సబ్ ఫీచర్

జాగ్రత్తలు తప్పని సరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుకొన్నది సాధించేది మహిళలే. అందుకే నేటి కార్యాలయాల్లోకూడా మహిళలను కీలక పోస్టుల్లో నియమించడానికి ముందుకు వస్తున్నారు. ఇంతకుముందుకాలంలో వంటింటికే పరిమితం గా ఉన్నా కూడా నేడు మాకు పరిమితన్నది లేదని నిరూపిస్తున్నారు.
కాని అకతాయి వేషాలు వేసే వారు కొందరు ఉన్మాదుల వల్ల నేటి మహిళలకు ముప్పు పొంచే ఉంది. ఎక్కడ ఒంటరిగా దొరికితే చాలు వారిని మానవ మృగాలు మాటలతోనో, చేతలతోనో హింసించడం మానడంలేదు. వారిని ఎదుర్కోవడం అంటే కొరివితో గోక్కోవడమే అవుతుంది. అయితే ఇట్లాంటి మానవ మృగాలు తయారు కాకుండా చూసుకోవడమనే బాధ్యత నేటి మహిళలపైనే ఎక్కువగా ఉంది.
ఎందుకంటే రేపటి తరాన్ని తయారు చేసేది మహిళలే. నేటి కంపూట్యర్ యుగంలో ఆడ మగ తేడాల్లేకుండా పనులు చేస్తున్నారు. కాని పిల్లల పెంపక విషయంలో మాత్రం మగవారికన్నా మహిళలు ఎక్కువ పాత్ర వహిస్తున్నారు. అందుకే వారి బాధ్యతలూ కూడా ఎక్కువ అవుతోంది.
ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఇద్దరినీ సమానంగా చూస్తున్నారు కాని అక్కడ కూడా అక్కడక్కడా వ్యత్యాసం కనిపిస్తోంది. నేడు కొందరు మహిళలు ఆడపిల్లల్ను సరిగా చూసుకొని మగపిల్లలను గాలికి వదిలేస్తున్నారు. దాంతో వారు అటు చదువుకు ఇటు సంస్కారానికే దూరమవుతున్నారు. ఇది కూడా మంచిది కాదు. కొంతమంది పెళ్లి అవగానే తల్లిదండ్రులను ఏవిధంగా వదిలించుకోవాలో ప్రణాళికలు వేస్తున్నారు.
కొందరు క్రూరంగా ప్రవర్తిస్తే మరికొందరు నయవంచకులుగా తయారై ముసలి వయస్సులో పని చేయడానికి చేతకాని వారిని గాలికి వదిలేస్తున్నారు. ఇటువంటి వారే వృద్ధాశ్రమాలకు వెళ్లుతున్నారు. వారిలో డబ్బులేనివారు ఎంతో వ్యధకు గురవుతున్నారు. కనుక మహిళలు ఈ విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మహిళలు తల్లిదండ్రులను ఏవిధంగా ప్రేమగా చూసుకొంటున్నారో అత్తమామలను కూడా చూసుకోవాల్సిన బాధ్యతను వీరు భుజాలకెత్తుకోవాల్సిందే. అపుడే వారికి ఆదరణ దొరుకుతుంది. అప్పుడన్నా కొడుకులు కళ్లు తెరుస్తారు.
అట్లానే అనాథాశ్రమాలు పెరుగుతున్నాయి. ప్రమాదాల బారిన పడి కొంతమంది పిల్లలు అనాథలైతే మరికొద్దిమంది మాత్రం దగాబడ్డ మహిళ వల్లనో లేక మోసపోయిన మహిళవల్లో అనాథలు అవుతున్నారు. వీరి సంఖ్యా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. నేడు ఎంతో టెక్నాలజీ పెరిగింది. ఆధునిక రంగంలో స్ర్తి ఏ వీధిన ఉన్నా ఆమెకు కావాల్సిన జ్ఞానం చాలావరకు మీడియా అందిస్తోంది. ఒకవేళ అట్లా జ్ఞానం సంపాదించుకోలేని వారు ఇంకా ఈ దేశంలో ఉన్నారు. అట్లాంటి వారికి మహిళలే బృందాలు ఏర్పడి వాడవాడలా తిరిగి మహిళలను మానవ మృగాలనుంచి ఏవిధంగా తప్పించుకోవాలో, ఒకవేళ అనువుగాని చోట ఉన్నా వారిని ఎలా ఎదుర్కోవాలో కూడా చెప్పాల్సిన బాధ్యత పదవుల్లో ఉన్న శిశుసంక్షేమాల మీద దృష్టిపెట్టే ప్రభుత్వం మీద స్వచ్చంధ సంస్థలమీద కూడా ఉంది. మహిళల్లో అవేర్‌నెస్ పెంచాల్సిన బాధ్యత సాధారణ మహిళలకూ కూడా ఉంది.
ఏ మహిళా మోసపోకుండా ఉంటే అనాథల సంఖ్య తగ్గవచ్చు. కనుక మహిళలకు అవాంఛనీయ సంఘటలను తలెత్తితే ఎదుర్కొనే శక్తి, దానితో పాటు ఆర్థికావలంబన పెంచుకునే శక్తిని కలిగేట్లుగా విద్యను అందించాలి. ఆ దిశగా ప్రభుత్వమూ, స్వచ్చంధ సంస్థలు పనిచేస్తే రాబోయే తరం శక్తివంతంగాను, సంస్కారయుతంగాను ఉంటుంది.
అప్పటిదాకా ఎన్ని చట్టాలు వచ్చినా, వాటిని అమలు పరిచినా కూడా మహిళలు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ప్రతి మహిళా ఒక శక్తిగా ఎదగాలి.

-శ్రీలత