సబ్ ఫీచర్

ఇదీ రుగ్మతేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంతమంది కొన్ని సందర్భాలల్లో ఎదుటివారితో మాట్లాడేటపుడు చాలా మొహమాటపడుతుంటారు. మరికొన్ని సందర్భాల్లో ఇష్టమైన వస్తువులు ఎదురుగా ఉన్నా వాటిని ఎదుటివాళ్లు తీసుకోమని చెబుతున్నా సరే వీరు తీసుకోలేక వద్దు వద్దండి, చాలండి అని చెబుతుంటారు. మనసులో నేమో తీసుకోవాలని ఉంటుంది. పైకిమాత్రం చెప్పలేరు. మరికొంతమంది ఎదుటివారు ఏమైనా అనుకుంటారనో, బాధపడతారనో, కోపం వస్తుందనో వారు కోరిన సహాయాన్ని చేయలేమని చెప్పలేని బలహీనతతో ప్రవర్తిస్తారు. ఎదుటివారు చెప్పిన పనులను నెత్తిన వేసుకుని, తమ పనులను వాయిదా వేస్తూ, తమ కాలాన్ని వృధా చేసుకుంటారు.
మరికొంతమంది గొప్పలకు పోయ ఎదుటివారి పొగడ్తలకు లొంగిపోయి వారు తమను మంచివారిగా అనుకొంటారని మెచ్చుకుంటారని అనుకొంటూ వారు చెప్పిన పని అంతా చేసేస్తుంటారు. ఆ పని చేయడంలో వీరికి ఇబ్బందులు తలయెత్తుతున్నా సరే బయటకు చెప్పుకోలేక దాచుకోలేక సతమతమవుతుంటారు.
ఇలాంటి మొహమాటస్తులను ఎదుటివారు తమ స్వార్థానికి వాడుకుంటారు. కొంతమంది తమ మాటల చాతుర్యంతో, గడుసుతనంతో ఎదుటివారిని మొహమాటానికి గురిచేసి, తమ కార్యాన్ని పూర్తిచేసుకుంటారు.
ఇంకొందరు, ఎంత మాత్రం మొహమాటపడకుండా, ఎదుటివారి వెహికల్‌ను, కెమెరాను, డిన్నర్ సెట్‌ను, ఇలాగే ఇంకెన్నో వస్తువులను అతి స్వతంత్రంగా అడిగేస్తారు. వస్తువులు అడగటంలో వారికి లేని మొహమాటం, ఆ వస్తువులు ఉన్న వారిలో ప్రవేశిస్తుంది. కంటికి ఎదురుగా కనిపించే వస్తువులను కాదని చెప్పలేక, ఇవ్వకుండా ఉండటానికి ఏ సాకు చెప్పి తప్పించుకోవాలన్నదీ అర్థంకాక మొహమాటంతో మధనపడిపోతారు.
వైద్యులైతే ఇది కూడా ఒకలాంటి రుగ్మత అంటారు. వీళ్లకు మనం అవతల వారికన్నా తక్కువ అనుకొంటారేమో నన్న ఆలోచనతో వీళ్లు వీళ్ల మనసులోని మాటను చెప్పలేకపోతుంటారు. ఈ ఆధునిక యుగంలోను ఈ తరహా మనుష్యులు ఉంటూనే ఉన్నారు. ముఖ్యంగా హాస్టల్స్‌లో ఉన్న పిల్లలు వారికిష్టమైనది తినలేక మరోసారి కావాలని అడగలేక కడుపుమాడ్చుకుంటూ జబ్బులు తెచ్చుకుంటున్నారు.
ఇష్టంతో ఏ కష్టమైన పనియైనా చేయవచ్చు. కాని ఇష్టం లేకుండా చిన్న పని కూడా చేయాలంటే కష్టంగా అనిపిస్తుంది. అందుకే పిల్లల్లో కొంతమంది తమకు అర్థం కాని పాఠాలను కూడా వారి లెక్చరర్స్‌ను అడగలేక తమ స్నేహితుల దగ్గర కూడా చెప్పలేక చదువులో వెనుకబడిపోతున్నారు. ఇట్లా చదువులో వెనుకబాటుతనం వారిని ఆత్మహత్యలకు కూడా పురికొల్పె సంఘటనలు ఏర్పడవచ్చుఅని డాక్టర్లు చెబుతున్నారు.
అందుకే ఇలా మొహమాట పడేవారిని ముందుగానే గుర్తించాలి. పిల్లలైతే వారి తల్లిదండ్రులు, పెద్దలైతే వారి ఇంటి మిగతాకుటుంబ సభ్యులు చొరవతీసుకొని వారికి మెల్లగా నచ్చచెప్పాలి. వారు ఎవరికన్నా తక్కువ వారు కాదని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. అడగనిదే అమ్మైనా పెట్టదు అని నచ్చచెప్పాలి.
అందరికీ అన్నీ తెలియవని, కాలం జరుగుతుండే కొలదీ, లేకపోతే చదువుకుంటూ ముందుకు వెళ్తున్న కొలదీ జ్ఞానం పెరుగుతుందని రోజూ ప్రపంచాన్ని చూస్తూ మన చుట్టూర జరిగే వ్యవహారాలను చూస్తున్నపుడు, ఇతరులు ఏవిధంగా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నపుడు జ్ఞానం పెరుగుతూ వస్తుందని ఇది అందరి విషయంలోను జరిగేదే అని అందుకే ఏవిధమైన మొహమాటాలకు, గొప్పలకు పోకుండా ఏవిషయాన్నైనా నిర్మొహమాటంగా పైకి చెప్పాలని అని పిల్లలకైనా, పెద్దలకైనా నచ్చచెప్పాలి.
అపుడు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆహారంలో, వ్యవహారంలో మొహమాటం పనికిరాదు22 అని పెద్దలు చెప్పారు. ఆ మాట అక్షరాలా నిజం. మనల్ని ఇబ్బందుల్లో పడేసే, సమస్యలకు గురిచేసే, అశాంతిని కలిగించే మొహమాటాన్ని వదిలేసి ప్రవర్తించగలగాలి.

- జి. కల్యాణి