పూసుకుంటారు. ఈ విబూదిలో 40శాతం అక్సిజన్ ఉండడం వల్ల వారికి అక్కడ ఆక్సిజన్ సమస్య ఉండదు. గో ఆధారిత పంటలు పండించడం వల్ల జాతీయ ఆర్థిక అభివృద్ధి అనంతంగా పెరగవచ్చు.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే, ఒక పాశ్చాత్య శాస్తవ్రేత్త ‘కౌ ఈజ్ యే మూవింగ్ లేబరేటరీ’ అనే పుస్తకాన్ని రాశాడు. అందువల్లనే మన పూర్వీకులు గోజాతిని ఎంతో పూజించేవారు. వివాహం, గృహ ప్రవేశం వంటి శుభకార్యాల్లోనే కాక పితృకార్యాల్లో సైతం భారీగా గో దానాలు చేసేవారు.

-కిళాంబి వెంకట శేషాచార్యులు ఫోన్: 9290065289